E-Paper
Advertisement

POCO C85 5G Smartphone: ఏఐ కెమెరా, భారీ బ్యాటరీతో పోకో కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు, కీలక వివరాలు లీక్‌!

POCO C85 5G Smartphone: ఏఐ కెమెరా, భారీ బ్యాటరీతో పోకో కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు, కీలక వివరాలు లీక్‌!
Advertisement

POCO C85 5G Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో.. భారత మార్కెట్‌లోకి త్వరలో ‘Poco C85 5G’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ హ్యాండ్ సెట్ వివరాలను కంపెనీ తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే.. ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌ విడుదల తర్వాత ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఓ లుక్కేసేద్దాం రండి..

పోకో C85 5G ఫీచర్లిలా:

పోకో C85 5జీ స్మార్ట్‌ఫోన్ 2x ARM కార్టెక్స్ A76 + 6x కార్టెక్స్ A55 కోర్ల ఆధారంగా రూపొందించిన మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ను కలిగి ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది GPU Mali-G57 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, అడాప్టివ్‌సింక్‌తో కూడిన పెద్ద 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే పోకో C85 5జీ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంటుంది.

AI కెమెరాతో పిచ్చ క్లారిటీ:

Advertisement

ఈ సరికొత్త పోకో హ్యాండ్ సెట్ టీయూవీ రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్‌తో రానుంది. అంటే.. ఇది కళ్లపై ఒత్తిడి పడకుంగా చేస్తుందన్న మాట. అంతేకాదు ఈ ఫోన్ స్క్రీన్ తక్కువ కాంతిలో కూడా మంచి బ్రైట్నెస్ అందిస్తుంది. ఇక వెనుక కెమెరా 50MP ఏఐ సహాయంతో ఉంటుందని, ఏఐ మోడ్, HDR , నైట్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని లీక్స్ సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉండటంతో క్వాలిటీ సెల్ఫీలు, వీడియోలను క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫోన్ బడ్జెట్ కెమెరా యూజర్లకు, రోజువారీ ఫోటోలు, వీడియో కాల్స్ చాలా అనువైనది.

భారీ బ్యాటరీ బ్యాకప్:

POCO C85 5G స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్ట్ త్వరిత ఛార్జింగ్‌ను నిర్ధారిస్తుంది. ఈ బ్యాటరీ దీర్ఘకాలిక ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియోలు, కాలింగ్, సోషల్ మీడియాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచ మార్కెట్లో విడుదలైంది. ఇప్పుడీ ఫోన్ త్వలోనే భారత్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×