E-Paper
Advertisement

Soldier: తీవ్ర విషాదం.. పుట్టబోయే బిడ్డ కోసం వచ్చి మృత్యుఒడికి చేరిన సైనికుడు!

Soldier: తీవ్ర విషాదం.. పుట్టబోయే బిడ్డ కోసం వచ్చి మృత్యుఒడికి చేరిన సైనికుడు!
Advertisement

Soldier: మహారాష్ట్రలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. దేశాన్ని కాపాడే సైనికుడు, తన బిడ్డను చూసుకోకముందే కన్నుమూశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో హృదయాలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ, మాతృభూమి సేవలో నిమగ్నమైన సైనికుడు ప్రమోద్ జాదవ్, తన జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాల కోసం ఎదురుచూస్తూ అనంత లోకాలకు వెళ్ళిపోయారు. త్వరలో తండ్రి కాబోతున్నానన్న ఆనందంతో పితృత్వ సెలవులపై స్వగ్రామం పర్లీకి వచ్చిన ఆయన, విధి ఆడిన వింత నాటకంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.

Advertisement

ఏడాది క్రితమే వివాహం చేసుకున్న ప్రమోద్, నిండు గర్భిణీ అయిన తన భార్య ప్రసవం కోసం ఆత్రుతగా ఇంటికి చేరుకున్నారు. అయితే, విధి మరొకలా తలచింది. శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి ప్రేమను పొందే అదృష్టం ఆ బిడ్డకు లేకుండా పోగా, కన్నబిడ్డ రూపురేఖలను చూడకుండానే ఆ తండ్రి కన్నుమూయడం స్థానికులను కన్నీరుమున్నీరు చేస్తోంది.

ప్రమోద్ అంత్యక్రియలు ఆదివారం నాడు పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహించారు. దేశం కోసం సేవ చేసిన ఆ వీరుడికి తుది వీడ్కోలు పలికేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. అయితే, అక్కడ కనిపించిన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. పురిటి మంచం మీద ఉండాల్సిన భార్య, అప్పుడే పుట్టిన పసిగుడ్డుతో కలిసి తన భర్త కడచూపు కోసం ఘటనా స్థలానికి చేరుకోవడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఆ పసిపాప తన తండ్రి స్పర్శను కూడా అనుభవించకముందే అనాథగా మిగిలిపోవడం అత్యంత బాధాకరం.

Advertisement

Also Read: మంటల్లో ఇరాన్.. రంగంలోకి ట్రంప్? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు!

ఈ హృదయవిదారక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైనికుడిగా దేశానికి సేవలందించిన ప్రమోద్ జాదవ్ మరణం పట్ల నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కొత్త జీవం భూమి మీదకు వచ్చిన సంతోషం ఉండాల్సింది పోయి, ఇంటి దీపమై నిలవాల్సిన వ్యక్తి దూరమవ్వడంతో ఆ కుటుంబంలో నిశబ్ద విషాదం నెలకొంది. విధి ఎంతటి కఠినమైనదో ఈ ఘటన మరొకసారి నిరూపించింది.

Related News

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

Big Stories

Advertisement
×