E-Paper
Advertisement

Smartphone Comparison: వన్‌ప్లస్ 15R vs ఐకూ 13 vs రియల్ మి GT 7 ప్రో.. రూ.60,000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: వన్‌ప్లస్ 15R vs ఐకూ 13 vs రియల్ మి GT 7 ప్రో.. రూ.60,000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?
Advertisement

OnePlus 15R vs iQOO 13 vs Realme GT 7 Pro Comparison| ఇండియాలో వన్‌ప్లస్ ఇటీవలే కొత్తగా వన్‌ప్లస్ 15R లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ కు ఫీచర్ల పరంగా ఐకూ 13, రియల్ మి GT 7 ప్రో ఫోన్లు పోటీగా ఉన్నాయి. మూడు ఫోన్‌లు రూ.60,000 లోపు సెగ్మెంట్‌ కు చెందినవి. పవర్ యూజర్లు, ప్రీమియం బయర్ల కోసమే ఈ ఫోన్లు ప్రత్యేకం. పర్ఫామెన్స్, డిస్‌ప్లే క్వాలిటీ, ఫాస్ట్ చార్జింగ్‌పై ఫోకస్ ఉంది. మీకు ఏది బెస్ట్ అని తెలుసుకోవడానికి వాటి ఫీచర్లను పోల్చి చూద్దాం.

ఇండియాలో మూడు ఫోన్ల ధరలు, వేరియంట్లు

వన్‌ప్లస్ 15R రెండు వేరియంట్స్‌లో వస్తోంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ.47,999. 12GB + 512GB స్టోరేజ్ ధర రూ.52,999. ఐకూ 13 ధర కొంచెం ఎక్కువ. 12GB + 256GB రూ.54,999. 16GB + 512GB ధర రూ.59,999. రియల్ మి GT 7 Pro 12GB + 256GB ధర రూ.59,999. 16GB + 512GB వేరియంట్ ధర రూ.65,999. రియల్ మి ధర మూడింటిలో అత్యధికం. కానీ ఇందులో 16GB ర్యామ్ వేరియంట్ ఉండడం స్పెషల్.

డిస్‌ప్లే, స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉంది?

Advertisement

వన్‌ప్లస్ 15Rలో 6.83 అంగుళాల ఏఎంఓఎల్‌ఇడీ డిస్‌ప్లే ఉంది. 1.5కె రిజల్యూషన్, 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్. స్మూత్ స్క్రోలింగ్, వైబ్రంట్ కలర్స్ ఇస్తుంది.
ఐకూ 13లో 6.82 అంగుళాల 2కె ఏఎంఓఎల్‌ఇడీ, 144Hz రిఫ్రెష్ రేట్. పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ ఇస్తుంది.
రియల్ మి GT 7 Proలో 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్‌ఇడీ ప్లస్, 6000 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ సన్‌లైట్‌లో కూడా విజిబిలిటీ బాగా ఉంటుంది.

ప్రాసెసర్, పర్ఫామెన్స్ ఏమిటి?

వన్‌ప్లస్ 15Rలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా నడుస్తుంది.
ఐకూ 13లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్. ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది.
రియల్ మి GT 7 Proలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 3nm ప్రాసెసర్. బెటర్ ఎఫిషియెన్సీ, సస్టైన్డ్ పర్ఫార్మెన్స్.
మూడింటిలోనూ హెవీ గేమింగ్, డైలీ యూసేజ్ బాగుంటుంది.

సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఏమిటి?

Advertisement

వన్‌ప్లస్ 15Rలో ఆక్సిజన్‌ ఓఎస్ 16 (ఆండ్రాయిడ్ 16 బేస్) ఉంది. క్లీన్, ఫాస్ట్ ఇంటర్‌ఫేస్.
ఐకూ 13లో ఫన్‌టచ్ ఓఎస్ 15 (ఆండ్రాయిడ్ 15 ఆధారం).
రియల్ మి GT 7 Proలో రియల్‌మీ యూఐ 6.0 (ఆండ్రాయిడ్ 15).
వన్‌ప్లస్ 15R ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా అడ్వాన్స్ ఉంది.

బ్యాటరీ, చార్జింగ్ స్పీడ్

వన్‌ప్లస్ 15Rలో 7,400mAh భారీ బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ చార్జింగ్. హెవీ యూజర్లకు సూపర్. ఐకూ 13లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W ఫాస్ట్ చార్జింగ్ (100W PPS కూడా). రియల్ మి GT 7 Proలో 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W చార్జింగ్.

కెమెరా సెటప్ పోలిక ఏమిటి?

వన్‌ప్లస్ 15Rలో 50MP ప్రైమరీ (OIS), 8MP అల్ట్రావైడ్, 32MP ఫ్రంట్ కెమెరా. ఐకూ 13లో మూడు 50MP రియర్ కెమెరాలు (వైడ్, అల్ట్రావైడ్, టెలిఫోటో), 32MP సెల్ఫీ. రియల్ మి GT 7 Proలో 50MP మెయిన్ (OIS), 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 120x హైబ్రిడ్ జూమ్.

Also Read: యూట్యూబ్ షార్ట్స్‌లో పెద్ద మార్పు.. ఇక ఆ బటన్ కనిపించదు.. ఎందుకంటే

కనెక్టివిటీ, డైమెన్షన్స్ 

వన్‌ప్లస్ 15Rలో వై-ఫై 7, బ్లూటూత్ 6.0, NFC, యూఎస్‌బీ టైప్-సీ. బరువు 218 గ్రాములు. ఐకూ 13లో వై-ఫై 7, బ్లూటూత్ 5.4, 3.5mm హెడ్‌ఫోన్ జాక్. బరువు 213 గ్రాములు. రియల్ మి GT 7 Proలో వై-ఫై 7, NFC. బరువు 222.8 గ్రాములు.

ఏ ఫోన్ బెస్ట్?

మూడు ఫోన్‌లు ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్ఫామెన్స్ ఇస్తాయి. మీ ప్రయారిటీస్‌పై ఆధారంగా ఎంచుకోండి. క్లీన్ ఇంటర్‌ఫేస్, భారీ బ్యాటరీ కావాలంటే వన్‌ప్లస్ 15R బెస్ట్. 7,400mAh బ్యాటరీ ఎక్సలెంట్ ఎండ్యూరెన్స్ ఇస్తుంది.
పర్ఫామెన్స్ ఫోకస్ ఉంటే ఐకూ 13 సూపర్. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్ 50MP కెమెరా హైలైట్స్.
అడ్వాన్స్‌డ్ కెమెరా కావాలంటే రియల్ మి GT 7 Pro. పెరిస్కోప్ లెన్స్, హై బ్రైట్‌నెస్ డిస్‌ప్లే బాగుంటాయి కానీ ధర ఎక్కువ.
మొత్తంగా చూస్తే వన్‌ప్లస్ 15R బెస్ట్ వాల్యూ ఇస్తుంది. ఐకూ 13 స్ట్రాంగ్ పర్ఫామెన్స్, రియల్ మి GT 7 Pro ప్రీమియం కెమెరా ఇష్టపడేవారికి బాగుంటుంది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×