E-Paper
Advertisement

Airtel బెస్ట్ 30 డేస్ ప్లాన్స్.. 60GB డేటా, అపరిమిత కాల్స్.. ఉచిత సబ్‌స్క్రిప్షన్స్!

Airtel బెస్ట్ 30 డేస్ ప్లాన్స్.. 60GB డేటా, అపరిమిత కాల్స్.. ఉచిత సబ్‌స్క్రిప్షన్స్!
Advertisement

Airtel Plans: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్.. తన యూజర్ల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్లీ ప్లాన్స్ ను 28 రోజులకు బదులుగా 30 రోజుల పూర్తి క్యాలెండర్ కాలానికి అందిస్తోంది. వీటి ద్వారా యూజర్ ప్రతీనెల ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునే సౌలభ్యం కలగడమే కాకుండా.. అదనపు డేటా ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. 30 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్ టెల్ అందిస్తున్న అత్యుత్తమైన ప్లాన్స్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

రూ.319 ప్లాన్

ఎయిర్ టెల్ తీసుకొచ్చిన ఈ మంత్లీ ప్లాన్.. 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. రోజుకు 1.5GB డేటా యూజర్ పొందవచ్చు. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు, ఎయిర్ టెల్ మ్యూజిక్, 30GB గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు ప్రయోజనాలు సైతం లభిస్తాయి.

రూ.355 ప్లాన్..

Advertisement

ఈ ప్లాన్ లో 30 రోజుల వ్యాలిడిటీతో 25GB డేటా యూజర్ లభిస్తుంది. అలాగే అపరిమిత కాల్స్, 300 SMSలు యూజర్ పొందవచ్చు. డేటా పరిమితి అయిపోతే ప్రతీ 1MB డేటాకు 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్లాన్ లో అదనపు ప్రయోజనాల కింద హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం యాక్సెస్ ను సైతం ఇచ్చారు.

రూ.379 ప్లాన్

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ప్రతీరోజూ 2GB డేటా పొందవచ్చు. అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం, ఎయిర్ టెల్ మ్యూజిక్, హలో ట్యాన్స్, 30GB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్ కింద యూజర్ కు లభిస్తాయి.

రూ.429 ప్లాన్..

Advertisement

అధిక డేటా అవసరమైన వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ కింద ప్రతీ రోజు 2.5GB డేటా పొందవచ్చు. ఫ్రీ కాల్స్, 100 SMSలు సైతం లభిస్తాయి. 5G నెట్ వర్క్ అందుబాటులో ఉంటే 5G డేటాను ఈ ప్లాన్ కింద ఉపయోగించుకోవచ్చు.

Also Read: Layoffs to Business: లేఆఫ్‌లో రెండుసార్లు ఉద్యోగం ఫట్.. కట్ చేస్తే నెలకు రూ.1.3 కోట్లు సంపాదన, అదెలా?

రూ. 589, రూ.605 ప్లాన్స్

డేటా పరిమితి మరింత అధికంగా కోరుకునేవారి కోసం ఎయిర్ టెల్ ఈ ప్లాన్స్ తీసుకొచ్చింది. రూ.589 ప్లాన్ ద్వారా యూజర్ కు 50GB లభిస్తే.. రూ.605 ప్లాన్ తో 60GB అందనుంది. అపరిమిత కాల్స్, నెలకు 300SMSలు కూడా యూజర్ పొందవచ్చు. ఓటీటీ స్ట్రీమింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఈ ప్లాన్స్ ప్రయోజనకరంగా ఉండనున్నాయి.

Also Read: Bihar New CM: బిహార్‌కు కొత్త సీఎం.. నితీశ్ స్థానంలోకి సామ్రాట్ చౌదరి.. ఆయన ఎంత పవర్‌ఫుల్లో తెలుసా?

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×