E-Paper
Advertisement

Poco F8 5G Mobile: 7700mAh బ్యాటరీతో పోకో ఎఫ్8 5జి ఎంట్రీ.. ఇండియాలో ధర ఎంతంటే?

Poco F8 5G Mobile: 7700mAh బ్యాటరీతో పోకో ఎఫ్8 5జి ఎంట్రీ.. ఇండియాలో ధర ఎంతంటే?
Advertisement

Poco F8 5G Mobile: పోకో అనేది చైనా టెక్ దిగ్గజం షివోమీ (Xiaomi) కంపెనీకి చెందిన ఒక సబ్ బ్రాండ్. 2018లో ప్రారంభమైన ఈ బ్రాండ్ మొదట నుంచి మార్కెట్‌లోకి తనకంటూ బ్రాండ్ సంపాదించుకుంది. ఫ్లాగ్‌షిప్ పెర్ఫామెన్స్‌ను చాలా తక్కువ ధరలో అందించడం. పోకో ఎఫ్8 స్మార్ట్‌ఫోన్ 2026 ఏప్రిల్ 23న మార్కెట్లోకి రానుంది. ఫ్లాగ్‌షిప్-కిల్లర్ అనే తమ ఎప్పటి గుర్తింపును మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి పోకో ఈసారి ఇంకా దూకుడుగా ముందుకొస్తోంది. యూజర్లకు ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని అందించే మోడల్‌గా నిలుస్తోంది.  ఇప్పుడు ఈ మోడల్‌లోని ఫీచర్లను వివరంగా చూద్దాం.

డిజైన్ – ప్రీమియం పనితీరు

Advertisement

పోకో ఎఫ్8ను పూర్తిగా ప్రీమియం పనితీరు కోసం సిద్ధం చేశారు. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్‌తో హైపర్ ఓఎస్ 2 ఆధారంగా నడిచే ఆండ్రాయిడ్ 16 ఉంటుండటం వల్ల ఇంటర్‌ఫేస్ వేగంగా, తేలికగా స్పందిస్తుంది. మైక్రో ఎస్‌డీ లేకపోయినా 256జిబి యుఎఫ్ఎస్ 4.0, 12 జిబి ర్యామ్, అదనంగా 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ కలవడంతో పనితీరు ఎక్కడా ఆగదు. వైఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్ఎఫ్సి, డ్యూయల్ 5జి బ్యాండ్స్, ఐఆర్ బ్లాస్టర్‌ అన్నీ కలిసిన కనెక్టివిటీ ఈ ఫోన్‌ను వాస్తవానికి అత్యంత పూర్తిస్థాయి గాడ్జెట్‌గా నిలబెడుతుంది.

గొరిల్లా గ్లాస్‌తో అప్‌డేటెడ్ లుక్

Advertisement

డిస్ల్‌ప్లే విషయంలో పోకో ఎఫ్‌8 అద్భుతమైన డిస్‌ప్లే అనుభవాన్ని అందిస్తుంది. 6.78 అంగుళాల అమోలేడ్ స్క్రీన్ 1220 × 2712 పిక్సెల్ స్పష్టతతో కంటెంట్‌ను తేలికగా, నాణ్యంగా చూపిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిసి గేమింగ్ అనుభవాన్ని చాలా మృదువుగా మారుస్తాయి. బెజెల్-లెస్ అప్‌డేటెడ్ లుక్‌తో 94శాతం కన్నా ఎక్కువ స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి ఉండటం ఈ మోడల్‌ను ఇంకా ఆకర్షణీయంగా మార్చింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ఉండటం వల్ల నీటి చుక్కలు, చిన్న గీతలు ఏవైనా దీన్ని తగినంత రక్షణతో కాపాడుతాయి.

పర్‌‌ఫార్మెన్స్ పర్‌ఫెక్ట్

పోకో ఎఫ్8లోని స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ చిప్‌సెట్ ఈ ఫోన్‌కి ప్రధాన శక్తి. ఆక్టా-కోర్ నిర్మాణం, కొత్త గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ అన్నీ కలసి హెవీ యాప్‌లు, గ్రాఫిక్స్, గేమింగ్‌, వేగవంతమైన మల్టీటాస్కింగ్ అన్నింటినీ ఆలస్యం లేకుండా నడిపిస్తాయి. హైపర్ ఓఎస్ 2 కూడా శక్తి వినియోగాన్ని తెలివిగా నియంత్రించి పనితీరును తగినంత స్థిరంగా ఉంచుతుంది.

