Podarillu Today Episode June 11th : దివ్య అలాగే మహాలక్ష్మి ఆఫీస్ అయిన తర్వాత ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తారు.. అయితే బస్సులో వాళ్ళిద్దరూ కలిసి వచ్చేటప్పుడు ఒక ఆవిడ వాళ్ళిద్దరిని గుద్దుకుని పక్కకు వస్తుంది.. అది చూసిన మహాలక్ష్మి ఆవిడని చూసి కన్న వాళ్ళ అమ్మలాగే ఉంది అని అనుకుంటుంది. ఆవిడని చూసిన తర్వాత మహాలక్ష్మి షాక్లో ఉండిపోతుంది.. అయితే బస్ స్టాప్ లో కన్నా ఉన్నా కూడా తను పట్టించుకోకుండా వస్తుంది.
అయితే మహాలక్ష్మి ఇంటికొచ్చిన తర్వాత అందరూ ఆఫీస్ ఎలా ఉంది అని అడుగుతారు.. కేశవ ఆఫీస్ నుంచి నువ్వు తీసుకొచ్చావా లేదా అని చక్రిని అడుగుతాడు. నేను ఒంటరిగా వెళ్లడం నేర్చుకోవాలి మీరు ఈ విషయం గురించి ఇక మాట్లాడకండి అని మహాలక్ష్మి అంటుంది.. ఇక ఆ తర్వాత నారాయణ దగ్గరికి వెళ్లిన మహాలక్ష్మి కన్న వాళ్ళ అమ్మని నేను చూశాను ఆ విషయం గురించి మీరు నాకు నిజం చెప్పాలి అని ఎంతగా అడిగినా సరే నారాయణ నేను చెప్పను అని అంటాడు.. కానీ నారాయణ ఆవిడ గురించి దాచడంతో మహాలక్ష్మి ఏదో ఆయన దాస్తున్నాడు అని అనుకుంటుంది.. ఈయన ఏదో దాస్తున్నాడు కచ్చితంగా ఏదో జరిగింది అని మహాలక్ష్మి అనుకుంటుంది..
రాత్రి కేశవ ఒక్కడే బండి మీద పడుకొని శైలు ఇచ్చిన డబ్బులు చూస్తూ అలానే పడుకుని ఉంటాడు..కేశవ ఆలోచిస్తూ ఉండగా చక్రి అక్కడికి వస్తాడు. తన చేతిలో ఉన్న డబ్బులు లాక్కుంటాడు.. ఏంట్రా గాల్లో డబ్బులు లెక్క పెడుతున్నావా ఏంటి అని కేశవ అడుగుతాడు. లేకపోతే ఇందులో నోట్లో ఏమైనా తక్కువ అయినాయా ఎందుకు నువ్వు ఇలా డబ్బులు చూస్తూ గాల్లో తేలిపోతున్నావు అని చక్రి అడుగుతాడు. నేను ఒక అమ్మాయిని కొట్టాను రా అందుకే బాధ పడిపోతున్నాను అని కేశవ జరిగిన విషయాన్ని చెప్పేస్తాడు. ఏంటి నువ్వు ఒక అమ్మాయిని కొట్టావా ఇంత ముండోడు ఏంట్రా ఏం జరిగింది అంటున్నాడు అని అంతా చెప్పమని అడుగుతాడు.. అమ్మాయికి నువ్వంటే ఇష్టం కాబట్టి నిన్ను వెతుకుతూ వస్తుంది అని చెప్పగానే కేశవ ఆలోచనలో పడతారు..
