E-Paper
Advertisement

ఫ్రిజ్ కొనే ఆలోచనలో ఉన్నారా? వీటిపై ఓ లుక్కేయండి

ఫ్రిజ్ కొనే ఆలోచనలో ఉన్నారా? వీటిపై ఓ లుక్కేయండి
Advertisement

Best Amazon refrigerators 4 star rating: ఇంటికి సరికొత్త ఫ్రిజ్ కొనాలని ఆలోచిస్తున్నారా? మీ వంటింటికి ఏ బ్రాండ్.. రిఫ్రిజిరేటర్ పర్ఫెక్ట్‌గా.. సెట్ అవుతుందనే.. టెన్షన్ అవసరమే లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో హైయర్,ఎల్జీ,శాంస్సంగ్ బ్రాండ్లు అగ్రగామిగా దూసుకుపోతున్నాయి. అమెజాన్‌లో.. కస్టమర్ల నుంచి 4 లేదా అంతకంటే.. ఎక్కువ స్టార్స్ రేటింగ్ సంపాదించి, సూపర్ హిట్ అయిన టాప్ 6 రిఫ్రిజిరేటర్ మోడల్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ ఫ్రిజ్‌లో ఎలాంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి? కరెంట్ ఆదా ఎలా అవుతుంది? ప్రస్తుత మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ? ఈ అన్ని విషయాల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. Haier 190L సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్:

తక్కువ బడ్జెట్ లో సరైన ఆప్షన్ అయిన ఈ మోడల్ స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్.. సుమారు రూ. 13,500 నుంచి రూ. 15,300 ధరలో లభిస్తుంది. ఇది కేవలం 60 నిమిషాల్లో ఫాస్ట్ ఐస్ మేకింగ్ ఫీచర్ , 5 స్టార్ ఎనర్జీ సేవింగ్ రేటింగ్‌తో వస్తుంది.

2. LG 185L / 210L స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రిజ్:

Advertisement

బాచిలర్స్, చిన్న ఫ్యామిలీలకు బెస్ట్ ఛాయిస్ అయిన.. ఈ మోడల్ స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ సింగిల్ డోర్ ఫ్రిజ్.. సుమారు రూ. 17,000 నుంచి రూ. 19,990 ధరలో లభిస్తుంది. దీనిలో స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో.. పాటు 175 కేజీల బరువును మోయగల టఫ్డ్ గ్లాస్ షెల్ఫ్స్ ఉంటాయి.

3. Samsung 183L / 256L డిజిటల్ ఇన్వర్టర్ ఫ్రిజ్:

మూడవ మోడల్ అయిన ఈ మోడల్ డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ ధర సుమారు రూ. 13,990 నుంచి రూ. 28,000 వరకు ఉంది. డిజిటల్ టచ్ కూల్ , 5-ఇన్-1 కన్వర్టబుల్ మోడ్స్ దీని ప్రత్యేకత కాగా.. ఇది ఆహారాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుతుంది.

4. Haier 325L ట్రిపుల్ ఇన్వర్టర్ డబుల్ డోర్ ఫ్రిజ్:

Advertisement

పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన ఈ మోడల్ ట్రిపుల్ ఇన్వర్టర్ డబుల్ డోర్ ఫ్రిజ్ సుమారు రూ. 31,000 నుంచి రూ. 35,000 ధరలో లభిస్తుంది. ఇందులో.. భారీ స్టోరేజ్ స్పేస్‌తో.. పాటు డిజిటల్ టచ్ డిస్‌ప్లే, 14-ఇన్-1 కన్వర్టబుల్ మోడ్స్ లభిస్తాయి.

5.LG 276L / 343L 3 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్:

ఐదవ మోడల్ అయిన ఈ మోడల్ స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ డబుల్ డోర్ ఫ్రిజ్.. సుమారు రూ.28,000 నుంచి రూ.38,990 ధరలో లభిస్తుంది. దీనిలోని ఆటో స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ద్వారా కరెంట్ పోయిన సమయంలోనూ.. ఫ్రిజ్ సజావుగా పని చేస్తుంది.

Also Read: మార్కెట్‌లోకి కొత్త మోడల్ ఇయర్‌బడ్స్..ఇది నిజంగా సూపర్!

6.Samsung 256L కన్వర్టబుల్ ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిజ్:

చివరగా, ఈ మోడల్ స్టార్ కన్వర్టబుల్ ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిజ్ సుమారు రూ. 26,000 నుంచి రూ. 29,000 ధరలో అందుబాటులో ఉంది. ఇందులో ఆల్ రౌండ్ కూలింగ్ టెక్నాలజీ ద్వారా ఫ్రిజ్ అంతటా.. ఒకే విధమైన చల్లదనం అందుతుంది. అంతే అవసరానికి తగ్గట్టుగా ఫ్రీజర్‌ను ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు.

మీ బడ్జెట్ తక్కువగా ఉండి.. ఎక్కువ కూలింగ్ కోరుకుంటే.. Haier మంచి ఆప్షన్. ఎక్కువ రోజులు పాడవకుండా, సైలెంట్ వర్కింగ్ కావాలంటే.. LG బెస్ట్. ఇక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, స్మార్ట్ కన్వర్టబుల్ ఫీచర్లు కావాలనుకునేవారు.. Samsung ఫ్రిజ్‌లను ఎంచుకోవచ్చు. అమెజాన్‌లో వీటిపై ఉన్న లేటెస్ట్ డిస్కౌంట్లు చెక్ చేసి మీ అవసరానికి తగిన ఫ్రిజ్‌ను సొంతం చేసుకోండి!

Related News

ఆపిల్, శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా లెనోవో కొత్త ట్యాబ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్!

రూ.28వేలకే.. 55 ఇంచుల స్మార్ట్ టీవీ! ఆఫర్ అంటే ఇలా ఉండాలి

మార్కెట్‌లోకి కొత్త మోడల్ ఇయర్‌బడ్స్..ఇది నిజంగా సూపర్!

రూ.5,899 ధరకే.. 24 ఇంచుల థామ్సన్ టీవీ!

వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్

స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ సౌండ్..ఏంటీ తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా ?

iPhone 17 దూసుకెళ్తుంటే.. 17e మాత్రం టాప్-5లో లేదు, అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×