BigTV English

Rishab Pant About Accident : ఆ రోజులు తలచుకుంటే.. ఇప్పటికీ భయమేస్తుంది : పంత్

Rishab Pant About Accident : ఆ రోజులు తలచుకుంటే.. ఇప్పటికీ భయమేస్తుంది : పంత్

Rishab Pant About his Accident : రిషబ్ పంత్.. భారత్ క్రికెట్ లో యువ సంచలనం. ఎలాంటి బాల్ అయినా రాని, అవతల ఎటువంటి ఫాస్ట్ బౌలర్ అయినా ఉండనీ.. అతను కొడితే బాల్ వెళ్లి స్టాండ్ అవతల పడాల్సిందే. అదే తన బ్యాటింగ్ టెక్నిక్.. అందుకే బీసీసీఐ గుర్తించి టీ 20 ప్రపంచకప్ లో అవకాశం ఇచ్చింది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకి కూడా పంత్ అంటే చాలా అభిమానం. తన బ్యాటింగ్ స్టయిల్ ని అమితంగా ఇష్టపడతాడు. అలాంటి పంత్.. తాజాగా శిఖర్ ధావన్ టాక్ షో లో పాల్గొన్నాడు. ఆనాటి యాక్సిడెంట్ గురించి కొన్ని విషయాలు చెప్పి బాధపడ్డాడు.


ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికి బాధగా ఉంటుందని అన్నాడు. 2022 డిసెంబర్ నెలలో కారు ప్రమాదం జరిగింది. చాలాకాలం చేత్తో బ్రష్ కూడా చేసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. చెయ్యి కదిపితే నొప్పి, కాలు తీస్తే నొప్పి, అన్నం నమిలితే నొప్పి, ఏడు నెలలు భరించలేని నొప్పితో బాధపడ్డాను. నిజానికి నేను బతుకుతానని అనుకోలేదు. కానీ దేవుడున్నాడు. నన్ను మళ్లీ గ్రౌండులోకి పంపించాడు. నా జీవితంలో మరిచిపోలేని ఘనట ఒకటేమిటంటే.. ఒకసారి విమానాశ్రయానికి వెళ్లలేకపోయాను. ఎందుకంటే చక్రాల కుర్చీలో నన్ను ప్రజలు చూస్తారేమోనని ఆందోళన చెందాను.

Also Read : యువ ఆటగాడిపై ట్రోలింగ్స్.. ‘ఛీ.. నీకు ఇదేం పాడు బుద్ధి భయ్యా’ అంటూ..


ఈ టాక్ షో లో తన ప్రమాదం అనుభవాలే కాదు. చిన్ననాటి విషయాలు తెలిపాడు. నిజానికి క్రికెట్ లో మళ్లీ ఆడటం ఒక మిరాకిల్ అని చెప్పాడు. ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ లో పాల్గొంటున్నాను. మా నాన్న కల నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. నేను 5 వ తరగతిలో ఉన్నప్పుడు.. మా నాన్నని క్రికెట్ బ్యాట్ కావాలని అడిగాను.

రూ. 14 వేల విలువైన బ్యాట్ కొనిచ్చాడు. అయితే అప్పుడు మా అమ్మ ముఖం చూడాలి. తనకి చాలా కోపం వచ్చింది. కానీ నాకు మాత్రం బ్యాట్ చూస్తూ చాలా సంతోషం వేసింది. తర్వాత నా ఆట చూసి మా అమ్మ కూడా మెచ్చుకునేదని చిన్ననాటి విషయాలు పంచుకున్నాడు. ప్రస్తుతం పంత్ అమెరికాలో ఉన్నాడు. టీ 20 ప్రపంచకప్ నకు సిద్ధమవుతున్నాడు. విదేశాల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న పంత్ మరి ఈసారి ఎన్ని అద్భుతాలు చేస్తాడో వేచి చూడాల్సిందే.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×