E-Paper
Advertisement

అంత ధర ఉన్న ఫోన్ ఇంత తక్కువకా? ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 10పై కళ్లు చెదిరే ఆఫర్!

అంత ధర ఉన్న ఫోన్ ఇంత తక్కువకా? ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 10పై కళ్లు చెదిరే ఆఫర్!
Advertisement

Pixel 10 Price Drop: ప్రస్తుత ఈ టెక్ యుగంలో మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్‌ఫోన్లను చూస్తుంటే.. అసలు అవి ఫోన్లా లేక కంప్యూటర్లా అనిపిస్తుంది. వందల కొద్దీ ఫీచర్లు, గందరగోళంగా ఉండే సెట్టింగుల వలన ఇంట్లో పెద్దవారికి ఫోన్ వాడటం పెద్ద తలనొప్పిలా మారింది. ఇప్పుడీ ఈ సమస్యకు చెక్ పెడుతూ.. గూగుల్ సంస్థ సీనియర్ సిటిజన్స్‌కు అర్థమయ్యే రీతిలో పిక్సెల్ 10aను సిద్ధం చేస్తోంది. మరోవైపు.. ఫ్లాగ్‌షిప్ మోడల్ పిక్సెల్ 10 ధరను కూడా భారీగా తగ్గించి గూగుల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సీనియర్స్‌‌కు ఈ ఫోన్ ఎందుకు బెస్ట్?

సాధారణంగా వయసు పైబడిన వారు ఫోన్ వాడేటప్పుడు అక్షరాలు కనిపించకపోయినా లేదా సెట్టింగ్స్ అర్థం కాకపోయినా ఇబ్బంది పడుతుంటారు. పిక్సెల్ 10a ఈ ఇబ్బందులన్నింటికీ చెక్ పెడుతుంది. దీని డిస్‌ప్లే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి.. అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అనవసరమైన యాప్‌లు లేకుండా ఫోన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అక్షరాలు పెద్దవిగా చేసుకోవడం, వినికిడి యంత్రాలకు సపోర్ట్ వంటి ఫీచర్లు పెద్దవారికి చాలా ఉపయోగపడతాయి. పైగా బ్యాటరీ కూడా ఎక్కువ సేపు వస్తుంది. ఒక్కసారి కొంటే ఏడేళ్ల వరకు అప్‌డేట్స్ వస్తాయి కాబట్టి, మాటిమాటికీ ఫోన్లు మార్చే అవసరం కూడా ఉండదు.

Advertisement

Also Read: 144Hz డిస్‌ప్లే, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మార్కెట్లోకి వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఇక దుమ్ములేపడమే!

సామాన్యుల కోరిక తీర్చేలా గూగుల్ ప్లాన్..

మరీ పెద్ద ఫోన్లు పట్టుకోవడం కష్టమని భావించే వారికి ఈ ఫోన్ మంచి చాయిస్. తేలికగా, చేతిలో ఇమిడిపోయేలా ఉండటంతో పాటు, కెమెరా కూడా చాలా సహజంగా ఉంటుంది. ఐఫోన్ లాంటి పెద్ద బ్రాండ్లకు ధీటుగా గూగుల్ ఈ ఫోన్‌ను తీర్చిదిద్దుతోంది. కేవలం హై ఎండ్ ఫీచర్లు మాత్రమే కాకుండా.. వాడకంలో సౌకర్యాన్ని కోరుకునే వారిని ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది.

పిక్సెల్ 10 అదిరిపోయే ఆఫర్..

Advertisement

ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారికి ఇప్పుడు మంచి టైమ్ నడుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. మొదట్లో రూ.79,999 ఉన్న ఈ ఫోన్, ఇప్పుడు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కలుపుకుంటే రూ.55,000 లోపే వచ్చే అవకాశం ఉంది. మంచి ప్రాసెసర్, అదిరిపోయే కెమెరాతో వచ్చే ఈ ఫోన్ తక్కువ ధరకే దొరుకుతుండటం టెక్ ప్రియులకు పండగ లాంటి వార్తే మరి.

భారత్‌లో పెరిగిన గూగుల్ జోరు..

పిక్సెల్ 10aతో ఒక పక్క పెద్దవారిని, మరో పక్క భారీ ఆఫర్లతో యువతను గూగుల్ ఆకర్షిస్తోంది. ఈ దెబ్బతో ఇండియాలో మిగిలిన ఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ గూగుల్ ప్లాన్ గనుక వర్కవుట్ అయితే.. రాబోయే రోజుల్లో మిగిలిన బ్రాండ్లు కూడా తమ ధరలను తగ్గించక తప్పదు. మొత్తానికి గూగుల్ తన సరికొత్త వ్యూహంతో మన దేశంలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది.

Also Read: Find X9 Ultra లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ కెమెరా సెటప్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×