E-Paper
Advertisement

Mithun Chakraborty: బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి ఇంట తీవ్ర విషాదం..

Mithun Chakraborty: బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి ఇంట తీవ్ర విషాదం..
Advertisement

Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మిథున్ చక్రవర్తి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిథున్ మొదటి భార్య..  హెలెనా లూక్  అమెరికాలో కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.. చిన్న సమస్యే అని వైద్యుల వద్దకు వెళ్లకపోవడంతో ఆ సమస్య మరింత ముదిరి ఆమె ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని సమాచారం. ఈ విషయాన్ని  ప్రముఖ డ్యాన్సర్, నటి కల్పనా అయ్యర్ సోషల్ మీడియా వేదికగా  అభిమానులతో పంచుకుంది.

ఇక హెలెనా మరణంతో మిథున్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. హెలెనా లూక్   కూడా నటినే. గుజరాతీ నాటకాల్లో 9 ఏళ్లు పనిచేసిన హెలెనా.. ఆమె ‘దో గులాబ్’ (1983), ‘ఆవో ప్యార్ కరీన్’ (1994) ‘భాయ్ అఖిర్ భాయ్ హోతా హై’ వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. ఇక అమితాబ్ బచ్చన్ నటించిన ‘మర్ద్ ‘ చిత్రంలో కూడా హెలెనా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది.

Advertisement

Meenakshi Chaudhary: నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న మీనాక్షి చౌదరి

ఇక ఆ సమయంలోనే హెలెనా, మిథున్ ప్రేమలో పడ్డారు.వారి పరిచయం ప్రేమగా మారి పరిణయం వరకు వెళ్ళింది.  1979 లో వీరి వివాహం జరిగింది. అయితే.. వీరి పెళ్లి ఎంతోకాలం కాదు.. కేవలం నాలుగు నెలలు కూడా నిలబడలేదు. నాలుగు నెలలకే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు.

Advertisement

విడాకుల అనంతరం అమెరికాకు వెళ్ళిపోయినా హెలెనా.. అక్కడ డెల్టా ఎయిర్‌లైన్స్‌లో వర్క్ చేసింది. ఇక ఆమె మరణవార్త తెలియడంతో బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు ఆమెకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరి మాజీ భార్య చివరిచూపును చూడడానికి మిథున్ వెళ్తాడా.. ? లేదా.. అనేది తెలియాల్సి ఉంది. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×