E-Paper
Advertisement

China Blast: చైనాలో ఘోర ప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 21 మంది మృతి

China Blast: చైనాలో ఘోర ప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 21 మంది మృతి
Advertisement

China Blast: చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. అక్కడి బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఈ ప్రమాద ధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలిపోవడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాల సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో వందలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ పేలుడులో సుమారు 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Also Read: భారీ అగ్నిప్రమాదం.. నిజాంపేట్‌లో బూడిదైన 6 ఫర్నిచర్ దుకాణాలు.. షార్ట్ సర్క్యూట్ కారణమా?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×