E-Paper
Advertisement

న్యూస్ రీడర్ల నుంచి ట్రాన్స్‌లేటర్ల వరకు..కొత్త గూగుల్ AI ధాటికి 5 ఉద్యోగాలకు గండం

న్యూస్ రీడర్ల నుంచి ట్రాన్స్‌లేటర్ల వరకు..కొత్త గూగుల్ AI ధాటికి 5 ఉద్యోగాలకు గండం
Advertisement

Google Gemini 3.1 Flash:టెక్ ప్రపంచంలో రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలు పట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా గూగుల్ తీసుకొచ్చిన GEMINI AI FLASH TTS టూల్ టెక్ట్స్‌ను.. నేచురల్ వాయిస్‌గా మార్చేస్తుంది. ఇది ఇప్పుడు యూటూబర్స్, కంటెంట్ క్రియేటర్స్, డెవలపర్లకు గేమ్ చేంజర్‌గా మారింది. అయితే సింపుల్ టెక్ట్స్‌ని హ్యూమన్ వాయిస్‌గా మార్చడం ఈ టెక్నాలజీ యొక్క స్పెషాలిటీ. ఇదిలా ఉంటే దీని వల్ల కొన్ని రకాల ఉద్యోగులకు టైం సేవ్ అవ్వడమే కాకుండా కంటెంట్ క్వాలిటీ కూడా పెరుగుతుంది.

ఏఐ టూల్స్ డిమాండ్: 

ఇప్పటికే డిజిటల్ యుగంలో వాయిస్ టెక్నాజీకి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ తీసుకొచ్చిన GEMINI AI 3.1 FLASH TTS అడ్వాన్స్డ్ టూల్ గా నిలుస్తోంది. ఇది టెక్ట్స్.. సింపుల్‌గా చదవడం మాత్రమే కాదు వివిధ రకాలుగా మాడ్యులేషన్ కూడా చేయగలదు.

Advertisement

gemini 3.1 flash tts స్పెషాలిటీ ఏంటంటే.. ఇది స్పీచ్‌లో ఎమోషన్స్ కూడా ఇవ్వగలదు.అంటే ఆనందం, ఆశ్చర్యంతో పాటు బాధ వంటి భావాలను కూడా వాయిస్ ద్వారా తెలపగలదు. ఇది కేవలం రీడింగ్ టూల్ గా మాత్రమే కాకుండా ఒక వర్చువల్ నరేటర్‌గా కూడా పనిచేస్తుంది.

ఎవరికి ఉపయోగకరం:

Advertisement

ఇదిలా ఉంటే.. కంటెంట్ క్రియేటర్లకు ఇది వరం అనే చెప్పొచ్చు. యూట్యూబ్ వీడియోలు, ఆడియో బుక్స్ తయారు చేసే వారు ఈ టూల్స్ సహాయంతో తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్ తయారు చేయొచ్చు. అంతే కాకుండా దీని ద్వారా క్వాలిటీ కంటెంట్ కూడా రెడీ చేయవచ్చు. వాయిస్ ఓవర్ కోసం వ్యక్తులను వెతకాల్సిన పని లేకుండా ఈ టెక్నాలజీ ద్వారా పని పూర్తి చేయొచ్చు.

డెవలపర్లకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్లికేషన్స్‌లో వాయిస్ ఫీచర్స్ అందించడం దీని ద్వారా ఈజీ అవుతుంది. అంతే కాకుండా యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరచడంలో కూడా ఈ టూల్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో  అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Gemini 3.1 Flash TTS ఎలా పని చేస్తుంది ?

మరొక ముఖ్యమైన విషయం ఏటంటే.. ఇది మల్టీలాంగ్వేజ్ సపోర్ట్ అందిస్తుంది. తెలుగు సహా అనేక భాషల్లో వాయిస్‌ను సృష్టించడం దీని ద్వారా సాధ్యమవుతుంది. అంతే కాకుండా ఇండియా లాంటి అనేక భాషలు మాట్లాడే దేశాల్లో దీని వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.

Also Read: రూ. 2,499 కే అదిరిపోయే స్మార్ట్ రింగ్.. boAt SmartRing Active ఫీచర్లు చూశారా?

ఇదిలా ఏంటే.. పర్ఫార్మెన్స్ విషయంలో కూడా Gemini 3.1 Flash TTS చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. టెక్స్ట్‌ను వెంటనే వాయిస్‌గా మార్చడం దీని స్పెషాలిటీ. దీనివల్ల రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో కూడా పెను మార్పులు కలుగుతాయి.

సెక్యూరిటీ,ప్రైవసీ విషయంలో కూడా గూగుల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుందనే చెప్పాలి. యూజర్ డేటాను సురక్షితంగా ఉంచే విధంగా ఈ టూల్ డిజైన్ చేసారు. ఇది యూజర్లకు మరింత విశ్వాసాన్ని కలిగిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఎవరికి నష్టం:
భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఎక్కవగానే ఉన్నాయి. AI వాయిస్ మరింత సహజంగా మారి.. మనిషి వాయిస్‌తో తేడా తెలియకుండా ఉండే స్థాయికి చేరుకోవచ్చు. ఇది మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేషన్ రంగాల్లో పెను మార్పులు తీసుకురానుంది. ఫలితంగా న్యూస్ రీడర్లు, వాయిస్ ఓవర్ , ట్రాన్స్ లేటర్లు, టూషన్లు, టీచింగ్ ఫీల్డ్ లో పనిచేసే వారికి ఉద్యోగావకాశాలు తగ్గే అవకాశం ఉంది.

మొత్తానికి.. Gemini 3.1 Flash TTS టెక్నాలజీ వాయిస్ రంగంలో కొత్త ట్రెండ్ సెట్ చేయనుంది. ఇది కేవలం ఒక టూల్ మాత్రమే కాదు, భవిష్యత్తు కమ్యూనికేషన్‌కు ఒక కొత్త మార్గాన్ని కూడా చూపిస్తోంది. కంటెంట్ క్రియేషన్‌ను ఈజీ చేయడంలో ఇది ముందుంటుంది.

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×