E-Paper
Advertisement

Smartphone Comparison: రియల్‌మి నార్జో 90x vs ఓప్పో K13x vs గెలాక్సీ F16.. రూ.13000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: రియల్‌మి నార్జో 90x vs ఓప్పో K13x vs గెలాక్సీ F16.. రూ.13000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Realme Narzo 90x vs Oppo K13x vs Samsung F16 Smartphone comparison| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఇండియాలో ఇటీవలే రియల్‌మీ నార్జో 90x 5Gను విడుదల చేసింది. ఈ ఫోన్ కు పోటీగా మార్కెట్లో ఓప్పో K13x 5G, శాంసంగ్ గెలాక్సీ F16 5Gతో నేరుగా పోటీ పడుతోంది. మూడు ఫోన్లూ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చే 5G కొనుగోలుదారులను టార్గెట్ చేస్తాయి. అందరూ సరసమైన ధరల్లో ఆధునిక ఫీచర్లు ఇస్తాయి. అయితే స్పెసిఫికేషన్లు, పనితీరులో మూడు ఫోన్ల మధ్య తేడాలు ఉన్నాయి. ఏ ఫోన్ మీ అవసరాలకు సరిపోతుందో ఈ ివరాలు పోల్చి చూద్దాం.

ధర, స్టోరేజ్ వేరియంట్లు

రియల్‌మీ నార్జో 90x 5G రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB వేరియంట్ రూ.15,499.
ఓప్పో K13x 5G ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499.
శాంసంగ్ గెలాక్సీ F16 5G కూడా ఒకే వేరియంట్.. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ రూ.12,499.
రియల్‌మీ పోటీదారుల కంటే ఎక్కువ RAM ఆప్షన్లు ఇస్తోంది.

డిస్‌ప్లే, విజువల్ ఎక్స్‌పీరియన్స్

రియల్‌మీ నార్జో 90x 5Gలో 6.80 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 720 x 1570 పిక్సెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. ఓప్పో K13x 5Gలో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే, 1604 x 720 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్. శాంసంగ్ గెలాక్సీ F16 5Gలో 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, ఫుల్ HD+ (1080 x 2340 పిక్సెల్స్), 90Hz రిఫ్రెష్ రేట్. మూడింటిలో సాంసంగ్ బెస్ట్ డిస్‌ప్లే క్వాలిటీ ఇస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్

రియల్‌మీ నార్జో 90x 5Gలో 7,000mAh భారీ బ్యాటరీ, 60W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. హెవీ యూజర్లు, గేమర్లకు సరిపోతుంది. ఓప్పో K13x 5Gలో 6,000mAh బ్యాటరీ, 45W సూపర్‌వూక్ ఛార్జింగ్. శాంసంగ్ గెలాక్సీ F16 5Gలో 5,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్. పోటీదారులతో పోలిస్తే శాంసంగ్ బ్యాటరీ సాధారణంగా ఉంది.

సాఫ్ట్‌వేర్, యూజర్ ఇంటర్‌ఫేస్

రియల్‌మీ నార్జో 90x 5G ఆండ్రాయిడ్ 15తో, రియల్‌మీ UI 6.0తో వస్తుంది.
ఓప్పో K13x 5G ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కలర్‌ఓఎస్ 15తో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ F16 5G ఆండ్రాయిడ్ 15తో, వన్ UI 7 ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.
శాంసంగ్ దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇస్తుంది.

ప్రాసెసర్, పర్‌ఫామెన్స్

మూడు ఫోన్లలోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంది. రోజువారీ పనులు స్మూత్‌గా జరుగుతాయి. క్యాజువల్ గేమింగ్‌కు సరిపోతుంది. ఈ పర్‌ఫామెన్స్ లో తేడా ప్రధానంగా ర్యామ్ మీద ఆధారపడి ఉంటుంది.

కెమెరా ఫీచర్లు

రియల్‌మీ నార్జో 90x 5Gలో 50MP రియర్ కెమెరా (f/1.8), 8MP ఫ్రంట్ కెమెరా. ఓప్పో K13x 5Gలో 50MP మెయిన్ + 2MP పోర్ట్రైట్, 8MP ఫ్రంట్. శాంసంగ్ గెలాక్సీ F16 5Gలో ట్రిపుల్ కెమెరా.. 50MP మెయిన్ + 5MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో, 13MP ఫ్రంట్. శాంసంగ్ అత్యంత వెర్సటైల్ కెమెరా సిస్టమ్ ఇస్తుంది.

Also Read: బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

కనెక్టివిటీ ఆప్షన్లు

మూడు ఫోన్లలోనూ 5G సపోర్ట్ ఉంది. రియల్‌మీలో బ్లూటూత్ 5.3, Wi-Fi 5, GPS, USB టైప్-C. ఓప్పోలో బ్లూటూత్ 5.4, Wi-Fi, డ్యూయల్ 4G VoLTE. సాంసంగ్‌లో బ్లూటూత్ 5.3, Wi-Fi, GPS, USB టైప్-C ఉన్నాయి.

ఏది కొనుగోలు చేయాలి?

పెద్ద బ్యాటరీ కావాలంటే రియల్‌మీ నార్జో 90x 5G బెస్ట్. తక్కువ ధరలో బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు కావాలంటే ఓప్పో K13x 5G. మంచి డిస్‌ప్లే, వెర్సటైల్ కెమెరా కావాలంటే శాంసంగ్ గెలాక్సీ F16 5G ఎంచుకోండి. మీ ఫోన్ యూసేజ్, బడ్జెట్ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోండి.

Related News

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

Big Stories

×