E-Paper
Advertisement

7,000 mAh బ్యాటరీ, 10 గంటల వీడియో ప్లే బ్యాక్.. రియల్ మీ నార్జో 100 లైట్ 5G ఫోన్ ఫీచర్లు ఇవే!

7,000 mAh బ్యాటరీ, 10 గంటల వీడియో ప్లే బ్యాక్.. రియల్ మీ నార్జో 100 లైట్ 5G ఫోన్ ఫీచర్లు ఇవే!
Advertisement

Realme Narzo 100 Lite: చైనాకు చెందిన రియల్ మీ నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. నార్జో 100 లైనప్‌లో ఫస్ట్ మోడల్‌గా.. నార్జో 100 లైట్ 5G మంగళవారం భారత్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 21న అమెజాన్, రియల్‌మీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ లో సేల్స్ స్టార్ట్ అవుతాయి. ఫ్రాస్ట్ సిల్వర్, థండర్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. స్లిమ్ డిజైన్, 7,000mAh బ్యాటరీతో ఉన్న ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లేదా 70 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. రియల్‌మీ నార్జో ఫోన్‌ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్‌సెట్ ఎనర్జీని అందిస్తుంది. ఇది 13-మెగాపిక్సెల్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మీ నార్జో 100 లైట్ 5G ధర, ఆఫర్లు

రియల్‌మీ నార్జో 100 లైట్ 5G బేల్ వేరియంట్ 4GB RAM + 64GB స్టోరేజీ ధర రూ. 13,499 నుంచి స్టార్ట్ అవుతుంది. మరోవైపు, 4GB RAM, 128GB స్టోరేజీతో వస్తున్న హై ఎండ్ ఆప్షన్ ధర రూ. 14,499గా ఉంది. చివరగా, టాప్ ఆఫ్ ది లైన్ 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 16,499. ఈ లాంచింగ్ ఆఫర్ గా కంపెనీ రూ. 1,500 వరకు తగ్గింపును అందిస్తుంది.

నార్జో 100 లైట్ 5G ఫీచర్లు

Advertisement

రియల్‌మీ నార్జో 100 లైట్ 5G డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్. ఇది ఆండ్రాయిడ్ 16 బేస్డ్ రియల్‌మీ UI 7.0 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 6.8 inches LCD స్క్రీన్ ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 90.5 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోను అందిస్తుంది. దుమ్ము, ధూళి నుంచి రక్షణలో భాగంగా IP64 రేటింగ్‌ను అందిస్తుంది కంపెనీ. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 6GB RAM, 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ, మైక్రో SD కార్డు 2TB స్టోరీజ్ ఎక్స్ టెండ్ చేసుకోవచ్చు. హీట్ కంట్రోల్ కు ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ ఉంది.

Also Read: iPhone 17 సిరీస్‌పై ఊహించని డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్ యాపిల్ డేస్ సేల్ పూర్తి వివరాలివే!

కెమెరా ఫీచర్లు

Advertisement

రియల్‌మీ నార్జో 100 లైట్ 5G డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 1080p/30 fps వరకు వీడియోలను రికార్డు చేస్తుంది. 7,000mAh బ్యాటరీతో 15W వైర్డ్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌ ను అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 11 గంటల మెసేజింగ్, 70 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 34 గంటల కాలింగ్ లేదా 12 గంటల గేమింగ్ సౌకర్యం అందిస్తుంది. ఈ ఫోన్ 8.45mm మందంతో సుమారు 212g వెయిట్ ఉంటుంది.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×