E-Paper
Advertisement

Smartphone Comparison: ఒప్పో రెనో 15 vs వన్ ప్లస్ 15R vs వివో X200 FE.. కొత్త ఫోన్లలో ఏది బెస్ట్?

Smartphone Comparison: ఒప్పో రెనో 15 vs వన్ ప్లస్ 15R vs వివో X200 FE.. కొత్త ఫోన్లలో ఏది బెస్ట్?

Oppo Reno 15 vs వన్‌ప్లస్ 15R vs వివో X200 FE Smartphone Comparison| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజా ఒప్పో రెనో 15 లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫోన్ తైవాన్‌లో మాత్రమే విడుదల చేసింది. త్వరలో భారత మార్కెట్ లో విడుదల కాబోతోంది. ఇండియాలో ఈ ఫోన్ కు పోటీగా వన్‌ప్లస్ 15R, వివో X200 FE ఉన్నాయి. మూడు ఫోన్‌లు ప్రీమియం ఫీచర్లు ఇస్తున్నాయి. మూడింటిలో ఏ ఫోన్ కొనుగోలు చేయాలో తెలుసుకునేందుకు వాటి ధర, డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ, డిజైన్‌లను పోల్చి చూద్దాం.

ధరలు

ఒప్పో రెనో 15 12GB ర్యామ్ +256GB స్టోరేజ్ వేరియంట్ ధర తైవాన్ కరెన్సీ TWD 17,990 (భారత కరెన్సీలో దాదాపు రూ.51,000),12GB+512GB వేరియంట్ ధర TWD 19,990 (సుమారు రూ.55,000).
వన్‌ప్లస్ 15R 12GB ర్యామ్ +256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.47,999, 12GB+512GB వేరియంట్ ధర రూ.52,999.
వివో X200 FE 12GB ర్యామ్ +256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999, 16GB+512GB ధర రూ.59,999.
మూడింటిలో వన్ ప్లస్ ధర పరంగా తక్కువ. కానీ 16GB వేరియంట్ తో ఆకర్షణీయంగా ఉంది.

డిస్‌ప్లే, రిజల్యూషన్

ఒప్పో రెనో 15లో 6.59 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2760×1256 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్ ఇస్తుంది.
వన్‌ప్లస్ 15Rలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2800×1272 పిక్సెల్స్, 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్.
వివో X200 FEలో 6.31 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2640×1216 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
వన్‌ప్లస్ 15R అత్యధిక రిఫ్రెష్ రేట్ తో బెటర్ ఆప్షన్. కానీ వివో X200 FE అవుట్‌డోర్ వినియోగానికి మంచి బ్రైట్‌నెస్‌ ఇస్తుంది.

ప్రాసెసర్, OS

ఒప్పో రెనో 15లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంది. కలర్ ఓఎస్ 16 ఆండ్రాయిడ్ 16 ఆధారితం. వన్‌ప్లస్ 15Rలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఉంది. OxygenOS 16 ఆండ్రాయిడ్ 16 ఆధారితం. వివో X200 FEలో మిడియాటెక్ డైమెన్సిటీ 9300+ ఉంది. ఫన్ టచ్ OS 15 ఆండ్రాయిడ్ 15 ఆధారితం. వన్‌ప్లస్ 15R రా ప్రాసెసింగ్ పవర్‌లో లీడ్ చేస్తుంది. గేమింగ్, హెవీ యాప్‌లకు సరిపోతుంది.

బ్యాటరీ, చార్జింగ్

ఒప్పో రెనో 15లో 6500mAh బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. వన్‌ప్లస్ 15Rలో 7400mAh పెద్ద బ్యాటరీ ఉంది. 80W సూపర్ ఫ్లాష్ చార్జింగ్ ఉంది. వివో X200 FEలో 6500mAh బ్యాటరీ ఉంది. 90W ఫ్లాష్ చార్జింగ్ ఉంది. మూడు ఫోన్‌లు లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. వన్‌ప్లస్ 15R ఎక్స్‌టెండెడ్ వాడకానికి ఐడియల్.

కెమెరా సెటప్

ఒప్పో రెనో 15 రియర్ కెమెరా: 50MP వైడ్, 8MP అల్ట్రా-వైడ్, 50MP టెలిఫోటో; 50MP ఫ్రంట్ కెమెరా.
వన్‌ప్లస్ 15R రియర్ కెమెరా: 50MP ప్రైమరీ OISతో, 8MP అల్ట్రా-వైడ్; 32MP ఫ్రంట్ కెమెరా.
వివో X200 FE రియర్ కెమెరా: 50MP ప్రైమరీ, 8MP వైడ్, 50MP పెరిస్కోప్; 50MP ఫ్రంట్ కెమెరా.
వివో X200 FE టెలిఫోటో ఫొటోగ్రఫీలో బెస్ట్. ఒప్పో రెనో 15 బ్యాలెన్స్‌డ్ ట్రిపుల్ కెమెరా పనితీరు ఇస్తుంది.

కనెక్టివిటీ ఆప్షన్లు

ఒప్పో రెనో 15లో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, USB-C ఉన్నాయి. వన్‌ప్లస్ 15Rలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, డ్యూయల్ 4G VoLTE, USB-C ఉన్నాయి. వివో X200 FEలో డ్యూయల్ SIM 5G, LTE, Wi-Fi 2.5, బ్లూటూత్ 5.4, GPS, OTG, USB-C 2.0 ఉన్నాయి. వన్‌ప్లస్ 15R అడ్వాన్స్‌డ్ వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఇస్తుంది.

డైమెన్షన్స్, వెయిట్

ఒప్పో రెనో 15 సైజ్ 158×74.83×7.89mm, బరువు 197g. వన్‌ప్లస్ 15R సైజ్ 163.41×77×8.1mm, బరువు 218g. వివో X200 FE సైజ్ 150.83×71.83×7.99mm, బరువు 186g. వివో X200 FE అతి కాంపాక్ట్, లైట్‌వెయిట్. వన్‌ప్లస్ 15R అతి పెద్దది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం అద్భుతమైన ఫోన్స్.. మిడ్ రేంజ్‌‌లో బెస్ట్ ఇవే..

ఏది కొనాలి?

ఒప్పో రెనో 15 తక్కువ ధరలో ధరలో బలమైన కెమెరా పర్‌ఫామెన్స్, పెద్ద బ్యాటరీ ఇస్తుంది. వన్‌ప్లస్ 15R ప్రాసెసర్, డిస్‌ప్లే, కనెక్టివిటీలో బెస్ట్. వివో X200 FE టెలిఫోటో కెమెరా, హై బ్రైట్‌నెస్ డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్ ఇస్తుంది. మీ ప్రాధాన్యతల ఆధారంగా బెస్ట్ ఫోన్ కొనుగోలు చేయండి.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×