HMD 2660 Flip Senior Edition: స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉండాలనుకునే పెద్దవాళ్ల కోసం HMD కొత్త ఫ్లిప్ ఫోన్‌ను తీసుకొచ్చింది. HMD 2660 Flip Senior Edition పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో ఏఐ కంపానియన్‌తో పాటు 4G సపోర్ట్, మార్చుకోగల బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులకు మాట్లాడేందుకు తోడుగా ఉండేలా ఇందులో Mary అనే ఏఐ సర్వీస్‌ను అందించారు. మరి ఈ ఫోన్ ధర ఎంత? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
HMD 2660 Flip Senior Edition ధర రూ.10,100 ఉంటుంది. ఈ ఫోన్ Cosy Black కలర్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ కొనుగోలు చేసిన వారికి Mary ఏఐ సర్వీస్‌ను ఐదు గంటల పాటు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ సర్వీస్ కావాలంటే నెలకు సుమారు రూ.2,100 చెల్లించాలి. ఎప్పుడైనా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు. అయితే, భారత్‌లో ఈ ఫోన్ విడుదల వివరాలను కంపెనీ ప్రకటించలేదు.
Also Read: శాంసంగ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 ఫోన్లకు అప్‌డేట్స్ ఎప్పటివరకంటే?
ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకునే ఫీచర్ మేరీ ఏఐ కంపానియన్. inTouch భాగస్వామ్యంతో దీన్ని అందించారు. మేరీతో మాట్లాడవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు, చిన్న చిన్న ఆటలు ఆడవచ్చు. గతంలో మాట్లాడిన విషయాలను గుర్తుంచుకుని, తర్వాతి సంభాషణల్లో వాటిని ఉపయోగించగలదు. పెద్దవాళ్లు సులభంగా అర్థం చేసుకునేలా నెమ్మదిగా మాట్లాడుతుంది. సమాధానం చెప్పేందుకు కూడా సమయం ఇస్తుంది. ఫోన్‌లో ప్రత్యేక బటన్ ఉండటంతో మేరీని సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సర్వీస్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
HMD 2660 Flip Senior Editionలో 2.8 అంగుళాల ప్రధాన డిస్‌ప్లే, 1.77 అంగుళాల బయటి స్క్రీన్ ఉన్నాయి. ఫోన్‌ను తెరిచి కాల్ మాట్లాడవచ్చు, మూసి కాల్ ముగించవచ్చు. Unisoc T107 ప్రాసెసర్, 64MB ర్యామ్, 128MB స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. వెనుకవైపు 0.3MP కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. FM రేడియో, MP3 ప్లేయర్, హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
ఇందులో 1,450mAh తొలగించగల బ్యాటరీ ఉంది. ఇది 8.1 గంటల వరకు కాల్ మాట్లాడేందుకు సరిపోతుందని కంపెనీ చెబుతోంది. 4G, బ్లూటూత్ 5.0, USB టైప్-C కనెక్టివిటీ ఉన్నాయి. IP54 రేటింగ్‌తో దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. ఫోన్ బరువు 136.4 గ్రాములు. సులభంగా వాడగల ఫోన్‌తో పాటు ఏఐ సాయాన్ని కోరుకునే పెద్దవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: భారత్‌లో యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ సేల్ షురూ.. స్టోర్‌కి వెళ్తే దొరుకుతుందా? లేక జనవరి దాకా ఆగాలా?