ఉదయం లేవగానే మాధవ్ వంట చేస్తూ ఉండగా మహాలక్ష్మి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే నీకెందుకు మరి కష్టమని ఎంత చెప్తున్నా సరే మహాలక్ష్మి మాత్రం వినకుండా వంటకి హెల్ప్ చేస్తూ ఉంటుంది.. మనము వంట కోసం కొన్ని సామాన్లు కొనాలి ఇప్పుడు చేసుకుని కడగడం మళ్ళీ చేసుకోవడం మళ్ళీ పని అయ్యింది. సరే అమ్మ అలాగే కొందామని మాధవ్ అంటాడు. బయట కేశవ ఏదో రిపేర్ చేస్తూ కనిపించడం చూసిన మహాలక్ష్మి రాత్రి చక్రితో చెప్పింది నేను విన్నాను అమ్మాయికి మీరు అంటే ఇష్టం అనుకుంటాను. ముందు సారీ చెప్పి మంచిగా మాట్లాడండి అని చెప్పగానే కేశవ సారీ చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు..
ఇక తర్వాత అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతుంటే మహాలక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చక్రీ.. మీరు రెడీ అయ్యారా పదండి వెళ్ళిపోదామని చక్రి మహాలక్ష్మితో అంటాడు.. మీరు ఎక్కడికి నేనొక్కదాన్నే బస్సులో వెళ్తాను అని మహాలక్ష్మి అంటుంది.. నాకు తోడుగా కన్నా కూడా ఉన్నారు కదా మేమిద్దరం వెళ్తాంలే అని మహాలక్ష్మి ఉంటుంది.. బస్సులో చాలా రద్దీగా ఉంటుంది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చక్రి ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్లినా వంటరిగా పంపించరు ఇప్పుడైనా నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది.. మాధవ్ మహానీ సరే అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పగానే చక్రి నువ్వు కూడా వాళ్ళ పార్టీలోనే చేరిపోయావు.. అందరితోనూ మంచిగానే ఉంటుంది నాతో మాత్రం ఎలా ఉంటుంది అని బాధ పడిపోతూ ఉంటాడు చక్రీ..
బాత్రూం కట్టడానికి ముహూర్తం పెట్టేస్తాడు మాధవ్.. అయితే అన్ని ఏర్పాటు చేసిన తర్వాత నారాయణని పెద్దమనిషిగా చేసిన మాధవ్ పూజ కార్యక్రమాలు మొదలు పెట్టాలని అంటాడు.. అయితే ఆ సీన్ చూసిన నారాయణ ఎమోషనల్ అవుతాడు.. బిల్లు పని మొదలు పెట్టగానే రమణయ్య వచ్చి అడ్డుపడతాడు. రమణయ్యకు నారాయణ నువ్వు ఇక్కడ బాత్రూం పెట్టడానికి అడ్డుపడ్డావు నేను గాయత్రి వాళ్ళ అత్తగారింటికి వెళ్లి మాదవ్ ను ప్రేమించిన విషయాన్ని వీడియోతో సహా చూపిస్తామని చేస్తాడు.. ఇక నారాయణ మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
మొదటిరోజు ఆఫీస్ కి వెళ్ళినా మహాలక్ష్మికి గ్రాండ్ వెల్కమ్ పలికిన విక్కీ పని విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది.. ఒక డిజైన్ గియ్యమని చెప్పిన తర్వాత దాని మీద ఫోకస్ చేస్తున్న మహాలక్ష్మి దగ్గరికి దివ్య వస్తుంది.. దివ్య ఇంకా డిజైన్ అవ్వలేదని వ్యక్తి అడుగుతున్నాడు ఎంత టైం పడుతుంది అని అంటుంది.. మహాలక్ష్మి డిజైన్ పూర్తి అయిన తర్వాత తీసుకొని వెళ్తుంది.. అది చూసిన విక్కి మహాలక్ష్మికి దిమ్మతిరిగి పోయేలా షాకిస్తాడు.. అయితే నేను మళ్ళీ డిజైన్ వేస్తానని మహాలక్ష్మి చెప్పగానే కాఫీ తాగి మళ్ళీ ఒకసారి సరి చేయండి అని విక్కీ అంటాడు.. ఇంటికి వెళ్ళిన మహాలక్ష్మి అక్కడ బాత్రూం కడుతుండడం చూసి ఏంటి ఇప్పుడు ఇంత ఖర్చు అని అంటుంది అందరూ మీకోసమే అని చెప్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…