E-Paper
Advertisement

Realme GT 6T First Sale: ఫస్ట్ సేల్‌ స్టార్ట్.. రూ.29,500 భారీ డిస్కౌంట్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు మిత్రమా..!

Realme GT 6T First Sale: ఫస్ట్ సేల్‌ స్టార్ట్.. రూ.29,500 భారీ డిస్కౌంట్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు మిత్రమా..!
Advertisement

Realme GT 6T First Sale Start: Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఇటీవల లాంచ్ అయింది. అయితే ఇవాళ ఈ ఫోన్ మొదటి సేల్ అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమయింది. Realme కొత్త ఫోన్ సేల్‌లలో మీరు బ్యాంక్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందగలరు. Realme కొత్త ఫోన్ మొదటి సేల్ జూన్ 1, 2024 వరకు కొనసాగుతుంది. దీనిలో మీరు ఏకకాలంలో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

Realme GT 6T మొదటి సేల్ ఈ రోజు మే 29 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయింది. జూన్ 1 రాత్రి 11:59 గంటలకు వరకు కొనసాగుతుంది. ఈ Realme GT ఫోన్ మొదటి సేల్ ప్రత్యేకమైనది. కాబట్టి ఈ సేల్‌లో కొనుగోలు చేస్తే.. చాలా ప్రయోజనాలను పొందవచ్చు. Realme GT 6T మొదటి సేల్‌లో అన్ని బ్యాంక్‌ల కార్డులపై రూ.4000 తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా వేరియంట్ బట్టి భారీ ఎక్స్ఛంజ్ ఆఫర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్‌ను 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

Advertisement

ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ.30,999లతో లిస్ట్ అయింది. అలాగే 8GB+256GB వేరియంట్ ధర రూ.32,999తో లిస్ట్ అయింది. దీంతోపాటు 12GB + 256GB వేరియంట్ ధర రూ. 35,999.. దీని హై అండ్ వేరియంట్ 12GB+512GB ధర రూ.39,999 గా అమెజాన్‌లో లిస్ట్ అయింది. అయితే వీటిపై భారీ ఎక్స్‌ంజ్ ఆఫర్లు ఉన్నాయి. 8GB + 128GB వేరియంట్‌పై రూ.29,449.. 8GB+256GB వేరియంట్‌పై రూ.31,349.. 12GB + 256GB వేరియంట్ పై రూ.33,200.. 12GB+512GB వేరియంట్‌పై రూ.37,999 భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. అయితే ఇంత మొత్తంలో ఆఫర్ పొందాలంటే ఫోన్ బ్రాండ్, పనితీరు బట్టి ఎక్స్ఛేంజ్ ధరను నిర్ణయిస్తారు.

Also Read: తగ్గేదే లే.. 10000mAh బ్యాటరీతో Redmi కొత్త 5జీ వేరియంట్ వచ్చేస్తుంది..!

Advertisement

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. Realme GT 6T ఫీచర్ పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్. Realme ఫోన్ Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక కెమెరా OISతో 4K వరకు రికార్డ్ చేయగలదు. ఇది కాకుండా, ఈ ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 2780×1264 (1.5K) alme GT 6T 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందు 5లక్షల మందికి పైగా లైక్ చేసినట్లు Realme One తన ఎక్స్ (X)లో పోస్ట్‌లో తెలిపింది. ఈ సంఖ్య అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని Realme పోస్ట్‌లో రాసింది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×