E-Paper
Advertisement

BDL: బీడీఎల్ హైదరాబాద్‌లో మెనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000, డోంట్ మిస్

BDL: బీడీఎల్ హైదరాబాద్‌లో మెనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000, డోంట్ మిస్
Advertisement

BDL: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. డిగ్రీ, పీజీ, డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది.  నెలకు రూ.40,000 – రూ.1,40,000 వరకు జీతం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగ వెకెన్సీలు, విద్యార్హత, జీతం, ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం,  తదితర వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌ (BDL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్‌ 3వ తేదీ నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి..

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 80

భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్‌ సైన్స్‌, మెటలర్జీ, కెమికల్, సివిల్, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రీసోర్స్‌ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

మేనేజ్ మెంట్ ట్రైనీ జాబ్స్: 80 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో 55 నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. పీజీ, డిప్లొమా అర్హతలు కూడా ఉండాలి.  ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్‌ సైన్స్‌, మెటలర్జీ, కెమికల్, సివిల్, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రీసోర్స్‌, లా విభాగాల్లో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 డిసెంబర్ 3

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 29

వయస్సు: 2025 నవంబర్ 25 నాటికి అభ్యర్థుల వయస్సు 27 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.40,000 – రూ.1,40,000 వరకు జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

ALSO READ: Chicken Liver: చికెన్ లివర్ తినకూడదా? దీన్ని తినడం ఉపయోగాలేంటి?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×