E-Paper
Advertisement

BSNL సూపర్ డూపర్ ప్లాన్.. 150 రోజుల పాటు.. ప్రతీ రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

BSNL సూపర్ డూపర్ ప్లాన్.. 150 రోజుల పాటు.. ప్రతీ రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!
Advertisement

BSNL Plans: ప్రస్తుత రోజుల్లో ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు బంపర్ ఆఫర్లతో ఊరటనిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్ల కోసం చూసేవారికి ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తీసుకొచ్చిన రూ.997 ప్లాన్.. యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు, ప్రయోజనాలు మీకోసం..

150 రోజుల వ్యాలిడిటీ

సాధారణంగా ప్రైవేట్ కంపెనీలు రూ.1000 బడ్జెట్‌లో కేవలం 84 రోజులు లేదా గరిష్టంగా 90 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్ తన రూ. 997 ప్లాన్‌తో ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీని ఆఫర్ చేస్తోంది. అంటే దాదాపు 5 నెలల పాటు మీ సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది. పదే పదే రీఛార్జ్ చేసుకోవాలన్న టెన్షన్ యూజర్లకు ఉండదు.

రోజుకు 2GB హై స్పీడ్ డేటా

Advertisement

ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారికి కూడా ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే ఈ 150 రోజుల్లో మొత్తంగా 300GB డేటాను వాడుకోవచ్చు. ఒకవేళ రోజువారీ 2GB లిమిట్ అయిపోతే.. ఇంటర్నెట్ స్పీడ్ 40 Kbps కి తగ్గుతుంది. దీని సాయంతో వాట్సప్ చాట్, యూపీఐ పేమెంట్స్ వంటివి చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.

దేశంలో ఎక్కడికైనా ఫ్రీ కాల్స్

రూ.997 ప్లాన్ లో డేటాతో పాటు అపరిమిత కాల్స్ ను సైతం బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. దేశంలో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు.రోమింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. దీంతో పాటు రోజుకు 100 ఉచిత SMSలు కూడా యూజర్లకు లభించనున్నాయి.

మరికొన్ని బెనిఫిట్స్

Advertisement

ఈ ప్లాన్‌తో కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాకుండా మరికొన్ని అదనపు బెనిఫిట్స్ ను సైతం బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్ ద్వారా మీకు నచ్చిన కాలర్ ట్యూన్‌ను సెట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. అలాగే హార్డీ గేమ్స్, ఛాలెంజర్ గేమ్స్, జింగ్ మ్యూజిక్ వంటి అదనపు సేవలను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.

Also Read: అస్సలు మిస్ అవ్వకండి.. ఉచితంగా 20GB డేటా ఇస్తున్న జియో!

ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ

జియో, ఎయిర్‌టెల్‌, వీఐ వంటి ప్రైవేటు టెలికాం సంస్థల్లో రోజుకు 2GB డేటాతో 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ల ధరలే సుమారు రూ. 1000 వరకూ ఉన్నాయి. అలాంటిది బీఎస్‌ఎన్‌ఎల్ అదే ధరలో 150 రోజుల వ్యాలిడిటీ ఇవ్వడం గొప్ప విషయమని టెలికాం నిపుణులు పేర్కొంటున్నారు. రూ.997 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే రోజుకు దాదాపు రూ.6 మాత్రమే యూజర్ కు ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు. తక్కువ బడ్జెట్‌లో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి.. రూ. 997 ప్లాన్ ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ గా నిలుస్తోందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: క్రోమా నమ్మశక్యం కాని ఆఫర్.. సగం ధరకే సరికొత్త ‘ఐఫోన్ 17’.. చార్జర్ కూడా ఫ్రీ!

Related News

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

Big Stories

Advertisement
×