ICFAI Admissions: నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేICFAI Foundation for Higher Education (IFHE), హైదరాబాద్ 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను ప్రారంభించింది. NAAC నుంచి అత్యున్నత A++ గ్రేడ్పొందిన ఈ విశ్వవిద్యాలయం, విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేసే విద్యా విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందింది.
అందుబాటులో ఉన్న కోర్సులు
ICFAI హైదరాబాద్‌లో మేనేజ్‌మెంట్, లా, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సోషల్ సైన్సెస్, కామర్స్ తదితర విభాగాల్లో వివిధ అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, డాక్టరల్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఉద్యోగ రంగంలో విజయవంతంగా రాణించేలా, పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్సులు రూపొందించబడ్డాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఐసీఎఫ్ఏఐ ప్రత్యేకతలు
అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ వనరులు, పరిశోధనలకు అనుకూల వాతావరణం ICFAI హైదరాబాద్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్టులు, పరిశ్రమ నిపుణులతో సమావేశాలు, గెస్ట్ లెక్చర్లు వంటి అవకాశాలు కల్పిస్తూ విద్యను ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం చేస్తున్నారు.
క్యాంపస్ లైఫ్
విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్న విశ్వవిద్యాలయం, విద్యార్థుల కోసం వివిధ క్లబ్ కార్యకలాపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, ఔత్సాహిక వ్యాపార కార్యక్రమాలు (Entrepreneurship Initiatives), సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులు విద్యాపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మరింత ఆత్మవిశ్వాసంతో ఎదిగే అవకాశం పొందుతున్నారు.
ప్రతిభ కనబరిచే విద్యార్థులకు మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఉన్నత విద్యను మరింత సులభంగా కొనసాగించవచ్చు.
అడ్మిషన్ వివరాలు
దేశ, విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో విజయవంతంగా రాణిస్తున్న వేలాది మంది పూర్వ విద్యార్థులను అందించిన ICFAI హైదరాబాద్, నాణ్యమైన విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తోంది. 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.మరిన్ని వివరాల కోసం www.ifheindia.orgవెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా1800-599-0767టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.