E-Paper
Advertisement

Health Tips: తల స్నానం చేసే ముందు పాదాలకు నీరు పోయాలా? ఎందుకు?

Health Tips: తల స్నానం చేసే ముందు పాదాలకు నీరు పోయాలా? ఎందుకు?
Advertisement

Health Tips: శరీరంలో అత్యంత సున్నితమైన భాగం మెదడు. మన శరీరమంతా ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే ప్రధాన కేంద్రం కూడా ఇదే. రోజు మొత్తం మనం ఎదుర్కొనే ఒత్తిడి, ఆలోచనలు, భావోద్వేగాలు అన్నీ ఒకే చోట చేరి మెదడుపై బరువుగా నిలుస్తాయి. అప్పుడు రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది, నాడులు టైట్ అవుతాయి, ఫలితంగా తలనొప్పి, చిటపట, చిరాకు, ఒత్తిడి వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా వేడి వాతావరణంలో బయటికి తిరిగొచ్చిన వెంటనే, లేదా పనిలో బాగా అలసిపోయిన వెంటనే చాలామంది నేరుగా షవర్ క్రింద నిలబడిపోతారు. పై నుండి చల్లని నీరు తాకగానే ఒక్కసారిగా మెదడుపై షాక్ పడుతుంది. శరీరం మొత్తం వేడిగా ఉంటుంది, ఆ వేడి మధ్యలో ఒక్కసారిగా చల్లదనం తలపై పడితే రక్తనాళాలు ఒక్కసారిగా రెట్టింపు ఒత్తిడికి గురవుతాయి. ఇలాంటి క్షణాల్లో హార్ట్‌బీట్ వేగం మారిపోవడం, తల తిరగడం, కంటిముందు నల్లగా కనిపించడం, కొందరికి బీపీ తగ్గిపోవడం, మరికొందరికి మైకం రావడం జరగవచ్చు.

స్నానం పాదాలతో మొదలు పెడితే ఏమవుతుంది?

Advertisement

పాదాలలో ఎన్నో నాడులు, ముఖ్యంగా నాడీ కేంద్రాలకి సంబంధించిన ప్రెషర్ పాయింట్లు ఉంటాయి. మనిషి శరీరంలో చల్లదనం మొదట అంగీకరించే భాగం కూడా పాదాలే. అందుకే పాదాలకు నీరు పోస్తే రక్త ప్రసరణ శాంతంగా సమన్వయం చెంది క్రమంగా చల్లబడటం ప్రారంభమవుతుంది.ఆ ప్రక్రియలో హృదయ స్పందన సర్దుకుంటుంది, నరాల ఒత్తిడి తగ్గుతుంది, మెదడులో నిల్వైన వేడి క్రమంగా తగ్గిపోతుంది. పాదాలనుంచే శరీరమంతా చల్లదనం పాకుతుంది. అదే సమయంలో మెదడు ఒక్కసారిగా షాక్‌కు గురికావడం తగ్గిపోతుంది. కాబట్టి పాదాలను నీటితో ముంచిన తరవాత మెడకు నీరు పోస్తే నరాలు రిలాక్స్ అవుతాయి. చివరిగా తలకు నీరు పోస్తే మెదడు ఆ చల్లదనాన్ని సహజంగా అంగీకరిస్తుంది.

తలకు నేరుగా నీరు పోస్తే.. ప్రమాదమా?

Advertisement

పాతకాల వైద్యులు చెప్పేది ఏమిటంటే.. శరీరమంతా వేడిగా ఉన్నపుడు తలకు నేరుగా చల్లని నీరు పోయడం ప్రమాదం. ఇది సరళమైన మాటల్లో చెప్పాలంటే, మెదడు ఒక రకమైన షాకింగ్ పొజిషన్ లోకి వెళ్లిపోతుంది. ఇదే కొనసాగితే స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మైగ్రేన్ ఉన్నవారు, బీపీ సమస్యలు ఉన్నవారు, హార్ట్‌పేషెంట్స్, అధిక ఒత్తిడిలో ఉన్నవారు, ఎక్కువ టైమ్ ఫోన్ కంప్యూటర్ స్క్రీన్ల ముందు పని చేసే వాళ్లు, ఎండలో బాగా తిరిగేవాళ్లు వీరికి ఇది తప్పనిసరి నియమమని వైద్యులు కూడా చెబుతున్నారు.

Also Read: Samsung A74 Smartphone: అమోలేడ్ డిస్‌ప్లేతో శామ్‌సంగ్ ఏ74 ఎంట్రీ.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..

నర వ్యవస్థ శాంతించాలంటే..

పాదాలకు ముందుగా నీరు పోస్తే నర వ్యవస్థ శాంతిస్తుంది. రక్తప్రసరణ సమానంగా అవుతుంది. శరీరం చల్లదనాన్ని సహజంగా స్వీకరించడం ప్రారంభిస్తుంది. అప్పుడు మాత్రమే తలకు నీరు పోయినా ఆ చల్లదనం శరీరానికి కలిసివస్తుంది. అలాకాకుండా నేరుగా తలకు నీరు పోసుకుంటే మెదడు-హృదయాల స్పందనల మధ్య సంతులనం ఒక్కసారిగా కూలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరికి అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.. అందుకే పెద్దవాళ్లు,ఎప్పుడూ చెబుతూ వచ్చారు, ఎప్పుడూ తలకు ముందుగా నీరు పోయొద్దు, పాదాలకు ముందుగా పోయి తర్వాత మాత్రమే స్నానం చెయ్యాలి అని.

మన మూడ్‌ని బట్టే చల్లదనం

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పాదాల నుండి మొదలయ్యే చల్లదనం మన మూడ్ ను కూడా మార్చేస్తుంది. ఒత్తిడి తగ్గి మనసు తేలికగా అవుతుంది. డిప్రెషన్ ఫీలింగ్ తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది. తలనొప్పి సహజంగానే తగ్గిపోతుంది. స్నానం పూర్తయ్యే సరికి శరీరం మొత్తం రీసెట్ అయినట్లుగా, లోపల కొత్త ఎనర్జీ పుట్టినట్లు అనిపిస్తుంది. రోజుకు ఐదు నిమిషాలు పాదాలను చల్లని నీటిలో ఉంచినా రక్త ప్రసరణ అద్భుతంగా మెరుగవుతుంది. అలవాటు చేసుకున్నవాళ్లకి మైగ్రేన్ కూడా భారీగా తగ్గిపోతుంది. నిద్ర కూడా త్వరగా పడుతుంది. ఈ చిన్న మార్పుతో పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు. మన శరీరం లోపల ఎలా పనిచేస్తుందో తెలుసుకుని ఆ రీతిలో శరీరాన్ని చూసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×