E-Paper
Advertisement

Realme GT 7 Smartphone: రికార్డుల వేటలో రియల్‌మీ.. ప్రపంచంలోనే తొలి 10,001 mAh బ్యాటరీ ఫోన్ లీక్..

Realme GT 7 Smartphone: రికార్డుల వేటలో రియల్‌మీ.. ప్రపంచంలోనే తొలి 10,001 mAh బ్యాటరీ ఫోన్ లీక్..
Advertisement

Realme GT 7 Smartphone:  స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో బ్యాటరీ అనేది ఇక చిన్న అంశం కాదు. రోజంతా ఫోన్ చేతిలో ఉండే పరిస్థితుల్లో బ్యాటరీ ఎంత ఎక్కువగా ఉంటే అంత నమ్మకం పెరుగుతోంది. ఈ ఏడాది మొదట్లోనే రియల్‌మీ భారీ బ్యాటరీతో కాన్సెప్ట్ ఫోన్‌ను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచేదుకు సిద్ధమైంది. అది రియల్‌మీ జిటి7 కాన్సెప్ట్ మోడల్ మాత్రమే కానీ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. అయితే ఇప్పుడు మరోసారి రియల్‌మీ పేరు వార్తల్లోకి వచ్చింది. ఈసారి 10,001mAh బ్యాటరీతో ఒక ఫోన్ లీక్ అవడం వల్ల టెక్ వర్గాల్లో భారీ చర్చ మొదలైంది. ఇది నిజమేనా రియల్ మీ ఇంత భారీ బ్యాటరీతో మార్కెట్లోకి వస్తోందా? అంటూ షాక్ కి గురవుతున్నారు. అది నిజమైన వార్తనా లేక కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాం.

10,001mAh బ్యాటరీతో రహస్య రియల్‌మీ ఫోన్

Advertisement

సోషల్ మీడియా వేదికగా ఉన్న టెలిగ్రామ్‌లో బయటకు వచ్చిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పోస్టులో కనిపించిన ఫోన్ మోడల్ నంబర్ RMX5107. ఈ ఫోన్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ ఏంటంటే, ఇందులో నేరుగా 10,001mAh బ్యాటరీని చూపించడం. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌లలో సాధారణంగా 5000 లేదా 6000mAh వరకు మాత్రమే చూశాం. అలాంటిది 10,001mAh అంటే ఇది పూర్తిగా హైలెట్ అనే చెప్పాలి. రియల్‌మీ గతంలో చూపించిన 10,000mAh కాన్సెప్ట్ ఫోన్ కంటే కూడా ఇది ఇంకా ఎక్కువ అని చెప్పొచ్చు.

రియల్‌మీ యూఐ 7.0, ఆండ్రాయిడ్ 16 

Advertisement

ఈ RMX5107 ఫోన్‌లో రియల్‌మీ యూఐ 7.0 పనిచేస్తున్నట్టు “About Device” స్క్రీన్‌లో కనిపించింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా తయారైన తాజా ఆపరేటింగ్ సిస్టమ్. గత నెలలోనే రియల్‌మీ దీన్ని అధికారికంగా ప్రకటించింది. కానీ ఇంకా చాలా ఫోన్‌లకు ఈ అప్‌డేట్ అందలేదు. అలాంటిది, లీక్ అయిన ఈ ఫోన్‌లోనే ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 కనిపించడం అంటే, ఇది కంపెనీ లోపల పరీక్ష దశలో ఉన్న మోడల్ అయ్యే అవకాశం బలంగా ఉంది.

ర్యామ్, స్టోరేజ్ వివరాలు ఎలా ఉన్నాయంటే

లీక్‌లో కనిపించిన వేరియంట్‌లో 12జీబీ రామ్, 256జీబీ స్టోరేజ్ ఉంది. దీనితో పాటు వర్చువల్ స్టోరేజ్‌ను రామ్‌గా ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. అంటే అవసరమైనప్పుడు స్టోరేజ్‌లో కొంత భాగాన్ని ర్యామ్‌లా ఉపయోగించుకోవచ్చు. భారీ బ్యాటరీతో పాటు ఎక్కువ ర్యామ్ ఇవ్వడం అంటే, ఈ ఫోన్‌ను హెవీ యూజ్ కోసం డిజైన్ చేస్తున్నారన్న మాట.