Also Read: OnePlus 15 vs iPhone 17: వన్‌ప్లస్ 15, ఐఫోన్ 17.. ఇండియాలో టాప్ ట్రెండింగ్ ఫోన్స్ ఇవే, వీటిలో ఏది బెస్ట్?

1080పి వీడియోతో కెమెరా హైలెట్

కెమెరా విషయానికి వస్తే, పోకో ఎఫ్8ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం దీని ట్రిపుల్ సెటప్. ప్రధానంగా 50ఎంపి లెన్స్‌కి ఉన్న f/1.59 అపర్చర్, ఓఐఎస్, పిడిఎఎఫ్ కారణంగా తక్కువ లైటింగ్‌లోనూ ఫోటోలు తగినంత స్పష్టతతో వస్తాయి. రంగుల క్వాలిటీగా కనిపించేలా ప్రతి ఫ్రేమ్‌ని ప్రాసెస్ చేస్తాయి. దీని వెంట మరో 50ఎంపి సెన్సార్, 8ఎంపి లెన్స్ ఉండటం వల్ల పోర్ట్రెయిట్ షాట్లు, క్లోజ్-అప్ షాట్లలో కూడా నాణ్యత తగ్గదు. వీడియో రికార్డింగ్‌లో 4కె 60fps సపోర్ట్ ఉండటం కంటెంట్ క్రియేటర్లకు ఈ మోడల్‌ను నిజంగా పనికొచ్చే ఎంపికగా మార్చుతుంది. ముందుభాగంలో 32ఎంపి సెన్సార్ ఉండటం వల్ల సెల్ఫీలు సహజంగా, శుభ్రమైన 1080p వీడియోలతో రికార్డు అవుతాయి.

7700 mAh భారీ బ్యాటరీ

బ్యాటరీ భాగం విషయానికి వస్తే, 7700mAh కెపాసిటీ ఈ ఫోన్‌కి ప్లెస్ ప్లాయింట్ అనే చెప్పాలి. రోజంతా వాడినా బ్యాటరీ తగ్గిన భావన రాదు, అవసరమైతే మరుసటి రోజులోనూ ఉపయోగించుకునే స్థాయిలో బ్యాకప్ ఇస్తుంది. 100W టర్బోచార్జింగ్ ఉండటం వల్ల కొద్ది నిమిషాల్లోనే తగినంత శక్తి నిండిపోతుంది. రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కారణంగా అవసరమైనప్పుడు మరో ఫోన్‌ని కూడా దీనితో శక్తి నింపచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, సాటిలైట్ నావిగేషన్ సపోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ అన్నీ ఈ మోడల్‌కు పూర్తి ఫీచర్ల సమాహారంలా పనిచేస్తాయి. వినియోగదారుడు కోరుకునే అన్ని అవసరాలు ఒకే పరికరంలో దొరికేలా రూపొందించిన మోడల్‌గా ఇది నిలుస్తుంది.

ధర – ఇండియాలో ఎంట్రీ వివరాలు

ఇప్పుడు ధర విషయానికొస్తే, పోకో ఎఫ్8 భారత్‌లో 2026 ఏప్రిల్ 23న మార్కెట్లోకి రానుంది. లీకుల ప్రకారం దీని ధర రూ.28,999 నుంచి రూ.32,999 మధ్య ఉండొచ్చు. తక్కువ ఖర్చులో అధిక శక్తి కోరుకునే యూజర్లకు ఈ ధరలో ఇలాంటి ఫీచర్లు దొరకడం చాలా అరుదు. అందుకే పోకో ఎఫ్8ను చాలామంది ముందే ఫ్లాగ్‌షిప్-కిల్లర్‌గా పరిగణిస్తున్నారు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత పోటీలో గట్టి మార్పు తీసుకురాగల మోడల్‌గా చర్చలో ఉంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×