BigTV English

Oppo New 5G Smartphones: అమ్మబాబోయ్.. Oppo నుంచి ఒకేసారి మూడు ఫోన్లు.. ఇది మాములు రచ్చ కాదుగా!

Oppo New 5G Smartphones: అమ్మబాబోయ్.. Oppo నుంచి ఒకేసారి మూడు ఫోన్లు.. ఇది మాములు రచ్చ కాదుగా!

Oppo New 5G Smartphones: స్మార్ట్‌ఫోన్ కంపెనీ Oppo తన హవాని కొనసాగిస్తోంది. వరుస లాంచ్‌లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే చైనాలో Oppo A3 Pro 5G, Reno 12 5G, Reno 12 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. అయితే తాజాగా ప్రపంచ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది TDRA ధృవీకరణ ద్వారా నిర్ధారించబడింది. ఇప్పటికే ఈ ఫోన్లు గురించి అనేక లీక్‌లు ఉన్నాయి.ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.


Oppo A3 Pro 5G, Reno 12 5G సిరీస్‌లు TDRA సర్టిఫికేషన్ పొందాయి. UAE TDRA అథారిటీ ఈ నెల ప్రారంభంలో Oppo Reno 12 Pro 5G మోడల్ నంబర్ CPH2629. ఎన్కో బడ్స్ 2 ప్రో మోడల్ నంబర్ E510Aని ఆమోదించింది. ఇప్పుడు,రెనో 12 5G, Oppo A3 Pro 5G గ్లోబల్ వెర్షన్‌లు TDRA డేటాబేస్‌లో కనిపించాయి. CPH2625 మోడల్ నంబర్‌తో రెనో 12 5G రానుంది. అయితే CPH2639 మోడల్ నంబర్ A3 ప్రో ఉంటుంది. Reno 12 గ్లోబల్ వెర్షన్ Geekbench,TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో గుర్తించబడింది.

Also Read: డబ్బులు ఊరికేరావు.. అతి తక్కువ ధరకే మోటో కొత్త స్మార్ట్‌ఫోన్.. దీనికన్నా తోపు లేదు!


Geekbench డేటా ప్రకారం గ్లోబల్ Reno 12 మోడల్‌లో 8 GB RAM, ఆండ్రాయిడ్ 14, డైమెన్సిటీ 8300 మాదిరిగానే డైమెన్సిటీ చిప్ ఉన్నాయి. ఇది Reno 12 చైనీస్ మోడల్ మాదిరిగానే డైమెన్సిటీ 8250 SoCని కలిగి ఉండే అవకాశం ఉంది. TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్ కెమెరా FV-5 డేటాబేస్ జాబితాలో ఇది 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్, 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాల సెటప్‌లో ఉంటుంది. Oppo A3 Pro 5G గ్లోబల్ వెర్షన్ గతంలో ఇండోనేషియా  SDPPI, యూరోఫిన్స్ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్  డేటాబేస్‌లలో గుర్తించబడింది. ఇది చైనీస్ వెర్షన్ మాదిరిగానే స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుందా లేదా అనేది చూడాలి.

Also Read: రాసిపెట్టుకో బ్రో.. పోకో నుంచి కొత్త 5G ఫోన్.. కేక పుట్టిస్తుంది అంతే!

Oppo Reno 12, Reno 12 Pro 6.7 అంగుళాల పూర్తి HD+ 1.5K (2772 x 1240 పిక్సెల్‌లు) కర్వ్డ్ OLED డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, పీక్ బ్రైట్నెస్ 1200 nits, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ ఉంటుంది.  బేస్ Oppo Reno 12 ఆక్టా-కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8250 స్టార్ స్పీడ్ ఎడిషన్ SoCని ఉపయోగిస్తుంది. అయితే ప్రో వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా ColorOS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

Tags

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×