E-Paper
Advertisement

ఫ్రిజ్,మొబైల్ బడ్జెట్‌లో అదిరిపోయే 43 ఇంచుల టీవీ..డోంట్ మిస్

ఫ్రిజ్,మొబైల్ బడ్జెట్‌లో అదిరిపోయే 43 ఇంచుల టీవీ..డోంట్ మిస్
Advertisement

Philips 43 inch Smart Google TV: ప్రస్తుతం మన వంటింట్లో.. లేదా హాల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం స్మార్ట్ టీవీ.. అనేది ప్రతి ఒక్కరి అవసరంగా మారిపోయింది. యూజర్ల అంచనాలకు తగ్గట్టుగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఫిలిప్స్ మార్కెట్లోకి తీసుకొచ్చిన మోడలే ఇది. అయితే బెడ్జెట్ లో బెస్ట్ మోడల్స్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా థియేటర్ ఫీల్ కోరుకునే చాలా మందికి బెస్ట్ ఆప్షన్. ఇంతకీ ఈ మోడల్ టీవీకి సంబంధించి బెస్ట్ ఫీచర్లు, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

అల్ట్రా-నారో బెజెల్ & అద్భుతమైన డిస్‌ప్లే :

Advertisement

ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని ప్రీమియం లుక్. అల్ట్రా-నారో బెజెల్ తో వస్తున్న ఈ 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ డిస్‌ప్లే.. ఇంటికి మోడర్న్ లుక్‌ను ఇస్తుంది. వైడర్ కలర్ గాముట్ , HDR10 సపోర్ట్ ఉండటం వల్ల విజువల్స్ చాలా సహజంగా, రంగులమయంగా కనిపిస్తాయి. సినిమాలు చూసేటప్పుడు.. లేదా గేమ్స్ ఆడేటప్పుడు ఇది అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

ఐ కేర్ టెక్నాలజీ :

గంటల తరబడి టీవీ చూసే పిల్లలు, పెద్దల కోసం ఇందులో ప్రత్యేకమైన ‘ఐ కేర్’ టెక్నాలజీని పొందుపరిచారు. ఇది కంటిపై పడే నీలి కాంతి ప్రభావాన్ని తగ్గించి, కళ్లకు ఎలాంటి ఒత్తిడి కలగకుండా.. రక్షణ కల్పిస్తుంది. దీని వల్ల ఎక్కువసేపు టీవీ చూసినా కళ్లు నొప్పెట్టడం వంటి సమస్యలు ఉండవు.

24W సౌండ్ అవుట్‌పుట్:

Advertisement

ఒక మంచి టీవీకి పిక్చర్ క్వాలిటీ.. ఎంత ముఖ్యమో, సౌండ్ కూడా అంతే ముఖ్యం. ఈ ఫిలిప్స్ టీవీలో.. ఏకంగా 24W సౌండ్ అవుట్‌ పుట్‌ను అందించారు. దీనికి తోడు డాల్బీ ఆడియో.. సపోర్ట్ ఉండటం వల్ల క్రిస్టల్ క్లియర్ వాయిస్ మరియు థియేటర్ తరహా సరౌండ్ సౌండ్ ఫీల్ లభిస్తుంది. ఎక్స్‌ట్రా స్పీకర్లు పెట్టాల్సిన అవసరం లేకుండానే .. ఇది రూమ్ అంతా సౌండ్‌ను నింపేస్తుంది.

గూగుల్ టీవీ అండ్‌ వాయిస్ కంట్రోల్ రిమోట్:

ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి.. ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఇందులో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.అంతేకాకుండా..వాయిస్ కంట్రోల్ రిమోట్ ఉండటం వల్ల కేవలం మీ గొంతుతోనే.. ఛానెల్స్ మార్చడం, వాల్యూమ్ పెంచడం లేదా మీకు నచ్చిన వీడియోల కోసం సెర్చ్ చేయడం చాలా ఈజీ అవుతుంది.

Also Read:  ఫ్రిజ్ కొనే ఆలోచనలో ఉన్నారా? వీటిపై ఓ లుక్కేయండి

స్టోరేజ్,కనెక్టివిటీ :

ఈ స్మార్ట్ టీవీలో 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. దీని ద్వారా మీకు నచ్చిన యాప్స్‌ను డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. ఎనర్జీ సేవింగ్ ఫీచర్ ఉండటం వల్ల కరెంట్ బిల్లు గురించి కూడా..పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఈ సరి కొత్త ఫిలిప్స్ 43 ఇంచ్ స్మార్ట్ గూగుల్ టీవీ ధర ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లో చూస్తే.. కేవలం రూ.24,999 మాత్రమే ఉంది.

మీ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, అద్భుతమైన సౌండ్ , కంటికి సేఫ్టీ ఇచ్చే టెక్నాలజీ.. ఉన్న బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే.. ఫిలిప్స్ 2025 ఎడిషన్ గూగుల్ టీవీ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.రూ.25 వేల బడ్జెట్‌లో ఇది నిజంగా ఒక వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు.

Related News

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కు ఇలాంటి ప్రైవసీ కూడా ఉంటుందా? కొత్త టెక్నాలజీ ఇదేనండోయ్!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..తక్కువ ధరలో బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ వచ్చేసింది!

ఆపిల్, శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా లెనోవో కొత్త ట్యాబ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్!

ఫ్రిజ్ కొనే ఆలోచనలో ఉన్నారా? వీటిపై ఓ లుక్కేయండి

రూ.28వేలకే.. 55 ఇంచుల స్మార్ట్ టీవీ! ఆఫర్ అంటే ఇలా ఉండాలి

మార్కెట్‌లోకి కొత్త మోడల్ ఇయర్‌బడ్స్..ఇది నిజంగా సూపర్!

రూ.5,899 ధరకే.. 24 ఇంచుల థామ్సన్ టీవీ!

Big Stories

Advertisement
×