E-Paper
Advertisement

Poco F8 Ultra: బెస్ట్ ఫీచర్లు, మంచి డిజైన్, పోకో న్యూ స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీ ఏంటంటే ?

Poco F8 Ultra: బెస్ట్ ఫీచర్లు, మంచి డిజైన్, పోకో న్యూ స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీ ఏంటంటే ?
Advertisement

Poco F8 Ultra: పోకో ప్రస్తుతం తన F8 సిరీస్ లాంచ్ కు సన్నాహాలు చేస్తోంది. ఈ పోకో ఫోన్ నవంబర్ 26న ప్రపంచ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ సిరీస్ కింద.. కంపెనీ రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుంది. అవి పోకో F8 ప్రో, F8 అల్ట్రా, కానీ వీటి స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించలేదు.  రాబోయే పోకో స్మార్ట్‌ఫోన్ సిరీస్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పోకో F8 సిరీస్‌లో ప్రత్యేకత ఏంటి ?

Poco F8 Pro , Poco F8 Ultra స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్ అవుతాయి. ముందుగా.. డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. అల్ట్రా వేరియంట్‌లో 6.9-అంగుళాల OLED ప్యానెల్ ఉంటుంది. F8 Proలో 6.59-అంగుళాల OLED డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. రెండు పోకో మోడళ్లకు 1.5K రిజల్యూషన్ , 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.

Advertisement

కెమెరా:

పోకో F8 అల్ట్రాలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌లో అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ , పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే.. అల్ట్రా వెర్షన్‌లో 20-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.

పోకో స్మార్ట్‌ఫోన్‌ల ఛార్జింగ్ సామర్థ్యాల విషయానికి వస్తే.. పోకో F8 ప్రో, F8 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు రెండూ 100W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. అదనంగా.. అల్ట్రా వేరియంట్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతును అందిస్తుంది.

పోకో F8 ప్రో సిరీస్ ధర:

పోకో ఎఫ్8 ప్రో సిరీస్ గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్‌లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. పోకో ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. కంపెనీ లాంచ్ డేట్ ఆధారంగా, పోకో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన కొన్ని వారాల తర్వాత భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుంది. అందుకే 2026 ప్రారంభంలో ఇండియాలో ఈ మోడల్స్ లాంచ్ జరిగే అవకాశం ఉంది.

Poco F8 సిరీస్ ధరలకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి వివరాలు లేవు. ఈ సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కలిగి ఉంటుందని, ఇటీవల విడుదల చేసిన ఫ్లాగ్‌షిప్ OnePlus 15, Oppo Find X9 సిరీస్, Vivo X300 సిరీస్, ఇతర ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యక్ష పోటీగా నిలుస్తుందని చెబుతున్నారు.

రంగు:

Poco బ్రాండింగ్ మినహా.. డిజైన్ Redmi K90 Pro Max లాగానే ఉంది. ఇది బ్లాక్ షేడ్, డెనిమ్ ఫినిషింగ్‌తో సహా రెండు రంగులలో కనిపిస్తుంది. మనం ఫ్లాట్ డిస్ప్లే ప్యానెల్, రెక్టాంగిల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ‘సౌండ్ బై బోస్’ ట్యాగ్ కూడా ఉంటుంది.

Also Read: డబ్బులు రెడీ చేస్కోండి. రియల్‌మీ జిటి 8 ప్రో లాంచ్.. ఈ ఫోన్ ప్రతీ బ్రాండ్‌కి సవాలే మావ !

ఆప్టిక్స్ విషయానికొస్తే.. పోకో F8 అల్ట్రాలో 50-మెగాపిక్సెల్ OIS-సపోర్ట్ చేసిన ప్రధాన సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ OIS-బ్యాక్డ్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ ఉంటాయి. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఇది ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉండనుంది.

డిస్ ప్లే: 

Poco F8 Ultra 120Hz రిఫ్రెష్ రేట్ , 2,608×1,200 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఫ్లాట్ 6.9-అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ మెటల్ మిడిల్ ఫ్రేమ్, IP69-రేటెడ్ డస్ట్ , వాటర్ రెసిస్టెంట్ బిల్డ్‌ను కలిగి ఉండనుంది. ఇది బోస్ ద్వారా ట్యూన్ చేయబడ్డ స్పీకర్లను కలిగి ఉంటుంది. దీని కొలతలు 163.3×77.8×8.05mm కాగా బరువు 220 గ్రాములు ఉంటుంది.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×