E-Paper
Advertisement

Cognizant Visakhapatnam Campus: విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు సీఎం‌ శంకుస్థాపన

Cognizant Visakhapatnam Campus: విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు సీఎం‌ శంకుస్థాపన
Advertisement

Cognizant Visakhapatnam Campus: నగరంలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాగ్నిజెంట్, సత్వా సంస్థతో పాటు మరో ఏడు ఐటీ సంస్థలకు భూమిపూజ చేశారు. మరోవైపు వెయ్యి సీటింగ్ కెపాసిటీతో ఉన్న కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ లో శనివారం నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

కాగ్నిజెంట్ నిర్మించబోయే ఈ అద్భుతమైన క్యాంపస్ రూ. 1,583 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో నిర్మించబడుతుంది. మొత్తం ప్రాజెక్ట్ 2033 నాటికి పూర్తయే అవకాశం ఉంది. ఇందులో 8,000 మంది ఐటీ నిపుణులు పనిచేసేలా అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

2026 నాటికి మొదటి దశ పూర్తి కానుంది. ఆ దశ పూర్తి అయ్యే వరకూ సంస్థ అద్దె కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక వర్క్‌స్పేస్‌లు, ఇన్నోవేషన్ ల్యాబ్‌లు, స్మార్ట్ కనెక్టివిటీతో క్యాంపస్‌ను నిర్మించనున్నారు.

Advertisement

ఏఐ, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్ — భవిష్యత్ టెక్నాలజీలపైనే కాగ్నిజెంట్ దృష్టి

ఈ కొత్త క్యాంపస్ ద్వారా కాగ్నిజెంట్ ప్రధానంగా ఈ కీలక రంగాల్లో సేవలను విస్తరించనుంది. ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి దృష్టిపెట్టనుంది. ఈ రంగాల్లో యువతకు భారీ ఉద్యోగావకాశాలు అందబోతున్నాయి. ఐటీ రంగంలో గ్లోబల్ డిఎన్ఏ కలిగిన విశాఖ నగరానికి ఇది మరింత బలం.

ఈ సంస్థలు కలిపి రాష్ట్రానికి రూ. 3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు అందించనున్నాయి.  గత కొన్నేళ్లుగా విశాఖ ఐటీ , డేటా రంగాల్లో భారీగా అభివృద్ధి చెందుతోంది.

ఇక కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు కూడా కార్యకలాపాలను విస్తరించడంతో. విశాఖ ఐటీ హబ్‌గా మరింత బలపడుతోంది. ప్రస్తుతం విశాఖలో 150కు పైగా టెక్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ఐటీ నిపుణులకు ఇది భారీ అవకాశాలను తీసుకొస్తోంది.

Also Read: నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి.. హైకోర్టులో డిప్యూటీ సీఎం పిటిషన్

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 18 నెలల్లో ఒక్క విశాఖలోనే రూ. 1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు ప్రవేశించడం ఈ దిశలో ఒక ప్రామాణిక సూచిక.

 

Related News

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×