E-Paper
Advertisement

Dinosaur Voice: డైనోసార్లు గురించి మనం ‘విన్నది’ అబద్దమా? ఆ సినిమాలు మనల్ని మోసం చేశాయా?

Dinosaur Voice: డైనోసార్లు గురించి మనం ‘విన్నది’ అబద్దమా? ఆ సినిమాలు మనల్ని మోసం చేశాయా?
Advertisement

డైనోసార్లు.. ఆకారంలో పెద్దగా, గంభీరంగా కనిపించే భయానక జీవులు. వాటిని ఊహించుకుంటే చాలు ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి జీవి ఇప్పుడు ఉండి ఉంటే.. పరిస్థితులు ఎలా ఉండేవనేది ఇప్పటికే సినిమాల్లో చూపించేశారు. భారీ ఆకారంతో పెద్ద పెద్ద అడుగులతో అవి జనాల మధ్య పరుగులు తీస్తుంటే.. ఎంత భయానకంగా ఉంటుందనేది బిగ్ స్క్రీన్స్‌పై చూసి చాలామంది భయపడ్డారు. ముఖ్యంగా ఆ డైనోసర్ గర్జన వింటే.. గుండె ధడేల్ అంటుంది. డైనోసర్ అంటే.. ఆ మాత్రం గాండ్రింపు ఉండాలిలే అని అంటారా? ఔను నిజమే, కానీ.. సినిమాల్లో మనం చూసింది అంతా కేవలం కల్పితం. వాస్తవానికి డైనోసర్ గర్జన అంత గంభీరంగా ఉండదట. దానిది పీల గొంతు అంట.

గత 30 ఏళ్లుగా అదే వింటున్నాం, కానీ…

డైనోసర్‌లను మనం నేరుగా చూడలేదు. కాబట్టి.. సినిమాల్లో ఏం చూపించారో అదే నిజం అనుకుంటున్నాం. గత 30 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. మొదటిసారిగా 1993లో డైనోసర్ల భయానక గర్జనలతో థియేటర్లు దద్దరిల్లాయి. ‘జురాసిక్ పార్క్’ దయ వల్ల డైనోసర్ అనే జీవి గురించి తెలుసుకొనే అవకాశం దొరికింది. అప్పటి వరకు డైనోసర్ అంటే ఏమిటో తెలియనివారికి.. అదొక అద్భుతం. ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆధరణ పొందడంతో దానికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. అయితే, ఎప్పుడూ ఒకే టైపు కాన్సెప్ట్‌తో రావడంతో జనాలకు కూడా బోర్ కొట్టేసింది. అయితే, ఆ సినిమాల్లో వింటున్న డైనోసర్‌కు డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు.. ఒక పిల్ల ఏనుగు, ఒక మొసలి, ఒక పులి. అర్థం కాలేదా? ఆ మూడు జంతువుల అరుపులను కలిపే డైనోసర్ ‘వాయిస్’ను క్రియేట్ చేశారు. అప్పటి నుంచి దాన్ని సినిమాల్లోనే కాకుండా డాక్యుమెంటరీలు, థీమ్ పార్కులు, పిల్లల బొమ్మల్లో కూడా వాడేస్తున్నారు.

డైనోసర్ పక్షి జాతికి చెందినదా?

Advertisement

డైనోసర్‌లు పక్షి జాతికి చెందినవనే విషయం చాలామందికి తెలీదు. ముఖ్యంగా ఇప్పుడు మనం తింటున్న కోడికి ఉండే ఫీచర్లే డైనోసర్లుకు ఉండేవి. అయితే, వాటి దంతాలు మాత్రం భిన్నంగా ఉండేవి. డైనోసర్లు అంతమైపోయి కొన్ని మిలియన్ ఏళ్లు అవుతోంది. దాని వల్ల వాటి శరీరం మొత్తం నేలలో కలిసిపోయి.. కేవలం వాటి ఎముకలు, దంతాలు మాత్రమే మిగిలాయి. వాటి ఆధారంగానే అప్పట్లో డైనోసర్లు ఎలా ఉండేవనేది అంచనా వేశారు. అయితే, అవి ఎలా గర్జించేవనేది తెలుసుకోలేకపోయారు. అది తెలుసుకోడానికి అవసరమైన స్వర తంతువులు, స్వర పేటికలు, మృదు కణజాలాలు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా భూమిలో కలిసిపోవడమే ఇందుకు కారణం.

స్వరపేటికతో కొత్త విషయాలు వెలుగులోకి..

ఎట్టకేలకు పరిశోధకులకు 2023లో డైనోసర్‌కు చెందిన ఒక స్వరపేటిక (వాయిస్ బాక్స్) ఒకటి లభించింది. దాని ఆధరంగా డైనోసర్ స్వరం ఎలా ఉండేదో అంచనా వేశారు. 2025లో మరిన్ని పరిశోధనలతో డైనోసర్ అసలైన స్వరాన్ని తెలుసుకోగలిగారు. డైనోసర్లు.. క్షీరదాల తరహాలో కూసేవని పేర్కొన్నారు. వాటి అరుపులు పావురాలు, ఈము (ఒస్ట్రిచ్) తరహాలో ఉండేవని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. మనకు సినిమాల్లో మనం ‘విన్నది’ అంతా అబద్దమని అర్థమవుతుంది. నిజంగా పావురాలు, ఈము అరుపులతో డైనోసర్లను చూపిస్తే.. ఆ సినిమాల పరిస్థితి ఎలా ఉండేదో కదూ.

Advertisement

Also Read: భూమికి వయసైపోయిందా? ఇంకా ఎన్నేళ్లు టైమ్ ఉంది? ఆ తర్వాత ఏమవుతుంది?

Tags

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×