E-Paper
Advertisement

ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై.. 7,000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో Realme C100 5G లాంచ్!

ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై.. 7,000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో Realme C100 5G లాంచ్!
Advertisement

Realme C100 5G: రియల్‌మీ C సిరీస్ నుంచి మరో పవర్‌ఫుల్ మొబైల్ ‘Realme C100 5G’ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌ను థాయ్‌లాండ్‌లో లాంచ్ చేసినప్పటికీ.. దీని ఫీచర్లు చూస్తుంటే మాత్రం టెక్ ప్రియుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా అదే పనిగా ఫోన్ స్క్రోల్ వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ కొత్త ఫోన్ విశేషాలేంటో? దీని ధర ఎంతో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందామా.

ధర వివరాలు ఇలా..

ఈ Realme C100 5G ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM వేరియంట్ ధర రూ.20,000 వరకు ఉండొచ్చు. అలాగే 6GB RAM మోడల్ రూ.21,000 ధరతో రానుంది. ఏప్రిల్ 22 నుంచి ఇది సేల్స్‌కు వస్తుంది. బ్లూమింగ్ పర్పుల్, స్ప్రౌటింగ్ గ్రీన్ వంటి రంగుల్లో ఈ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. బడ్జెట్ లోనే 5జీ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

Advertisement

Also Read: యాపిల్ లవర్స్‌కు షాక్.. ఈసారి బ్లాక్ కలర్ లేనట్టే, iPhone 18 Proలో ఊహించని మార్పులు!

లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్..

ఇక ఈ ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే.. దీనిలో 6.8 అంగుళాల పెద్ద స్క్రీన్ ఇచ్చారు. దీంతో సినిమాలు చూడటానికైనా, గేమ్స్ ఆడుకోవడానికైనా చాలా బాగుంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 144Hz ఉండటం వల్ల ఫోన్ అసలు హ్యాంగ్ అవ్వకుండా, చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దీనిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్ ఇచ్చారు. దీనికి ఐపీ64 రేటింగ్ కూడా ఉంది కాబట్టి.. కొంచెం దుమ్ము పడినా, నీళ్లు చిమ్మినా ఫోన్‌కి ఏం కాదు.

ఫొటోలు ఫుల్ క్లారిటీ..

Advertisement

ఫోన్ స్పీడ్ కోసం దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను వాడారు. దీంతో యాప్స్ వాడుతున్నప్పుడు గానీ, మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు గానీ ఎక్కడా స్లో అవ్వదు. ఇక కెమెరా ప్రియుల కోసం వెనుక వైపు 50MP కెమెరాను అమర్చారు. తద్వారా డే లైట్‌లో ఫొటోలు చాలా క్లారిటీగా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం 5MP కెమెరా ఉంది. ఇది మరీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ కాకపోయినా.. వీడియో కాల్స్, క్యాజువల్ సెల్ఫీల కోసం సరిపోతుంది. ఫుల్ హెచ్‌డీ వీడియోలను కూడా మనం ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

ఈ ఫోన్‌కి ఉన్న మెయిన్ హైలైట్ దీని 7,000mAh బ్యాటరీ. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం రెండ్రోజుల పాటు బ్యాటరీ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. దానికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది కాబట్టి.. ఫోన్ త్వరగానే ఛార్జ్ అయిపోతుంది. ఇక సెక్యూరిటీ కోసం సైడ్ వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఫోన్ కొంచెం బరువు అనిపించినా.. ఇంత పెద్ద బ్యాటరీ ఇస్తున్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది.

Also Read: ఏటీఎం కార్డు ఇంట్లో మర్చిపోయారా? పేటీఎం ఉంటే చాలు.. ఇలా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు!

Related News

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

Big Stories

Advertisement
×