E-Paper
Advertisement

Smartphone Comparison: రియల్‌మి C85 vs మోటో G67 పవర్ vs వివో Y31.. రూ.16,000 లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: రియల్‌మి C85 vs మోటో G67 పవర్ vs వివో Y31.. రూ.16,000 లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?
Advertisement

Realme C85 vs Moto G67 Power vs Vivo Y31| రూ.16 వేల లోపు తక్కువ బడ్జెట్‌ రేంజ్ మంచి 5G ఫోన్ కావాలంటే అద్భుత ఫీచర్లు కలిగిన మూడు కొత్త ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి రియల్‌మి C85, మోటో G67 పవర్, వివో Y31. ఈ మూడు కూడా 5G టెక్నాలజీ కలిగిన ఫోన్లు. రోజువారీ ఉపయోగానికి ఈ ఫోన్లు సూపర్, కానీ మూడింటికి వేర్వేరు ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు ఏది కొనుగోలు చేయాలో వాటి ఫీచర్లను పోల్చి చూద్దాం.

ధర, స్టోరేజ్ వేరియంట్ వివరాలు

రియల్‌మి C85 4GB+128GB వేరియంట్ ధర రూ.14,999కి , 6GB+128GB వేరియంట్ ధర రూ.16,499.
మోటో G67 పవర్: 8GB+128GB వేరియంట్ ధర రూ.15,999 (ఈ మోడల్ తక్కువ ధరలో ఎక్కువ ర్యామ్ ఇస్తుంది)
వివో Y31: రూ.14,999 నుంచి ప్రారంభం అయితే ఇందులో 4GB, 6GB రెండు వేరియంట్స్ ఉన్నాయి.
ధర పరంగా మోటో G67 పవర్ ఎక్కువ ర్యామ్ లో బెటర్ ఆప్షన్.

డిస్‌ప్లే ఎలా ఉంది?

Advertisement

రియల్‌మి C85లో 6.8 అంగుళాల పెద్ద HD+ LCD స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్ (చాలా స్మూత్), 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఎండలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది.
మోటో G67 పవర్ లో 6.7 అంగుళాల FHD+ (మరింత షార్ప్) స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్.
వివో Y31లో 6.68 అంగుళాల HD+ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే అధ్బుతంగా ఉంటుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ ఎవరు విన్నర్?

రియల్‌మి C85, మోటో G67 పవర్ రెండింటిలోనూ 7000mAh భారీ బ్యాటరీ ఉంది. రియల్‌మి 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది (త్వరగా బ్యాటరీ ఫుల్ అవుతుంది), మోటోలో 30W చార్జింగ్ ఆప్షన్ మాత్రమే ఉంది. వివో Y31లో 6500mAh బ్యాటరీ + 44W ఛార్జింగ్ ఫీచర్ ఉంది. వివో కూడా ఛార్జింగ్ విషయంలో బెటర్ కానీ రియల్‌మి స్వల్ప ఆధిక్యంలో ఉంది.

సాఫ్ట్‌వేర్ ఎలా ఉంది?

Advertisement

మూడు ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్ కలిగి ఉన్నాయి. రియల్‌మి C85 లో రియల్‌మి UI 6.0 ఉంది. మోటో G67 పవర్ లో చాలా క్లీన్ Hello UX ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఇందులో యాడ్స్ దాదాపు లేవు. వివో Y31 ఫన్ టచ్ OS 15 ఆధారంగా యాప్స్ రన్ చేస్తుంది.

ప్రాసెసర్ పవర్‌లో ఎవరు బెటర్?

మోటో G67 పవర్ లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్ సెట్ ఉంది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో టాప్.
రియల్‌మి C85లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్ పర్‌ఫామెన్స్ బాగుంటుంది. కానీ మోటో కంటే కొంచెం తక్కువ.
వివో Y31లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 సాధారణ ఉపయోగానికి సరిపోతుంది.
ప్రాసెసర్ విషయంలో మోటో బెస్ట్. ఎందుకంటే ఇందులో అడ్వాన్స్‌డ్ చిప్‌సెట్ ఉంది.

కెమెరా ఎలా ఉంది?

మోటో G67 పవర్‌లో 50MP మెయిన్ + 8MP అల్ట్రా-వైడ్ + 32MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
రియల్‌మి C85: 50MP మెయిన్ కెమెరా (Sony సెన్సార్) + 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
వివో Y31: 50MP మెయిన్ + చిన్న సెకండరీ + 8MP సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది.
కెమెరా పరంగా మోటో బెస్ట్ ఆప్షన్.

ఏది కొనాలి?

భారీ బ్యాటరీ, పెద్ద స్మూత్ స్క్రీన్ కావాలంటే రియల్‌మి C85 సూపర్.
ఎక్కువ ర్యామ్, బెస్ట్ పనితీరు, మంచి కెమెరా కావాలంటే – మోటో G67 పవర్ బెస్ట్ ఆప్షన్. (ఈ ధరలో నంబర్ 1 ఛాయిస్)
సాధారణ ఉపయోగం, మంచి లుక్ కావాలంటే.. వివో Y31 సరిపోతుంది.
ఫీచర్ల పరంగా మూడింటిలో మోటో బెస్ట్ ఛాయిస్. రూ.16,000 బడ్జెట్ లో ఈ లేటెస్ట్ ఫోన్ కొనడం ఉత్తమం. లేదంటే మీ అవసరాన్ని బట్టి ఎంచుకోండి.

Also Read: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

 

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×