E-Paper
Advertisement

పాన్ కార్డు నెంబర్లు.. చిత్ర విచిత్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఇంత కథ ఉందా?

పాన్ కార్డు నెంబర్లు.. చిత్ర విచిత్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఇంత కథ ఉందా?
Advertisement

PAN Card: ప్రస్తుత రోజుల్లో ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలన్నా ‘పాన్ కార్డ్’ (PAN Card) తప్పనిసరి. అయితే ఈ పాన్ కార్డ్‌పై ఉన్న ఆ 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్‌ను ఎప్పుడైనా గమనించారా? ఇతర ఐడీ కార్డులతో పోలిస్తే.. చాలా విభిన్నంగా ఉంటాయి. అది ఏదో ర్యాండమ్ గా ఇచ్చిన నంబర్ కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దాని వెనుక ఒక పెద్ద కోడ్ దాగి ఉందని పేర్కొంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ కార్డు హోల్డర్ పూర్తి సమాచారాన్ని ఆ పది అంకెల్లోనే నిక్షిప్తం చేస్తుందని తెలియజేస్తున్నారు. ఇంతకీ పాన్ కార్డు నంబర్ల కథేంటో ఈ కథనంలో చూద్దాం.

తొలి మూడు అక్షరాలు

పాన్ కార్డ్‌లో మొదటి మూడు అక్షరాలు ఎల్లప్పుడూ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ AAA నుండి ZZZ వరకు ఉంటాయి. ఇవి ఆదాయపు పన్ను శాఖ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా సిరీస్ ప్రకారం కేటాయించబడతాయి. దీని వెనుక ఎలాంటి ప్రత్యేక వ్యక్తిగత సమాచారం ఉండదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

నాల్గో అక్షరం.. అత్యంత కీలకం!

Advertisement

పాన్ కార్డ్‌లో నాల్గవ స్థానంలో ఉండే అక్షరం ఆదాయ పన్ను శాఖ దృష్టిలో చాలా కీలకమైనదని నిపుణులు అంటున్నారు. ఇది సదరు కార్డ్ హోల్డర్ ‘స్టేటస్’ (ఆర్థిక గుర్తింపు)ను తెలియజేస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు నాల్గో అక్షరం ‘P’ అని ఉంటే పర్సన్ లేదా వ్యక్తులకు జారీ చేసిందని అని అర్థం. అలా కాకుండా ‘C’ అని ఉంటే కంపెనీ అని, ‘H’ ఉంటే హిందూ జాయింట్ ఫ్యామిలీ, ‘F’ అయితే భాగస్వామ్య సంస్థ, ‘A’ అసోసియేషన్స్, ‘T’ ఉంటే ట్రస్ట్ అని అర్థమని నిపుణలు స్పష్టం చేస్తున్నారు.

ఐదో అక్షరం.. ఇంటి పేరు

పాన్ నంబర్‌లోని ఐదో అక్షరం గుర్తింపును తెలియజేస్తుంది. వ్యక్తిగత పాన్ కార్డ్ (P) కలిగిన వారి విషయంలో ఇది వారి ఇంటి పేరు (Surname) లోని మొదటి అక్షరం అవుతుంది. ఉదాహరణకు మీ ఇంటి పేరు ‘కుమార్’ అయితే ఐదవ అక్షరం ‘K’ గా ఉంటుంది. అదే కంపెనీలకైతే వాటి పేరులోని మొదటి అక్షరం ఉంటుంది.

ఆరు నుండి తొమ్మిదో నంబర్ వరకు

Advertisement

పాన్ కార్డులో 6 నుంచి 9 తొమ్మిది వరకూ వచ్చే నాలుగు అంకెలు (0001 నుండి 9999 వరకు) కేవలం సంఖ్యలు మాత్రమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ రన్నింగ్ సిరీస్ ఆధారంగా ఈ నంబర్లను కేటాయిస్తుందని తెలియజేస్తున్నారు.

Also Read: సెకండ్ హ్యాండ్ మొబైల్, కార్, బైక్ కొంటున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి

ఫైనల్గా పదో అక్షరం సంగతేంటి?

పాన్ కార్డ్‌లో చివరిగా ఉండే 10వ అక్షరం ఒక ఆల్ఫాబెట్ చెక్ డిజిట్. కంప్యూటర్ సిస్టమ్ ఒక ప్రత్యేక ఫార్ములా ఆధారంగా ముందస్తు నంబర్లను విశ్లేషించి ఈ చివరి అక్షరాన్ని ఆటోమేటిక్ గా కేటాయిస్తుంది. దీని వెనుక ప్రత్యేకంగా ఎలాంటి లాజిక్ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెుత్తంగా చూస్తే పాన్ నంబర్ కేవలం వ్యక్తి ఐడెంటిటీ మాత్రమే కాదని.. అతడి ఆర్థిక చరిత్రను ప్రతిబింబించే ఒక కోడ్ అని స్పష్టం అవుతోంది. అందుకే దీన్ని ఎవరితోనూ అనవసరంగా పంచుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: స్మార్ట్ వాషింగ్ మెషీన్ కొంటున్నారా? 20 ఏళ్ల మోటార్ వారంటీతో పవర్‌ఫుల్ మోడల్స్‌

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×