E-Paper
Advertisement

Smartphone comparison: ఒప్పో రెనో 15 vs రియల్‌మి 16 ప్రో ప్లస్.. రూ.50000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone comparison: ఒప్పో రెనో 15 vs రియల్‌మి 16 ప్రో ప్లస్.. రూ.50000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?
Advertisement

Oppo Reno 15 5G vs Realme 16 Pro Plus Smartphone comparison| మార్కెట్లో ఇటీవలే కొత్తగా రెండు ప్రీమియం ఫోన్స్ లాంచ్ అయ్యాయి. రెండూ రూ.50000 రేంజ్ ధరలో ఉన్నాయి. వీటిలో ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించడం కొంచెం గందరగోళంగా ఉంది. ఒప్పో రెనో 15 5G, రియల్ మి 16 ప్రో ప్లస్ 5G.. రెండు ఫోన్లు కూడా ఒకే రేంజ్ కస్టమర్లను టార్గెట్ చేసుకున్నాయి. రెండు ఫోన్లలోనూ ఫ్లాగ్‌షిప్ స్టైల్ ఫీచర్లు, పవర్‌ఫుల్ కెమెరాలు, పెద్ద బ్యాటరీలు ఉన్నాయి. ఈ వివరణాత్మక పోలిక మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది.

ధర, అందుబాటు

ఒప్పో రెనో 15 5G భారతదేశంలో రూ.45,999 ధరతో లాంచ్ అయింది. ఇందులో 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఉంది. ట్విలైట్ బ్లూ, గ్లేషియర్ వైట్, ఆరోరా బ్లూ కలర్లలో లభిస్తుంది.
రియల్ మి 16 ప్రో ప్లస్ 5G ధర రూ.44,999. ఇది కూడా 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్‌తో వస్తుంది. మాస్టర్ గ్రే, మాస్టర్ గోల్డ్, కామెలియా పింక్ కలర్లలో అందుబాటులో ఉంది.

కెమెరా

Advertisement

ఒప్పో రెనో 15 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 200MP మెయిన్ సెన్సార్ (OISతో), 50MP టెలిఫోటో, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్‌లు ఉన్నాయి. 50MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలకు ఉంది.
రియల్ మి 16 ప్రో ప్లస్ 5Gలో కూడా ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. 200MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్), 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ ఉన్నాయి. 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.

డిస్‌ప్లే, డిజైన్

ఒప్పో రెనో 15 5Gలో 6.32 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. చిన్న సైజు వల్ల ఒక చేత్తో సులభంగా ఉపయోగించవచ్చు.
రియల్ మి 16 ప్రో ప్లస్ 5Gలో పెద్ద 6.8 ఇంచ్ డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. పెద్ద స్క్రీన్ ఇష్టపడే వారికి ఇది బాగుంటుంది.

పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

Advertisement

ఒప్పో రెనో 15 5Gలో మీడియా డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులు స్మూత్‌గా జరుగుతాయి. Android 16 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఎఫిషియెన్సీ ఆప్టిమైజేషన్ ఉంది.
రియల్ మి 16 ప్రో ప్లస్ 5Gలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ స్థిరంగా ఉంటాయి. Android 16తో పర్‌ఫామెన్స్ ట్యూనింగ్, రెస్పాన్సివ్‌నెస్‌పై దృష్టి పెట్టారు.

Also Read: స్లిమ్‌ ఫోన్‌లో 24GB ర్యామ్, 120w ఛార్జింగ్, ఫాస్ట్ ప్రాసెసర్.. రెడ్‌మ్యాజిక్ గేమింగ్ ఫోన్ వచ్చేస్తోంది

బ్యాటరీ, ఛార్జింగ్

ఒప్పో రెనో 15 5Gలో 6200mAh బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా పూర్తిగా ఉపయోగించవచ్చు.
రియల్ మి 16 ప్రో ప్లస్ 5Gలో పెద్ద 7000mAh బ్యాటరీ ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. రఫ్ యూసేజ్ అంటే ఫోన్ ఎక్కువసేపు ఉపయోగించేవారికి ఎక్కువ సమయం ఇస్తుంది.

ఫైనల్ విన్నర్ ఎవరు?

ఒప్పో రెనో 15 5G చిన్న డిజైన్, బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు ఇష్టపడే వారికి బెస్ట్.
రియల్ మి 16 ప్రో ప్లస్ 5G పెద్ద డిస్‌ప్లే, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
రెండు ఫోన్లూ రూ.50,000 లోపు బడ్జెట్‌లో ప్రీమియం పర్‌ఫామెన్స్ అందిస్తాయి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×