E-Paper
Advertisement

సూపర్ మ్యాన్ అవతారం ఎత్తిన బ్రహ్మీ.. వేరే లెవెల్ అంతే, చివరిలో ఏడిపించేశావ్ కదయ్యా!

సూపర్ మ్యాన్ అవతారం ఎత్తిన బ్రహ్మీ.. వేరే లెవెల్ అంతే, చివరిలో ఏడిపించేశావ్ కదయ్యా!
Advertisement

Brahmanandam Ben10: సాధారణంగా బ్రహ్మానందం సార్ స్క్రీన్ మీద కనిపిస్తేనే నవ్వులు పూస్తాయి. అలాంటిది, ఆయన విదేశీ కార్టూన్ క్యారెక్టర్ ‘బెన్ 10’ అవతారమెత్తితే ఎలా ఉంటుంది? వినడానికే వింతగా ఉంది కదూ! సరిగ్గా ఇదే ఆలోచనను AI సాయంతో ఒక క్రియేటర్ అద్భుతమైన వీడియోగా మలిచారు. ప్రస్తుతం ఈ ఫ్యాన్ ఫిక్షన్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతూ నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. ఈ ఆసక్తికరమైన వీడియోను ఒక క్రియేటర్ పోస్ట్ చేశారు. కేవలం ఒక్క రోజులోనే ఈ రీల్ 21,000 పైగా లైక్స్ సాధించి, వేలాది మంది షేర్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Read also-‘హిట్ మెషీన్’ అనిల్ రావిపూడి ఖాతాలో మరో అవార్డ్.. సంక్రాంతి సందడి ఇంకా తగ్గలా..

వీడియోలో ఏముంది?

Advertisement

ఈ రీల్‌లో మన లెజెండరీ కామెడియన్ బ్రహ్మానందం చేతికి బెన్ 10 గడియారం ఉంటుంది. ఆయన ఆ గడియారాన్ని ఉపయోగించి రకరకాల ఏలియన్ రూపాల్లోకి మారుతూ, తనదైన శైలిలో కామెడీ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. బ్రహ్మానందం బాడీ లాంగ్వేజ్‌ను బెన్ 10 యాక్షన్ సీక్వెన్స్‌లతో సింక్ చేసిన విధానం అద్భుతం. వీడియో చివరలో ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. ప్రముఖ బాలీవుడ్ కామెడియన్ జానీ లీవర్ కూడా ఈ AI ప్రపంచంలో భాగం కాబోతున్నట్లు క్యాప్షన్‌లో హింట్ ఇచ్చారు.

వీడియో వైరల్

ఇండియన్ కామెడీకి, గ్లోబల్ పాపులర్ కార్టూన్ బెన్ 10ను జోడించడం చాలా కొత్తగా అనిపించింది. జనరేటివ్ AI టూల్స్‌ను ఉపయోగించి బ్రహ్మానందం ముఖ కవళికలను, వాయిస్‌ను ఏలియన్ క్యారెక్టర్లకు తగ్గట్టుగా మార్చడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. 90s కిడ్స్ ఇష్టపడే బెన్ 10, తెలుగు వారు ఆరాధించే బ్రహ్మానందం.. ఈ ఇద్దరి కాంబినేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది పూర్తిగా AI సాయంతో రూపొందించిన ఫ్యాన్ ఫిక్షన్ మాత్రమే. ఎవరినీ కించపరచడానికి గానీ, కాపీరైట్ ఉల్లంఘనకు గానీ ఉద్దేశించింది కాదని, కేవలం వినోదం కోసమేనని క్రియేటర్ స్పష్టం చేశారు.

Advertisement

Read also-జాతీయ స్థాయి అవార్డ్ గెలుచుకున్న బుల్లిరాజు.. అనిల్ రావిపూడి ఎమోషనల్..

సాంకేతికత పెరిగేకొద్దీ సృజనాత్మకతకు సరిహద్దులు ఉండవని ఈ వీడియో నిరూపించింది. బ్రహ్మానందం వంటి ఐకానిక్ నటులను ఇలాంటి సరికొత్త పాత్రల్లో చూడటం అభిమానులకు పండగే. తెలుగు ప్రజల అమితంగా ఇష్టపడే బ్రహ్మనందంను ఏఐలో ఇలా చూడటంపై ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. ఏది ఏమైనా ఏఐ ప్రపంచంలో ఇంలాంటి వీడియోలు ఎందరికో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

?igsh=bW0yZnJxb3BsbTZm

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×