E-Paper
Advertisement

Bengaluru Crime: రూటు మారిన సహజీవనం.. పార్టనర్‌ని చంపి, ఆ తర్వాత ఆత్మహత్య, బెంగుళూరులో దారుణం

Bengaluru Crime: రూటు మారిన సహజీవనం.. పార్టనర్‌ని చంపి, ఆ తర్వాత ఆత్మహత్య, బెంగుళూరులో దారుణం
Advertisement

Bengaluru Crime:  ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన కాన్సెఫ్ట్ సహజీవనం. దాని గురించి నేటి యువతీ యువకులకు అంతా తెలుసు. మొదట్లో బాగానే ఉంటుంది.. రాను రాను పార్టనర్ల మధ్య విబేధాలు, ఆపై హత్య లేదా ఆత్మహత్యలకు దారి తీసిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. సహజీవనం నేపథ్యంలో పార్టనర్‌ని చంపాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలేం జరిగింది?

విషాదంగా మారిన సహజీవనం

Advertisement

హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన లలిత బెంగుళూరులో నివాసం ఉంటోంది. ఆమెకి ఇప్పటికే వివాహం జరిగింది, ఆపై పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీలో కొన్ని సమస్యల కారణంగా కుటుంబానికి దూరమైంది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. ఆమెకి కొరటిగెరె ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణతో పరిచయం ఏర్పడింది.

అతడు ఫ్యామిలీ సమస్యల కారణంగా దూరంగా ఉంటున్నాడు. లలిత-లక్ష్మీనారాయణలు పరిచయం కాస్త ఫ్రెండ్‌షిప్‌గా మారింది. ఆ తర్వాత సహజీవనానికి మొగ్గు చూపారు. లివింగ్ టు గెదర్ గురించి చెప్పనక్కర్లేదు. ఒక్కసారిగా అనుమానం వస్తే చివరి వరకు వెంటాడుతుంది. వీరిద్దరు కలిసి గడిచిన ఎనిమిదేళ్లుగా ఇందిరా ప్రియదర్శిని నగరలో సహజీవనం కొనసాగిస్తున్నారు.

Advertisement

పార్టనర్‌ని చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

సోమవారం ఇద్దరు తమతమ డ్యూటీలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేశారు. అర్ధరాత్రి వేళ ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. దీనికితోడు కాస్త మందు తాగడంతో ఆ మత్తులో కోపం పట్టలేక సహచర పార్టనర్‌కి బలంగా కొట్టాడు లక్ష్మీనారాయణ. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేశాడట.

ఆమె చీరకు ఉరివేసుకుని భాగస్వామి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఆ ఇంటి తలుపులు తెరవలేదు. దీంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. కిటికీ దగ్గర వచ్చి చూసేసరికి ఇద్దరు వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ALSO READ:  ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం డివైడర్‌ని ఢీ కొట్టిన కారు

వారు వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టారు. లలిత-లక్ష్మీనారాయణ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సహజీవనం కాస్త వికటించి చివరకు విషాదాంతంగా మారింది.

ప్రాథమిక దర్యాప్తులో ఈ జంట పదేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు తేలింది. లక్ష్మీనారాయణకు లలితపై అనుమానం పెరిగిందని, దీనివల్ల తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ.. లలితను గొంతు కోసి చంపాడని భావిస్తున్నారు. ఖచ్చితమైన కారణాలు ఇంకా దర్యాప్తులో తేలాల్చి వుంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×