E-Paper
Advertisement

Smartphone Comparison: రియల్‌మీ నార్జో 90x vs పోకో C85 vs రెడ్‌మి 15C.. తక్కువ బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: రియల్‌మీ నార్జో 90x vs పోకో C85 vs రెడ్‌మి 15C.. తక్కువ బడ్జెట్‌లో ఏది బెస్ట్?
Advertisement

Realme Narzo 90x vs Poco C85 vs Redmi 15C Comparison| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తాజాగా నార్జో 90x 5G మోడల్‌ని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్‌కు పోటీగా ఇటీవల విడుదలైన పోకో C85 5G, రెడ్‌మీ 15C 5Gలకు మార్కెట్‌లో ఉన్నాయి. ఈ రెండు షావోమి కంపెనీకి చెందిన ఫోన్లు. ఈ మూడు కూడా బడ్జెట్ ధరలో 5G కనెక్టివిటీ ఇచ్చే ఫోన్‌లు. ఆధునిక ఫీచర్స్‌తో విడుదలయ్యాయి. ఇక్కడ మూడింటి స్పెసిఫికేషన్స్ సులువుగా పోల్చి చూద్దాం.

ధరలు ఎలా ఉన్నాయి?

రియల్‌మీ నార్జో 90x: 6GB RAM – రూ.13,999; 8GB RAM – రూ.15,499.
పోకో C85: 4GB RAM – రూ.11,999; 6GB RAM – రూ.12,999.
రెడ్‌మి 15C: 4GB RAM – రూ.12,499; 6GB RAM – రూ.13,999.
స్టార్టింగ్ ధర పోల్చి చూస్తే.. పోకో C85 అతి తక్కువలో అందుబాటులో ఉంది. కానీ ఎక్కువ ర్యామ్ కావాలంటే రియల్‌మీ నార్జో 90x బెటర్ ఆప్షన్.

డిస్‌ప్లే ఎలా ఉంది?

Advertisement

రియల్‌మీ నార్జో 90x లో 6.80 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్.
షావోమి బ్రాండ్ కి చెందిన పోకో C85, రెడ్‌మి 15Cలో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే – 120Hz రిఫ్రెష్ రేట్, 810 నిట్స్ బ్రైట్‌నెస్. రెండూ స్పెస్ ఒకేలా ఉన్నాయి.

బ్యాటరీ, ఛార్జింగ్ ఎలా ఉంది?

రియల్‌మీ నార్జో 90xలో 7,000mAh బ్యాటరీ + 60W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.
పోకో C85, రెడ్‌మి 15Cలో 6,000mAh బ్యాటరీ + 33W ఛార్జింగ్ ఉంది. పోకోలో రివర్స్ ఛార్జింగ్ ఉంది. బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్‌లో Realme టాప్.

సాఫ్ట్‌వేర్ ఎలా ఉంది?

Advertisement

మూడు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15తో వస్తాయి. రియల్‌మీ నార్జోలో Realme UI 6.0, Poco, రెడ్‌మి లో HyperOS (Pocoలో 2.2, Redmiలో 2.0). యూజర్ ఇంటర్‌ఫేస్ ప్రిఫరెన్స్ బట్టి మారుతుంది.

ప్రాసెసర్, పర్ఫామెన్స్ ఎలా ఉంది?

మూడు ఫోన్‌లలో మిడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది (6nm). పర్ఫామెన్స్ దాదాపు ఒకేలా ఉంటుంది.

కెమెరా ఎలా ఉంది?

రియల్‌మీ నార్జో 90x, పోకో C85లో 50MP రియర్ + 8MP ఫ్రంట్ కెమెరా.
రెడ్‌మి 15Cలో 50MP ప్రైమరీ + సెకండరీ రియర్ కెమెరా + 8MP ఫ్రంట్. మూడింటి కెమెరా పర్ఫామెన్స్ సమానంగా ఉంటుంది.

కనెక్టివిటీ ఫీచర్స్ ఏమిటి?

రియల్‌మీ లో 5G, Wi-Fi 5, Bluetooth 5.3.
పోకోలో Bluetooth 5.4, 3.5mm జాక్.
రెడ్‌మి లో 5G SA/NSA, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.4.

Also Read: వాట్సాప్‌ స్టేటస్‌, చానల్‌లో యాడ్స్ వస్తున్నాయా? తొలగించాలంటే ఇలా చేయండి

ఏ ఫోన్ బెస్ట్?

బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ కావాలంటే రియల్‌మీ నార్జో 90x. తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలంటే పోకో C85. బ్యాలెన్స్‌డ్ ఫీచర్స్ కావాలంటే రెడ్‌మి 15C. మీ బడ్జెట్, బ్యాటరీ అవసరాలు, సాఫ్ట్‌వేర్ ప్రిఫరెన్స్ బట్టి ఎంచుకోండి.
ఈ మూడు ఫోన్‌లు బడ్జెట్ 5G సెగ్మెంట్‌లో మంచి ఆప్షన్స్. మీ అవసరాలు చూసి కొనండి!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×