Realme 14x 5G Price Drop: రియల్‌మీ ఈ ఏడాది భారత్‌లో బడ్జెట్ నుండి ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్స్ వరకు అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. తాజాగా మార్కెట్‌లో నార్జో 90 5G సిరీస్ వచ్చినప్పటికీ.. గత సంవత్సరం విడుదలైన రియల్‌మీ 14X 5G ను ఇప్పుడు తక్కువ ధరకే అందిస్తోంది. రూ.15,000 రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న యూజర్లకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్ లాంటిది.
ప్రస్తుతం అమెజాన్‌లో 6GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,799. 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ గోల్డెన్ గ్లో, జువెల్ రెడ్ కలర్‌లో రూ.14,999 ధరకి అందుబాటులో ఉంది. ఇక క్రిస్టల్ బ్లాక్ కలర్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ యొక్క ధర .15,499గా ఉంది.
అలాగే అమెజాన్ ప్రస్తుతం ఈ ఫోన్‌పై రూ.900 కూపన్ కోడ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఫలితంగా, 6GB RAM వేరియంట్‌ను రూ.13,899 ప్రారంభ ధరలో, హైఎండ్ వేరియంట్‌ను రూ.14,099 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Also Read: 43 అంగుళాల స్మార్ట్ టీవీపై ఊహించలేనంత డిస్కౌంట్.. రూ.29,999 ధర నుంచి రూ.11,599కి తగ్గింపు!
ఇకపోతే ఈ రియల్‌మీ 14X 5Gలో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఫోన్‌ను వేగవంతంగా, స్మూత్‌గా అనుభవించేందుకు సహాయపడతాయి. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్‌గా రూపొందించబడిన ఈ హ్యాండ్ సెట్ IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ నుంచి రక్షణ కలిగిస్తుంది.
ఈ రియల్‌మీ 14X 5G డిస్‌ప్లే రైన్ వాటర్ టచ్ సపోర్ట్ కలిగి ఉండటంతో, తడి చేతులతో కూడా ఫోన్‌ని సులభంగా ఉపయోగించవచ్చు. దీంతోపాటు ఈ ఫోన్ ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఈ హ్యాండ్ సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC తో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 5.0 పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. అంతేకాకుండా.. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
కెమెరా పరంగా చూసుకుంటే.. ఈ ఫోన్ వెనుక వైపు ప్రధానంగా 50MP కెమెరా, ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000mAh బ్యాటరీతో, రోజువారీ వినియోగానికి ఈ ఫోన్ మెరుగ్గా నిచేస్తుంది. అలాగే 5G, 4G, బ్లూటూత్, వై-ఫై, USB-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు మెరుగైన ఆడియో అనుభవానికి అల్ట్రా వాల్యుమ్ మోడ్ కూడా అందిస్తుంది.
Also Read: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన శాంసంగ్.. ప్రపంచంలోనే తొలి 115 ఇంచుల మైక్రో RGB టీవీ లాంచ్!