E-Paper
Advertisement

Northern Railway: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. రైల్వేలో 4116 ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Northern Railway: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. రైల్వేలో 4116 ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
Advertisement

Northern Railway: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌, నార్తర్న్‌ రైల్వే ఢిల్లీ నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. పదో తరగతి, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌, నార్తర్న్‌ రైల్వే ఢిల్లీ (Northern Railway) వివిధ క్లస్టర్‌ లలో ఖాళీగా ఉన్న 4,116 అప్రెంటిస్‌  ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు  అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4116

వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.  ట్రేడ్‌, మెడిసిన్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, కార్పెంటర్‌ మొదలైన విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

క్లస్టర్ వారీగా అప్రెంటీస్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి..

లఖ్‌నవూ: 1,397
 దిల్లీ: 1,137
 ఫిరోజ్‌పుర్‌: 632
 అంబాల: 934
 మొరదాబాద్‌: 16

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఐటీఐ పాసై ఉండాలి.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 25

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 24

వయస్సు: 2025 డిసెంబర్‌ 24వ తేదీ నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 15 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4116

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 24

ALSO READ: Telangana Inter Practical Exams-2026: తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్-2026.. నిఘా మధ్య పరీక్షలు, కన్ను తిప్పితే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×