E-Paper
Advertisement

అసెంబ్లీ ఎన్నికల వేళ.. బిల్లుల గోలేంటి? భగ్గుమన్న కాంగ్రెస్, రాజ్యాంగంపై దాడేనన్న సోనియా గాంధీ

అసెంబ్లీ ఎన్నికల వేళ.. బిల్లుల గోలేంటి? భగ్గుమన్న కాంగ్రెస్, రాజ్యాంగంపై దాడేనన్న సోనియా గాంధీ
Advertisement

Sonia Gandhi: ఓ వైపు దేశంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో  పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది.  బిల్లుల విషయంలో కేంద్రం బలవంతంగా ముందుకు వెళ్లాలని చూస్తోందని మండిపడ్డారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.

అసెంబ్లీ ఎన్నికల వేళ..  కేంద్రం వ్యవహారశైలిని తూర్పార బట్టిన కాంగ్రెస్

Advertisement

ప్రత్యేక బిల్లుల నేపథ్యంలో ఏప్రిల్ 16 నుంచి మూడురోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మహిళా బిల్లు ఉభయసభల్లోకి పార్టీలు మద్దతు ఇవ్వాలంటూ ఆదివారం ఆయన అన్ని పార్టీలకు లేఖలు రాశారు  ప్రధాని నరేంద్రమోదీ. దీనిపై కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యింది.

వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నారీ శక్తి వందనం అధినియమ్‌ సవరణ బిల్లును తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు సోనియాగాంధీ. మహిళా రిజర్వేషన్ల బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే అత్యంత ముఖ్యమని తేల్చేశారు.  మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై చర్చించేందుకు బెంగాల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

అసెంబ్లీ ఎన్నికల వేళ..  ప్రత్యేక బిల్లులపై భగ్గుమన్న సోనియా‌గాంధీ

దీనిపై ప్రతిపక్షం ఇప్పటికే మూడు సార్లు కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. అందరికీ ఉపయోగపడే ఈ అభ్యర్థనను ప్రధానమంత్రి తిరస్కరించారని వివరించారు. అందుకు బదులుగా పార్టీలకు లేఖలు రాయడం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు చేయడం, వంటివి చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో తన మాట నెగ్గాలని ప్రధాని వ్యవహరించడం విచారకరమన్నారు.

రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల వేళ వాటిపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు.  లోక్‌సభ, అసెంబ్లీల శాసనసభల్లో మహిళా ఎంపీలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే ఆలోచనను ప్రతిపక్షం ఏమాత్రం వ్యతిరేకించలేదన్నారు. 2027 జనాభా లెక్కలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు.

ALSO READ: ఇరాన్ యుద్ధం టెన్షన్ మొదలు.. గ్యాస్ కష్టాలు మళ్లీ రెట్టింపు, కేంద్రం కీలక నిర్ణయాలు

అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడం సరైన పద్దతి కాదని, ఏప్రిల్ 16-18 వరకు జరిగే ప్రత్యేక సమావేశానికి బదులుగా పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో వాటిని తీసుకురావాలని సూచన చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ‘ద హిందూ’లోని ఎడిటోరియల్ విభాగంలో పై విషయాలను ప్రస్తావించారు.  దాన్ని ఎక్స్ వేదికగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ షేర్ చేశారు. ఇవికాకుండా ఇంకా చాలా విషయాలను అందులో ప్రస్తావించారు.

 

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×