E-Paper
Advertisement

144Hz డిస్‌ప్లే, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మార్కెట్లోకి వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఇక దుమ్ములేపడమే!

144Hz డిస్‌ప్లే, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మార్కెట్లోకి వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఇక దుమ్ములేపడమే!
Advertisement

Vivo T5 Pro 5G: ప్రముఖ వివో కంపెనీ తమ పాపులర్ T-సిరీస్‌లో ‘వివో T5 ప్రో 5G’ స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 15న భారతదేశంలో విడుదల చేయనుంది. ఇప్పటికే మార్చిలో వచ్చిన T5x 5G సూపర్ హిట్ అవ్వగా.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ ప్రో మోడల్‌ను తీసుకురానున్నారు. గతేడాది వచ్చిన T4 ప్రోతో పోలిస్తే.. ఈసారి డిజైన్ నుంచి పెర్ఫార్మెన్స్ వరకు అన్నీ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయి. ముఖ్యంగా హెవీగా గేమ్స్ ఆడేవారికి, రోజంతా ఫోన్ వాడేవారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది.

ధర ఎంత ఉండొచ్చు?

మరి ఇంత మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ ధర ఎలా ఉంటుందనే కదా మీ డౌట్? ఈ వివో T5 ప్రో 5G బేస్ మోడల్ ధర దాదాపు రూ.30,000 నుంచి ఉండవచ్చని టాక్. ఇక టాప్ ఎండ్ వెర్షన్ (12GB RAM + 256GB స్టోరేజ్) అయితే రూ.37,000 లోపే ఉండొచ్చని సమాచారం. ఈ ఫోన్ మనకు ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది. లాంచ్ ఆఫర్ల కింద బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి డీల్స్ కూడా ఉండొచ్చు. ఇక కలర్స్ విషయానికి వస్తే.. కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ అనే రెండు కొత్త రంగుల్లో ఈ ఫోన్ క్లాసీగా కనిపిస్తోంది.

డిస్‌ప్లే సంగతేంటి?

Advertisement

ఈ ఫోన్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, చేత్తో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ వచ్చేలా ఉంటుంది. వెనుక వైపు కెమెరా సెటప్‌ను ఒక పిల్ ఆకారంలో ఉన్న మాడ్యూల్‌లో పెట్టారు. ఇది చూడటానికి కొత్తగా అనిపిస్తుంది. ఇకపోతే డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.8 అంగుళాల పెద్ద 1.5K OLED స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్ తోడవ్వటంతో, స్క్రీన్ టచ్ చేసినా లేదంటే స్క్రోల్ చేసినా చాలా స్మూత్‌గా ఉంటుంది. మీరు సినిమాలు చూసినా, హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడినా ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా మెరుగ్గ ఉంటుంది.

Also Read: కలా? నిజమా? iPhone 15 రూ.35,000కే వచ్చేస్తోంది.. ఇవిగో పూర్తి వివరాలు!

గేమింగ్ లవర్స్‌కు పండగే..

Advertisement

ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను వాడారు. దీంతో పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడక్కర్లేదు. అలాగే గేమర్స్ కోసం ప్రత్యేకంగా 4D గేమ్ వైబ్రేషన్ వంటి ఫీచర్లు పెట్టారు. ఇక ఫోన్ వేడెక్కుతుందనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఈ ఫోన్‌లో పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. దీంతో మీరెంత సేపు ఫోన్ వాడినా, గేమ్స్ ఆడినా ఫోన్ మాత్రం కూల్‌గానే ఉంటుంది.

కెమెరా కూడా కిరాక్..

ఈ ఫోన్ హైలైట్ ఏంటంటే.. దీనిలో ఏకంగా 9,020mAh భారీ బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులైనా కంటిన్యూగా వాడుకోవచ్చు. దానికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఫోన్ కూడా చాలా స్పీడ్‌గా ఛార్జ్ అయిపోతుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. మంచి క్లారిటీతో ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే సెల్ఫీల కోసం కూడా మంచి కెమెరానే ఇచ్చారు. మొత్తానికి.. రూ.40వేల బడ్జెట్‌లో ఆల్ రౌండర్ ఫోన్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

Also Read: కరెంటు ఆదా చేసే బెస్ట్ ఇన్వర్టర్ ఏసీలు.. ధర కూడా మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌లోనే!

 

Related News

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

Big Stories

Advertisement
×