E-Paper
Advertisement

56 గంటల బ్యాటరీ లైఫ్.. 50dB నాయిస్ క్యాన్సిలేషన్! రియల్ మీ కొత్త బడ్స్ ఫీచర్స్ మాములుగా లేవుగా!

56 గంటల బ్యాటరీ లైఫ్.. 50dB నాయిస్ క్యాన్సిలేషన్! రియల్ మీ కొత్త బడ్స్ ఫీచర్స్ మాములుగా లేవుగా!
Advertisement

Realme Buds T500 Pro: ఇండియా బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో భారీ ఎంట్రీ ఇచ్చింది Realme. తాజాగా విడుదలైన Realme Buds T500 Pro earbuds రూ. 2,799 ధరలోనే.. 56 గంటల బ్యాటరీ లైఫ్ వంటి ప్రీమియం ఫీచర్లతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే యూజర్ల కోసం ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారుతోంది. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్, ట్రావెలర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది.

Realme Buds T500 Pro బెస్ట్ ఫీచర్లు-పూర్తి వివరాలు:

ఇండియన్ మార్కెట్లో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రియల్‌మీ మరో కొత్త ప్రోడక్ట్‌తో ముందుకొచ్చింది. రియల్‌మీ బడ్స్ T500 Pro లాంచ్‌తో బడ్జెట్ సెగ్మెంట్‌లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

ఈ ఇయర్ బడ్స్‌లో ప్రధాన హైలైట్ 50dB Active Noise Cancellation (ANC). సాధారణంగా ఈ స్థాయి ANC ఫీచర్ హై ఎండ్ ప్రోడక్ట్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. కానీ రియల్ మీ ఈ ఫీచర్‌ను తక్కువ ధరలో అందించడం కస్టమర్లకు పెద్ద ప్లస్ పాయింట్. బయట ఉన్న శబ్దాన్ని తగ్గించి, క్లియర్ ఆడియోను ఇది అందిస్తుంది.

బ్యాటరీ:
బ్యాటరీ విషయంలో కూడా ఈ ఇయర్ బడ్స్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మొత్తం 56 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఇది ట్రావెల్ చేసే వారికి… ఎక్కువసేపు మ్యూజిక్ వినేవారికి చాలా ఉపయోగపడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో 10 నిమిషాల్లోనే 10 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు.

Advertisement

ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే.. Realme Buds T500 Pro క్లియర్, పవర్‌ఫుల్ సౌండ్ అందిస్తాయి. బాస్, ట్రెబుల్ మధ్య మంచి బ్యాలెన్స్ ఉండటం వల్ల మ్యూజిక్ ఫీల్ మరింత మెరుగవుతుంది. కాల్స్ సమయంలో కూడా క్లియర్ వాయిస్ అందించడానికి నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ ఉపయోగించారు.

డిజైన్:
డిజైన్ పరంగా కూడా ఈ ఇయర్ బడ్స్ మోడర్న్ లుక్‌తో వస్తాయి. లైట్‌వెయిట్‌గా ఉండటం వల్ల ఇబ్బందిగా అనిపించదు. అలాగే టచ్ కంట్రోల్స్ ద్వారా మ్యూజిక్, కాల్స్‌ను సులభంగా సింపుల్‌గా కంట్రోల్ చేయొచ్చు. గేమర్స్ కోసం కూడా ఇందులో.. లో లేటెన్సీ మోడ్ ఉంది. ఇది గేమింగ్ సమయంలో ఆడియో ల్యాగ్ తగ్గించి మంచి ఫీల్ అందిస్తుంది. వీడియోలు చూస్తున్నప్పుడు కూడా ఆడియో-వీడియో సింక్ బాగా ఉంటుంది.

Also Read: న్యూస్ రీడర్ల నుంచి ట్రాన్స్‌లేటర్ల వరకు..కొత్త గూగుల్ AI ధాటికి 5 ఉద్యోగాలకు గండం

కనెక్టివిటీ:

కనెక్టివిటీ విషయంలో ఈ ఇయర్ బడ్స్ స్టేబుల్ బ్లూ టూత్ కనెక్షన్ అందిస్తాయి. డివైస్‌తో త్వరగా కనెక్ట్ అవ్వడం, కనెక్షన్ స్టేబిలిటీ ఉండటం వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగు పరుస్తుంది.

ధర:

రూ. 2,799 ధరలో ఈ స్థాయి ఫీచర్లు అందించడం నిజంగా ఆశ్చర్యకరం. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే Realme Buds T500 Pro బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బడ్జెట్‌లో ప్రీమియం అనుభవం కోరుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

మొత్తానికి.. Realme Buds T500 Pro earbuds మార్కెట్లో మంచి పోటీని తీసుకురావడం ఖాయం. ఫీచర్లు, ధర, పనితీరు అన్నీ కలిపి ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్‌గా చెప్పవచ్చు. మీరు కొత్త ఇయర్ బడ్స్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇవి ఖచ్చితంగా మీ లిస్ట్‌లో ఉండాల్సిందే.

Related News

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

Big Stories

Advertisement
×