E-Paper
Advertisement

Lady Director: 8 సినిమాలకే రిటైర్మెంట్.. ఈ లేడీ డైరెక్టర్‌కి ఏం అయింది?

Lady Director: 8 సినిమాలకే రిటైర్మెంట్.. ఈ లేడీ డైరెక్టర్‌కి ఏం అయింది?
Advertisement

Lady Director: సినిమా ఇండస్ట్రీలో మేల్ డైరెక్టర్స్ తో పోల్చుకుంటే లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే వీరంతా కూడా తమ అద్భుతమైన ప్రతిభతో, టేకింగ్ విజన్ తో మంచి విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే.అయితే ఉన్నదే తక్కువ మంది లేడీ డైరెక్టర్లు. పైగా మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. కానీ అప్పుడే రిటైర్మెంట్ అంటూ చేస్తున్న కామెంట్లు అభిమానులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే చేసింది 8 సినిమాలే కానీ ఆ లేడీ డైరెక్టర్ రిటైర్మెంట్ తీసుకుంటాను అని చెప్పి అందుకు తగ్గ కారణాన్ని కూడా వివరించింది. దీంతో అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె ఎవరు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెబుతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

రిటైర్ కావాలనుకుంటున్న లేడీ డైరెక్టర్..

ఆమె ఎవరో కాదు ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధా కొంగర. తాజాగా శివ కార్తికేయన్ హీరోగా, శ్రీ లీలా హీరోయిన్గా పొలిటికల్ పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో పరాశక్తి అనే చిత్రానికి దర్శకత్వం వహించింది. 2026 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది సుధా కొంగర. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె తన డ్రీమ్ గురించి చెబుతూ రిటైర్మెంట్ గురించి కూడా తెలిపింది.

Advertisement

సుధా కొంగర మాట్లాడుతూ.. “నాకు లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. అందుకే పూర్తిస్థాయి ప్రేమ కథను తెరకెక్కించాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాను. అది రజినీకాంత్ సార్ చేస్తే మరింత బాగుంటుంది. ఇప్పటికే నా వద్ద మంచి కథ ఉంది. దానిని నేను డెవలప్ చేయాలి. నిజానికి నేను అలసిపోయాను. అందుకే త్వరగానే రిటైర్ కావాలనుకుంటున్నాను “అంటూ తెలిపింది సుధా కొంగర. మొత్తానికైతే అలసిపోయానని అందుకే రిటైర్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

చేసింది 8 సినిమాలే..

ఇకపోతే సుధా కొంగర విషయానికి వస్తే.. ఈమె తన కెరీర్లో ఇప్పటివరకు చేసింది కేవలం ఎనిమిది సినిమాలే కావడం గమనార్హం. సుధా కొంగర ప్రసాద్ అయిన ఈమె వృత్తిరీత్యా సుధా కొంగర గా పిలువబడుతోంది. దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్ గా కెరియర్ ను ఆరంభించిన ఈమె ఎక్కువగా తమిళ్ చిత్రాలకు పనిచేస్తోంది .

Advertisement

తొలిసారి ద్రోహి అనే తమిళ చిత్రం ద్వారా దర్శకురాలిగా అరంగేట్రం చేసిన సుధా 2016లో వచ్చిన ద్విభాషా చిత్రం ఇరుధి సుత్రు అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకుంది. ఆ తర్వాత 2017 లో ఇదే చిత్రాన్ని తెలుగులో గురు అంటూ రీమేక్ చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకూ 8 చిత్రాలు చేసిన ఈమె తమిళ చిత్రాలలో ఎక్కువగా పనిచేసినా తెలుగమ్మాయి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించింది.

ALSO READ:Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై కేస్ ఫైల్.. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×