E-Paper
Advertisement

Realme 16 Pro 5G: 200MP బీస్ట్ కెమెరాతో రాబోతున్న రియల్‌మీ 16 ప్రో 5G.. మిడ్‌రేంజ్‌కి అసలైన గేమ్ ఛేంజర్!

Realme 16 Pro 5G: 200MP బీస్ట్ కెమెరాతో రాబోతున్న రియల్‌మీ 16 ప్రో 5G.. మిడ్‌రేంజ్‌కి అసలైన గేమ్ ఛేంజర్!
Advertisement

Realme 16 Pro 5G: మొబైల్ లవర్స్‌ అందరిలోనూ ఆసక్తి పెంచుతూ రియల్‌మీ తన కొత్త 16 ప్రో సిరీస్‌ను త్వరలో భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. లాంచ్ తేదీని త్వరలో ప్రకటించనున్నామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్ కనిపించగా, గోల్డిష్ మిడిల్ ఫ్రేమ్, ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్ ఆకట్టుకుంటున్నాయి. ఇవన్నీ చూసి ఇది 16 ప్రో లైనప్‌కి చెందిన ఫోన్‌నే అని టిప్‌స్టర్లు చెబుతున్నారు.

డిజైన్ & డిస్‌ప్లే:

రియల్‌మీ 16 ప్రో మోడల్‌ రూపుదిద్దుకుంటున్న తీరు చూస్తే స్టైల్‌తో పాటు ప్రీమియం ఫీలింగ్ కూడా ఇస్తోంది. దాదాపు 7.75mm మాత్రమే మందం ఉండే ఈ ఫోన్‌ బరువు కూడా కేవలం 192 గ్రాములు ఉంటుంది. అలాగే ఈ ఫోన్గ్రే , గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.78 అంగుళాల 1.5K OLED స్క్రీన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, స్క్రోలింగ్ మరింత సులువుగా ఉంటుంది.

మల్టీటాస్కింగ్:

Advertisement

శక్తివంతమైన 2.5GHz ప్రాసెసర్‌తో పాటు Android 16 ఆధారంగా Realme UI 7 పనిచేయనుంది. 12GB RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్‌లు ఉంటాయని లీక్స్ చెబుతున్నాయి. మల్టీటాస్కింగ్‌ కావొచ్చు.. గేమింగ్‌ కావొచ్చు.. ఈ సెటప్‌తో ఏ పని అయినా సులభంగా పూర్తవుతుందని అంచనా.

కెమెరా సెటప్:

ముఖ్యంగా ఫొటోగ్రఫీ లవర్స్ కోసం రియల్‌మీ ఈసారి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుంది. వెనుక భాగంలో 200MP ప్రైమరీ కెమెరా ఉండనుందని లీక్స్ సూచిస్తున్నాయి. హై-డీటైల్ షాట్లు, నైట్ ఫొటోలు మరింత క్లియర్‌గా ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్‌లో 50MP సెల్ఫీ కెమెరా ఇవ్వనుండటం వల్ల వీడియో కాల్స్ అయినా, పోర్ట్రెయిట్ సెల్ఫీలు అయినా క్వాలిటీకి ఎక్కడా తగ్గకుండా ఉంటాయి.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఈ సారి బ్యాటరీ డిపార్ట్‌మెంట్ నిజంగా హైలైట్‌ అనే చెప్పాలి. 7,000mAh భారీ బ్యాటరీతో దీర్ఘకాలిక బ్యాకప్ ఇస్తూ.. రోజంతా ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన పనిలేకుండా చేస్తుందని తెలుస్తోంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల పెద్ద బ్యాటరీ అయినా త్వరగా ఛార్జ్ అవుతుంది. రోజువారీ ఉపయోగంలో ఇది నిజంగా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

అదనపు ఫీచర్లు:

ఇకపోతే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, IR బ్లాస్టర్ వంటి యూటిలిటీ ఫీచర్లు కూడా ఈ మోడల్‌లో ఉండనున్నాయి. రోజువారీ వినియోగంలో ఉపయోగపడే ఈ చిన్న ఫీచర్లు కూడా ఫోన్‌కి మంచి అడ్వాంటేజ్ కలిగిస్తాయని లీక్స్ సూచిస్తున్నాయి.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×