E-Paper
Advertisement

TG Panchayat Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది.. పూర్తి షెడ్యూల్ ఇదే

TG Panchayat Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది.. పూర్తి షెడ్యూల్ ఇదే
Advertisement

TG Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణికుమిదిని ప్రకటన చేశారు. 4,200 సర్పంచ్‌ స్థానాలకు 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు డిసెంబర్‌ 11న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎల్లుండి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ వెల్లడించారు.

షెడ్యూల్ ఇదే

మూడు దశల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

1.66 కోట్ల ఓటర్లు

Advertisement

‘ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాం. కొన్ని వివిధ కారణాల వల్ల అక్టోబర్‌ 9న ఈ షెడ్యూల్‌ పై హైకోర్టు స్టే విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారు. 4,236 సర్పంచ్‌ స్థానాలకు 37,440 వార్డులకు మొదటి తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తాం. నవంబర్ 27 నుంచి తొలి దశ పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నాం. రెండో విడత ఎన్నికలకు నవంబర్ 30 నుంచి, మూడో దశ ఎన్నికలకు డిసెంబర్‌ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నాం. రెండో విడతలో 4,333 సర్పంచ్‌ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనున్నాయి. మూడో విడతలో 4,159 సర్పంచ్‌ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్‌ నిర్వహిస్తాం’ అని ఎస్ఈసీ రాణి కుమిదిని తెలిపారు.

Also Read: GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ.. బీజేపీ, మజ్లిస్ మధ్య తోపులాట

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×