E-Paper
Advertisement

జావా నుంచి 1000 స్పోర్ట్ క్రూయిజర్.. 113HP పవర్‌ తో సూపర్‌ బైక్ సంచలనం!

జావా నుంచి 1000 స్పోర్ట్ క్రూయిజర్.. 113HP పవర్‌ తో సూపర్‌ బైక్ సంచలనం!
Advertisement

Jawa 1000 Sport Cruiser Concept Unveiled:  ప్రపంచ వ్యాప్తంగా మోటార్‌ సైకిల్ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన జావా తాజాగా తన కొత్త 1000 స్పోర్ట్ క్రూయిజర్ కాన్సెప్ట్‌ ను ఆవిష్కరించింది. ఈ ఏడాది ప్రారంభంలో చెక్ రిపబ్లిక్‌ లో జరిగిన మోటార్‌ సైకిల్ ప్రదర్శనలో ఈ బైక్‌ను ప్రజలకు పరిచయం చేశారు. క్లాసిక్ జావా స్టైలింగ్‌ ను ఆధునిక డిజైన్‌ తో మిక్స్ చేస్తూ రూపొందించిన ఈ కాన్సెప్ట్ బైక్ ప్రస్తుతం బైక్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మోటార్‌ సైకిల్‌ను ప్రముఖ చెక్ డిజైనర్ జాన్ హర్బెక్ రూపొందించారు. ఇదే డిజైనర్ ఇటీవల జావా 730 ట్విన్ మోడల్ తయారీలోనూ కీలక పాత్ర పోషించారు. కొత్త 1000 స్పోర్ట్ క్రూయిజర్‌ లో తక్కువ ఎత్తులో ఉండే క్రూయిజర్ డిజైన్‌ తో పాటు లేటెస్ట్ స్పోర్టీ లుక్‌ ను కలిగి ఉంటుంది.

999 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌

ఈ బైక్‌ లో 999సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ ను అమర్చారు. ఈ శక్తివంతమైన ఇంజిన్ గరిష్టంగా 113 హార్స్‌ పవర్ శక్తిని, 95 ఎన్‌ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుందని సమాచారం. పనితీరు పరంగా చూస్తే గంటకు 215 కిలోమీటర్ల వరకు గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. బైక్ మొత్తం బరువు సుమారు 240 కిలోలుగా ఉండగా, సీటు ఎత్తు 795 మిల్లీమీటర్లుగా ఉంది. దీంతో పొడవైన రైడర్లతో పాటు పొట్టి రైడర్లకు కూడా చక్కగా డ్రైవింగ్ చేసే అవకాశం ఉంటుంది.  ఈ మోడల్‌లో ఉపయోగించిన ఫ్రేమ్ జావా 730 ట్విన్ నుంచి ప్రేరణ పొందినప్పటికీ, మరింత శక్తివంతమైన ఇంజిన్‌ కు అనుగుణంగా ఛాసిస్‌ ను బలోపేతం చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ వేగాల్లో కూడా స్థిరత్వం, భద్రత కోసం ప్రత్యేకంగా ఈ మార్పులు చేసినట్లు సమాచారం.

బలమైన సస్పెన్షన్ వ్యవస్థ

Advertisement

పూర్తిగా ప్రీమియం స్థాయి భాగాలను ఉపయోగించారు. ముందు భాగంలో అ ప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌ లు, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రముఖ ఓహ్లిన్స్ సంస్థ నుంచి తీసుకున్నారు. రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.  బ్రేకింగ్ కోసం బ్రెంబో స్టైల్మా కాలిపర్లను ఉపయోగించారు. ప్రపంచ వ్యాప్తంగా హై-పర్ఫార్మెన్స్ బైక్‌ లలో ఉపయోగించే ఈ బ్రేకింగ్ వ్యవస్థ భద్రతను మరింత పెంచుతుంది. అలాగే OZ రేసింగ్ వీల్స్, లియోవిన్స్ ఎగ్జాస్ట్ లాంటి ప్రీమియం భాగాలు కూడా ఈ బైక్ ప్రత్యేకతల్లో ఒకటిగా నిలుస్తున్నాయి.

కేవలం 15 యూనిట్ల తయారీ

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మోటార్‌ సైకిల్‌ ను చాలా పరిమిత సంఖ్యలో తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం 10 నుంచి 15 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇది సాధారణ బైక్ కాకుండా కలెక్టర్ల కోసం ప్రత్యేక మోడల్‌ గా మారనుంది.

ధర ఎంతో తెలుసా?

Advertisement

ధర విషయానికి వస్తే, యూరప్ మార్కెట్లో దీని ధర సుమారు 62,000 యూరోలు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.68 లక్షలకు పైగానే ఉంటుంది.

Read Also: మే 2026లో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే.. ఎర్టిగా మళ్లీ నంబర్ 1

Related News

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×