E-Paper
Advertisement

Poco C81 vs Poco C81x: రెండూ మధ్యతరగతి ఫోన్లే.. పైగా ధర తక్కువ.. ఫీచర్ల పరంగా ఏది బెస్ట్?

Poco C81 vs Poco C81x: రెండూ మధ్యతరగతి ఫోన్లే.. పైగా ధర తక్కువ.. ఫీచర్ల పరంగా ఏది బెస్ట్?
Advertisement

Poco C81 vs Poco C81x: షావోమీ సబ్ బ్రాండ్ పోకో (Poco) తక్కువ బడ్జెట్ లో అధునాత స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేస్తూ మెుబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే గత నెలలో సరికొత్త బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసింది. పోకో సీ81 (Poco C81), పోకో సీ81ఎక్స్ (Poco C81x) అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు ఒకే సిరీస్‌లో వచ్చినప్పటికీ.. బ్యాటరీ, సాఫ్ట్‌వేర్, ధరల పరంగా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫీచర్ల పరంగా రెండింటిలో ఏది బెస్ట్? సామాన్యులకు ఏ ఫోన్ ఉపయోగకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డిస్‌ప్లే, విజువల్స్

Poco C81 స్మార్ట్‌ఫోన్.. 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి 800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందించారు. కాబట్టి ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు Poco C81x మోడల్ కు.. 6.88 అంగుళాల స్క్రీన్‌ను అందించారు. 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను మాత్రమే అందిస్తుంది. కాబట్టి స్క్రీన్ పరంగా చూస్తే Poco C81 మెుబైల్ దే పైచేయిగా కనిపిస్తోంది. అయితే రెండు ఫోన్లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, రోజూవారీ వినియోగానికి సరిగ్గా సరిపోతుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యం

Advertisement

బ్యాటరీ విషయానికి వస్తే Poco C81 ది బెస్ట్ గా నిలుస్తోంది. ఇందులో 6,300 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 2-3 రోజులు వస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అటు Poco C81x మోడల్ కు వస్తే.. దీనికి 5,200 mAh బ్యాటరీని అమర్చారు. అయితే ఈ రెండు ఫోన్లు కూడా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తాయి. దీనిని ఉపయోగించుకొని.. ఈ ఫోన్ నుండి ఇతర గ్యాడ్జెట్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్, అప్‌డేట్‌లు

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. Poco C81 అత్యంత అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత హైపర్ ఓఎస్ 3 (HyperOS 3)తో వచ్చింది. దీనికి 4 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పోకో ఆఫర్ చేస్తోంది. అయితే Poco C81x మోడల్ ను మాత్రం పాత వెర్షన్ అయిన ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 2 (HyperOS 2) తో తీసుకొచ్చారు. పైగా దీనికి 2 ఏళ్ల వరకు మాత్రమే అప్‌డేట్‌లు లభిస్తాయి. ఎక్కువ రోజులు ఫోన్ మన్నికగా ఉండాలని భావిస్తే.. సీ81 వేరియంట్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది.

ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్

Advertisement

Poco C81 మోడల్ ను 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. మరోవైపు Poco C81x మోడల్ 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. అయితే రెండూ ఫోన్లలోనూ స్టోరేజ్ ను పెంచుకునేందుకు వీలుగా.. మైక్రో SD కార్డ్ స్లాట్ ను తీసుకొచ్చారు. దీనిని ఉపయోగించి.. స్టోరేజ్ సామర్థ్యాన్ని మీకు నచ్చినంత పెంచుకోవచ్చు.

కెమెరా, ఇతర ఫీచర్లు

కెమెరా విషయానికి వస్తే.. Poco C81 వెనుక భాగంలో 13MP AI డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. అటు C81x లో కేవలం 13MP సింగిల్ కెమెరా మాత్రమే ఫిక్స్ చేశారు. రెండు ఫోన్లు కూడా IP52 రేటింగ్‌ ను కలిగి ఉన్నాయి. ఇది దుమ్ము, నీటి చినుకుల నుండి రక్షణ ఇస్తుంది. అలాగే ‘వెట్ టచ్’ టెక్నాలజీ వల్ల స్క్రీన్ తడిగా ఉన్నప్పుడు కూడా సులభంగా వాడుకోవచ్చు.

Also Read: ఒకే గర్భంలో ఒకేసారి పుట్టిన ఇద్దరు అమ్మాయిలకు తండ్రులు వేరు.. ఆ రహస్యం తెలిసి అందరూ షాక్

ధర ఎంతంటే?

ధర విషయానికి వస్తే.. Poco C81x స్మార్ట్‌ఫోన్ ప్రారంభ వేరియంట్ (3జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్) ధర రూ.9,999గా నిర్ణయించారు. మెరుగైన ఫీచర్లు ఉన్న C81 (4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్) రూ.10,999కి అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు కూడా ఎలైట్ బ్లాక్, ఐస్ బ్లూ, సన్‌సెట్ గోల్డ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 27 నుండి ఫ్లిప్ కార్ట్, Mi.com ద్వారా వీటి సేల్స్ జరుగుతోంది.

Also Read: China Blast: చైనాలో ఘోర ప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 21 మంది మృతి

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×