E-Paper
Advertisement

ఈ సోలార్ సిస్టమ్ మీ ఇంట్లో ఉంటే ప్రభుత్వం మీకే డబ్బులు చెల్లిస్తుంది.. ఎలాగంటే?

ఈ సోలార్ సిస్టమ్ మీ ఇంట్లో ఉంటే ప్రభుత్వం మీకే డబ్బులు చెల్లిస్తుంది.. ఎలాగంటే?
Advertisement

PM Surya Ghar: ప్రజలపై పెరుగుతున్న కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించడానికి మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పునరుత్పాదక ఇంధనాన్ని (Renewable Energy) ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన” ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 1 కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read also-జావా నుంచి 1000 స్పోర్ట్ క్రూయిజర్.. 113HP పవర్‌ తో సూపర్‌ బైక్ సంచలనం!

పథకం ముఖ్య ఉద్దేశం

Advertisement

సొంత ఇల్లు ఉన్నవారు తమ ఇంటి పైకప్పు (Rooftop) పై సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయం (సబ్సిడీ) అందిస్తుంది. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వల్ల ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ లభిస్తుంది.

సబ్సిడీ వివరాలు

ఇంటి కరెంట్ వినియోగాన్ని బట్టి ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ. 30,000 నుండి గరిష్టంగా రూ. 78,000 వరకు ఉంటుంది.

Advertisement

సగటు నెలవారీ కరెంట్ వినియోగం ‘0 – 150 యూనిట్లు’ మధ్య ఉంటే.. 1 – 2 కిలోవాట్లు (kW)కు రూ. 30,000 నుండి రూ.60,000 సబ్సిడీ లభిస్తుంది. 150 – 300 యూనిట్లు మధ్య ఉంటే.. 2 – 3 కిలోవాట్లు (kW)కు రూ. 60,000… నుండి రూ. 78,000 వరకూ సబ్సిడీ లభిస్తుంది. 300 యూనిట్ల కంటే ఎక్కువ, 3 కిలోవాట్ల కంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా రూ. 78,000 సబ్సిడీ పొందవచ్చు.

అర్హతలు

  • దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి.
  • సోలార్ ప్యానెల్స్ అమర్చడానికి వీలుగా తగినంత స్థలం ఉన్న సొంత ఇల్లు కలిగి ఉండాలి.
  • ఇంటికి అధికారిక విద్యుత్ కనెక్షన్ (Electricity Connection) ఉండాలి.
  • గతంలో సోలార్ ప్యానెల్స్ కోసం ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీ పొంది ఉండకూడదు.
  • (గమనిక: అద్దె ఇంట్లో ఉండేవారు కూడా మీ ఓనర్ అనుమతితో, మీ పేరు మీద కరెంట్ బిల్లు వస్తుంటే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు).

అవసరమైన పత్రాలు

1. ఆధార్ కార్డ్ / గుర్తింపు కార్డు (ID Proof)

2. చిరునామా ధృవీకరణ పత్రం (Address Proof)

3. ఇల్లు / స్థలానికి సంబంధించిన పత్రాలు

4. ఇటీవలి కరెంట్ బిల్లు (Electricity Bill)

5. బ్యాంక్ పాస్‌బుక్ / క్యాన్సిల్డ్ చెక్ (సబ్సిడీ డబ్బులు జమ కావడానికి)

దరఖాస్తు విధానం

ఈ పథకానికి అప్లై చేయడానికి క్రమ పద్ధతిలో కింది స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

Read also-ప్రాణం వచ్చే బొమ్మలు… శపించబడిన జోకర్లు… తోడేలు మనుషులు… క్లైమాక్స్ కెవ్వు కేక

1. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్..

అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. మీ రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ (DISCOM) పేరు, మీ కరెంట్ వినియోగదారు సంఖ్య (Consumer Number), మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి.

2. లాగిన్ & దరఖాస్తు

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కన్స్యూమర్ నంబర్, మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. అక్కడ ఉన్న ‘Rooftop Solar’ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి వివరాలతో నింపాలి.

3. ఫీజిబిలిటీ అనుమతి

మీ దరఖాస్తును పరిశీలించి మీ స్థానిక విద్యుత్ డిస్కమ్ (DISCOM) వారు అనుమతి ఇస్తారు. అనుమతి లభించిన తర్వాత, మీ డిస్కమ్‌లో నమోదైన (Registered Vendors) వెండర్స్ ద్వారా మాత్రమే సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయించుకోవాలి.

4. నెట్ మీటర్ కోసం దరఖాస్తు

సోలార్ ప్యానెల్స్ అమర్చడం పూర్తయిన తర్వాత, ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో సబ్మిట్ చేసి ‘నెట్ మీటర్’ (Net Meter) కోసం దరఖాస్తు చేయాలి.

5. కమిషనింగ్ సర్టిఫికేట్ & సబ్సిడీ

డిస్కమ్ అధికారులు వచ్చి మీ నెట్ మీటర్‌ను తనిఖీ చేసి, అంతా బాగుంటే ఆన్‌లైన్ పోర్టల్‌లో ‘కమిషనింగ్ సర్టిఫికేట్’ జారీ చేస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చాక, మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్యాన్సిల్డ్ చెక్ కాపీని అప్‌లోడ్ చేస్తే 30 రోజుల్లో సబ్సిడీ డబ్బులు నేరుగా మీ అకౌంట్‌లో పడతాయి.

Related News

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌లో కాకుండా.. మెటల్‌‌ లోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

మీ ఐఫోన్ స్పీడ్ పెంచే సూపర్ అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి!

భారీ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ ఫీచర్‌తో Oppo A7 Pro లాంచ్.. ధర ఎంతంటే?

వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!

ఇక ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు.. లైవ్ ట్రాన్స్‌లేషన్, 50% ఎక్కువ ఏఎన్‌సీతో Apple AirPods 5 లాంచ్!

Big Stories

Advertisement
×