BigTV English

Realme GT 7 Pro Oppo Reno 13 Series : ఒక్కరోజు తేడాతో వచ్చేస్తున్న రియల్ మీ, ఒప్పో.. మరి వీటిలో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

Realme GT 7 Pro Oppo Reno 13 Series : ఒక్కరోజు తేడాతో వచ్చేస్తున్న రియల్ మీ, ఒప్పో.. మరి వీటిలో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

Realme GT 7 Pro Oppo Reno 13 Series : రియల్ మీ, ఒప్పో కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ లేటెస్ట్ వెర్షన్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను లాంఛ్ చేస్తున్నాయి. రియల్ మీ నుంచి జీ7  ప్రో మెబైల్ రాగా.. ఒప్పో రెనో 13 సిరీస్ ను తీసుకొస్తుంది. ఈ రెండు మెుబైల్స్ ఒకే ఒక్క రోజు తేడాతో మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ మెబైల్స్ ఎప్పుడు రాబోతున్నాయి. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్కేయ్యాల్సిందే.


ఒప్పో రెనో 13 సిరీస్ నవంబర్ 25న రాబోతుందని చైనాకు చెందిన ప్రముఖ పత్రిక వెల్లడించింది. ఇక రియల్ మీ నుంచి జీ7  ప్రో నవంబర్ 26న రాబోతున్నట్లు రియల్ మీ తెలిపింది. ఇక ఈ మెబైల్ ఫీచర్స్ ఒకదానికొకటి వేరుగా ఉన్నప్పటికీ ఆ సంస్థల ఓల్డ్ వెర్షన్ మెుబైల్స్ కు భిన్నంగా లేటెస్ట్ ఫీచర్స్ ను మాత్రం జోడించాయి.

Realme GT 7 Pro –


రియల్‌ GT 7 Pro స్నాప్ డ్రాగన్ 8 Elite చిప్ సెట్ తో రాబోతుంది. ఇక 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 500mAh బ్యాటరీ, సామ్ సాంగ్ Eco 2 OLED ప్లస్ డిస్‌ప్లేతో రాబోతుంది. ఈ ఫోన్ ధర చైనాలో రూ. 47,100గా ఉంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ తో రాబోతుంది. 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ షూటర్‌ తో ట్రిపుల్ రియర్ కెమెరా, సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ ఈ మెబైల్ లో ఉన్నాయి. ముఖ్యంగా అండర్ వాటర్ ఫోటోగ్రఫీకు ఈ ఫోన్ చక్కటి ఆఫ్షన్. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ కు ఈ ఫోన్ రాబోతుందని.. నీటిలో సైతం ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుందని రియల్ మీ తెలిపింది.

Oppo Reno 13 Series –

ఒప్పో లేటెస్ట్ వెర్షన్ లో రెనో 13 సిరీస్ ను లాంఛ్ చేస్తుంది. ఈ మెుబైల్ లో  6.78 అంగుళాల డిస్ ప్లే, క్వాడ్ మైక్రో కర్వ్డ్ LTPO OLED స్క్రీన్ ఉన్నాయి. ఇక 50 మెగా పిక్సెల్ పెరీస్కోప్ టెలీలెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌ సదుపాయం ఈ మెబైల్ లో ఉన్నాయి. ఒప్పో రెనో 13 ప్రో ప్రాసెసర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9300 చిప్ సెట్ తో రాబోతుంది. ఈ మెబైల్ బ్యాటరీ 5900mahతో 80W వైర్డ్ ఛార్జింగ్ 50W వైర్ లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ మెబైల్ కూడా డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గా లాంఛ్ అవుతుంది.

ఇక చైనాకు చెందిన ఈ రెండు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఆ దేశంలోనే మొదటగా మొబైల్స్ లాంఛ్ చేస్తున్నాయి. చైనాలో నవంబర్ 4న Realme GT 7 Pro లాంఛ్ అవుతుంది. ఇక ఇండియాలో నవంబర్ 25న ఒప్పో 3 సిరీస్ వస్తుండగా, రియల్ మీ GT 7 ప్రో ఒక్క రోజు తేడాతో నవంబర్ 26న వచ్చేస్తుంది. ఇక వీటి ధరల్లో సైతం పెద్దగా తేడా ఉండకపోవడంతో ఈ రెండు మెబైల్స్ కస్టమర్స్ ను ఆకట్టుకుంటాయని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ : అప్పు చేసైనా ఈ ఒప్పో మెబైల్ కొనేయాల్సిందే… రెనో 13 వచ్చేది ఆరోజే.. ఫీచర్స్ వేరే లెవెల్ అంతే!

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

Big Stories

×