E-Paper
Advertisement

Realme C63 Launched: ఎంత పెద్ద మనసో.. రియల్‌మీ చీపెస్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్లు చాలా రిచ్!

Realme C63 Launched: ఎంత పెద్ద మనసో.. రియల్‌మీ చీపెస్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్లు చాలా రిచ్!
Advertisement

Realme C63 Launched: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ అసలు తగ్గేలాలేదు. గ్యాప్ లేకుండా వరుసగా స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యధింకంగా ఫోన్లను లాంచ్ చేస్తూ ఓ ఊపు ఊపేస్తుంది. వారం క్రితమే దేశంలో Realme C61‌ను విడుదల చేయగా తాజాగా Realme C63 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇది వేగన్ లెదర్ డిజైన్‌తో వచ్చిన బడ్జెట్ సెగ్మెంట్‌లో మొదటి ఫోన్. Realme C63 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది బలమైన 5000mAh బ్యాటరీ కూడా ఉంటుంది. కాబట్టి ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే మంచి బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. Realme C63 ఎయిర్ గెస్చర్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్, మినీ క్యాప్సూల్ 2.0 వంటి కొత్త ఫీచర్‌లతో వస్తుంది.

రియల్‌మీ C63 లెదర్ బ్లూ, జేడ్ గ్రీన్ అనే రెండు అద్భుతమైన కలర్స్‌లో వస్తుంది. ఫోన్ ఒక స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందులో 4GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఉంది. ఫోన్ ధర రూ. 8,999. రియల్‌మీ C63 మొదటి సేల్ జూలై 3 న మధ్యాహ్నం 12 గంటలకు realme.com, Flipkart‌లో ప్రారంభమవుతుంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. ఐఫోన్‌ 15 ప్లస్‌పై బంపర్ డిస్కౌంట్.. ఇప్పుడే కొందాం రండి!

Realme C63 స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ 6.74-అంగుళాల HD IPS LCD 90Hz స్క్రీన్‌ను 560nits హై బ్రైట్‌నెస్ మోడ్‌‌ని కలిగి ఉంటుంది. ఫోన్ Mali-G57 GPUతో ఆక్టా-కోర్ UNISOC T612 చిప్‌సెట్‌ను పొందవచ్చు. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UIపై రన్ అవుతుంది. ఇది 50MP ప్రైమరీ బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ షూటర్‌ని కలిగి ఉంటుంది.

Advertisement

రియల్‌మీ C63 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక నిమిషం ఛార్జ్‌తో ఒక గంట టాక్ టైమ్‌ను అందింస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫోన్‌లోని బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్‌పై 38 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను అందజేస్తుందని కూడా క్లైమ్ చేస్తోంది. దీని బరువు 189 గ్రాములు.

Also Read: ఆఫర్లతో చంపేస్తున్నారయ్యా.. ఫోన్‌పై రూ.12 వేల డిస్కౌంట్!

సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఈ బడ్జెట్ స్మార్ట్‌‌ఫోన్‌లో ఉండొచ్చు. కనెక్టివిటీ కోసం Wi-Fi 5, బ్లూటూత్ 5.0, 4G కనెక్టివిటీ, హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్, డేటా ట్రాన్సఫర్ కోసం USB టైప్-సి పోర్ట్‌ని పొందవచ్చు. ఇది ఎయిర్‌గెస్చర్, డైనమిక్ బటన్, మినీ క్యాప్సూల్ 2.0, 200 శాతం అల్ట్రాబూమ్ స్పీకర్, IP54 రేటింగ్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీతో లాంచ్ అయే అవకాశం ఉంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×