Also Read: Xiaomi 17 Ultra vs Pixel 10 Pro: షియోమీ 17 అల్ట్రా vs పిక్సెల్ 10 ప్రో.. భారత మార్కెట్‌లో బెస్ట్ ప్రీమియం ఫోన్ ఎవరు

హానర్‌తో పోల్చితే.. రియల్‌మీ రికార్డ్

ఇటీవలే హానర్ చైనాలో హానర్ పవర్ 2 అనే ఫోన్‌లను ప్రకటించింది. ఆ ఫోన్‌లో కూడా 10,000mah బ్యాటరీ ఉంటుందని కంపెనీ చెబుతోంది. కానీ ఇప్పుడు రియల్‌మీ లీక్ నిజమైతే, 1001mah బ్యాటరీతో హానర్ కంటే కూడా రియల్‌మీ ముందుకు వెళ్లినట్టే. బ్యాటరీ పరంగా చూస్తే, ఇది మార్కెట్‌లో కొత్త రికార్డ్ అవుతుంది.

హై-రెజ్ ఆడియో, సర్టిఫికేషన్ సమాచారం

ఈ రహస్య రియల్‌మీ ఫోన్‌కి హై-రెస్ ఆడియో సపోర్ట్ ఉంటుందని రిపోర్ట్ చెబుతోంది. అంటే ఆడియో క్వాలిటీ విషయంలో కూడా ఇది ప్రీమియం స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ రష్యాలో అమ్మకాలకు అవసరమైన సర్టిఫికేషన్ పొందిందట. అంటే ఇది కేవలం కాన్సెప్ట్ మాత్రమే కాకుండా,కమర్షియల్ మార్కెట్‌లో ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయని అర్థం.

రియల్‌మీ చూపించిన 10,000mah కాన్సెప్ట్ ఫోన్

ఇక్కడ ఒకసారి రియల్‌మీ గతంలో చూపించిన జిటి కాన్సెప్ట్ ఫోన్ గురించి మాట్లాడుకోవాలి. ఆ ఫోన్‌లో 10,000mah బ్యాటరీ ఉన్నప్పటికీ, దాని మందం 8.5mm కంటే తక్కువగా ఉండింది. బరువు కూడా కేవలం 200 గ్రాముల కాస్త ఎక్కువ మాత్రమే. అంటే భారీ బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ చాలా బరువుగా లేదా మందంగా కాకుండా ఉండేలా రియల్‌మీ డిజైన్ చేసింది.

మినీ డైమండ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి

రియల్‌మీ ఈ కాన్సెప్ట్ ఫోన్‌లో మినీ డైమండ్ ఆర్కిటెక్చర్ (Mini Diamond Architecture) అనే ప్రత్యేక అంతర్గత డిజైన్ వాడినట్టు చెప్పింది. దీని వల్ల ఫోన్ లోపలి భాగాలను కొత్తగా అమర్చడం సాధ్యమైంది. బ్యాటరీకి ఎక్కువ స్థలం ఇచ్చి, మదర్‌బోర్డ్‌ను చాలా చిన్నదిగా డిజైన్ చేశారు. రియల్‌మీ చెప్పిన ప్రకారం, ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆండ్రాయిడ్ మైన్‌బోర్డ్, వెడల్పు కేవలం 23.4mm మాత్రమే.

అల్ట్రా హై సిలికాన్ బ్యాటరీ టెక్నాలజీ

ఈ భారీ బ్యాటరీకి మరో ముఖ్యమైన విషయం టెక్నాలజీ. రియల్‌మీ ఇందులో అల్ట్రా హై సిలికాన్ కంటెంట్ అనోడ్ బ్యాటరీని వాడినట్టు తెలిపింది. ఇందులో సిలికాన్ నిష్పత్తి 10 శాతం ఉందని కంపెనీ చెబుతోంది. ఇది ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ రంగంలో అత్యధికమని రియల్‌మీ క్లెయిమ్. దీని వల్ల బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ 887Wh పర్ లీటర్ వరకు చేరింది. సాధారణ బ్యాటరీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంటే అదే సైజ్‌లో ఎక్కువ పవర్ నిల్వ చేయడం సాధ్యమవుతుంది.

లాంచ్ ఎప్పుడంటే?

ఇప్పటివరకు ఈ RMX5107 ఫోన్ లాంచ్ డేట్ గురించి రియల్‌మీ అధికారికంగా ఏమీ చెప్పలేదు. కానీ లీక్‌లు, సర్టిఫికేషన్ వివరాలు చూస్తే, ఇది కాన్సెప్ట్ దశ దాటినట్టు అనిపిస్తోంది. లాంచ్ అయితే, ఇది రియల్‌మీ నుంచి వచ్చిన అత్యధిక బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్‌గా రికార్డ్ అవుతుంది. ఎక్కువగా ట్రావెల్ చేసే వారు, గేమింగ్ చేసే వారు, రోజంతా చార్జర్ దగ్గర ఉండలేని వారికి ఈ తరహా ఫోన్‌లు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, ఈ సమాచారం నిజమైతే, బ్యాటరీ విషయంలో రియల్‌మీ మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×