E-Paper
Advertisement

IRCTCకి కాలం చెల్లిందా? కొత్త ‘RailOne’ యాప్ ప్రత్యేకతలు ఇవే!

IRCTCకి కాలం చెల్లిందా? కొత్త ‘RailOne’ యాప్ ప్రత్యేకతలు ఇవే!
Advertisement

RailOne vs IRCTC: భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి టికెట్ బుకింగ్ అనగానే మొదట గుర్తొచ్చేది ‘IRCTC’ యాప్. అయితే ఇటీవల రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సరికొత్తగా ‘RailOne’ (రైల్ వన్) అనే యాప్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ లాంచ్ అయిన కొద్ది కాలంలోనే కోట్లాది డౌన్ లోడ్స్ తో విశేష ఆదరణ సంపాదించింది. దీంతో చాలామంది ప్రయాణికుల్లో ఈ రెండు యాప్స్ గురించి కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ రెండింటిలో ఏది బెస్ట్? అసలు రెండింటికీ తేడా ఏంటి? అని తెగ గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాప్స్ కు సంబంధించి తేడాలు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

రైల్ వన్.. ఆల్ రౌండర్ యాప్

గతంలో రైల్వే ప్రయాణికులు.. రిజర్వేషన్ టికెట్ కోసం ‘ఐఆర్ టీసీ’ (IRCTC), జనరల్ టికెట్ కోసం ‘యూటీఎస్’ (UTS), లైవ్ ట్రైన్ స్టేటస్ కోసం ‘ఎన్ టీఈఎస్’ (NTES), ఫిర్యాదుల కోసం ‘రైల్ మదాద్’ (Rail Madad).. వంటి రకరకాల యాప్‌లను వాడాల్సి వచ్చేది. దీనికి చెక్ పెడుతూ ఆ సేవలన్నింటిని ఒకే యాప్ కిందకు తీసుకొస్తూ కేంద్ర రైల్వే సమాచార వ్యవస్థ (CRIS).. ‘రైల్ వన్’ (RailOne) యాప్ ను రూపొందింది. పైన పేర్కొన్న సేవలన్నీ ఈ యాప్ లోనే లబించనున్నాయి.

మరీ ఐఆర్‌సీటీసీ సంగతేంటి?

Advertisement

రైల్ వన్ యాప్ తో పోలిస్తే ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect) యాప్ సేవలు చాలా పరిమితమనే చెప్పాలి. ఈ యాప్ ప్రధానంగా రిజర్వేషన్ టికెట్లు (Sleeper, AC, Tatkal) బుక్ చేసుకోవడానికి మాత్రమే ప్రస్తుతం ఉపయోగపడుతోంది. అదే విధంగా క్యాటరింగ్ సేవలకు మాత్రమే దీనిని ప్రయాణికులు వినియోగిస్తున్నారు. కాబట్టి అధిక రైల్వే సేవల పరంగా చూస్తే.. ‘రైల్ వన్’ ప్రస్తుతం ది బెస్ట్ గా నిలుస్తోందని చెప్పవచ్చు.

టికెట్ల బుకింగ్ పరంగా..

ఐఆర్‌సీటీసీ యాప్‌లో కేవలం రిజర్వేషన్ టికెట్లు మాత్రమే బుక్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. అలాగే తత్కాల్ టికెట్స్, పీఎన్ఆర్ స్టేటస్ చెకింగ్, టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ నగదు పొందేందుకు ఈ యాప్ సేవలు ఉపయోగపడతాయి. అయితే జనరల్ (Unreserved) టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఇందులో ఉండదు. కానీ ‘RailOne’ యాప్‌లో రిజర్వేషన్‌తో పాటు జనరల్ టికెట్లు, ప్లాట్‌ఫారమ్ టికెట్లను కూడా నిమిషాల్లో బుక్ చేసుకోవచ్చు.

జెట్ వేగంతో తత్కాల్ బుకింగ్..

Advertisement

తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు IRCTC యాప్ ఎంతలా ఇబ్బంది పెడుతుందో ప్రయాణికులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేజీ లోడ్ అవ్వకపోవడం, పేమెంట్ దగ్గర సర్వర్ డౌన్ అవ్వడం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. వీటన్నింటికి చెక్ పెడుతూ RailOne యాప్‌ను రైల్వే శాఖ తీసుకొచ్చింది. సరికొత్త, వేగవంతమైన సాంకేతికతతో దీనిని రూపొందించింది. దీనివల్ల పీక్ అవర్స్ లోనూ ఈ యాప్ చాలా స్మూత్‌గా, వేగంగా పనిచేస్తుందని యూజర్లు చెబుతున్నారు.

Also Read: BSNL సూపర్ డూపర్ ప్లాన్.. 150 రోజుల పాటు.. ప్రతీ రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

లాగిన్ ప్రక్రియ.. మరింత ఈజీ

ఐఆర్ సిటీసీలో లాగిన్ అవ్వాలంటే ప్రతీసారి క్యాప్చా (CAPTCHA) కోడ్ ఎంటర్ చేయడం లేదా పిన్ నంబర్ కొట్టడం చేయాలి. అదే రైల్ వన్ యాప్‌లో బయోమెట్రిక్ (ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడీ) లాగిన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా RailOne కోసం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా.. పాత ఐఆర్ సిటీసీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తోనే ఇందులో నేరుగా లాగిన్ అయిపోవచ్చు.

Also Read: అస్సలు మిస్ అవ్వకండి.. ఉచితంగా 20GB డేటా ఇస్తున్న జియో!

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×