E-Paper
Advertisement

Smartphone Comparison: రియల్‌మీ P4 లైట్ 4G vs గెలాక్సీ A07 4G vs టెక్నో పాప్ 9 5G..రూ.10,000 బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?

Smartphone Comparison: రియల్‌మీ P4 లైట్ 4G vs గెలాక్సీ A07 4G vs టెక్నో పాప్ 9 5G..రూ.10,000 బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?

Realme P4 Lite 4G vs Samsung Galaxy A07 4G vs Tecno Pop 9 5G Smartphone Comparison| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఇటీవల రియల్‌మీ P4 లైట్ 4Gని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.10,000లోపు బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలనుకునే వారి కోసం రియల్‌మీ తీసుకొచ్చింది. మార్కెట్‌లో ఇదే ధరలో ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ A07 4G, టెక్నో పాప్ 9 5G ఉన్నాయి. మూడు ఫోన్లూ తక్కువ ధరలో మంచి ఫీచర్లతో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు వీటి స్పెసిఫికేషన్లను వివరంగా పోల్చి చూద్దాం.

ధరల పోలిక

రియల్‌మీ P4 లైట్ 4G 4GB+64GB మోడల్ ధర రూ.9,999. 4GB+128GB వేరియంట్ రూ.11,999.
శాంసంగ్ గెలాక్సీ A07 4G 4GB+64GB ధర రూ.8,999.
టెక్నో పాప్ 9 5G 4GB+128GB ధర రూ.9,499.
మూడు ఫోన్లలో శాంసంగ్ అతి తక్కువ ధరలో ఉంది. టెక్నో ఎక్కువ స్టోరేజ్ తక్కువ ధరలో ఇస్తోంది.

డిస్‌ప్లే, డిజైన్

రియల్‌మీ P4 లైట్ 4Gలో 6.67 ఇంచ్ HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. 720×1600 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. పీక్ బ్రైట్‌నెస్ 563 నిట్స్. శాంసంగ్ గెలాక్సీ A07 4Gలో 6.7 ఇంచ్ PLS LCD డిస్‌ప్లే, HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. టెక్నో పాప్ 9 5Gలో ఇప్స్ LCD డిస్‌ప్లే, 720×1612 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. రియల్‌మీ, టెక్నోలో స్మూత్ స్క్రోలింగ్ ఉంటుంది. శాంసంగ్ స్క్రీన్ కొంచెం పెద్దది కానీ రిఫ్రెష్ రేట్ తక్కువ.

ప్రాసెసర్, పనితీరు

రియల్‌మీ P4 లైట్ 4Gలో Unisoc T7250 ప్రాసెసర్ ఉంది. 12nm టెక్నాలజీతో తయారైంది. సామ్సంగ్ గెలాక్సీ A07 4Gలో మీడియాటెక్ హీలియో G99 ఉంది. ఇది బ్యాలెన్స్‌డ్ పనితీరు ఇస్తుంది. టెక్నో పాప్ 9 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఉంది. ఇది 5G సపోర్ట్ చేస్తుంది. టెక్నో అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్ ఇచ్చింది. శాంసంగ్ గేమింగ్‌కు మంచిది. రియల్‌మీ రోజువారీ ఉపయోగానికి సరిపోతుంది.

ఆపరేటింగ్ సిస్టమ్

రియల్‌మీ P4 లైట్ 4G Android 15తో Realme UI 6.0తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A07 4G Android 15తో One UI 7తో వస్తుంది. టెక్నో పాప్ 9 5G Android 14తో వస్తుంది. రియల్‌మీ, శాంసంగ్ కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ ఇచ్చాయి. టెక్నో అప్‌డేట్లు తర్వాత ఇవ్వవచ్చు.

కెమెరా సెటప్

రియల్‌మీ P4 లైట్ 4Gలో 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A07 4Gలో 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. టెక్నో పాప్ 9 5Gలో 48MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ రియర్ కెమెరా బలంగా ఉంది. టెక్నో కూడా హై రిజల్యూషన్ ఇచ్చింది. రియల్‌మీలో బేసిక్ కెమెరా సెటప్ ఉంది.

Also Read: స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ గార్డ్‌గా చాట్‌జిపిటి.. ఫోన్‌లో మాల్‌వేర్‌ని సెకండ్స్‌లో పట్టేస్తుంది

బ్యాటరీ, ఛార్జింగ్

రియల్‌మీ P4 లైట్ 4Gలో 6,300mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్, 6W రివర్స్ ఛార్జింగ్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A07 4Gలో 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. టెక్నో పాప్ 9 5Gలో 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ ఉన్నాయి. రియల్‌మీ అతి పెద్ద బ్యాటరీ ఇచ్చింది. శాంసంగ్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఇచ్చింది.

మీ అవసరాలు, ప్రాధాన్యతలు చూసి ఎంచుకోవండి. మంచి కెమెరా, బ్యాలెన్స్‌డ్ పనితీరు కావాలంటే శాంసంగ్ గెలాక్సీ A07 తీసుకోండి. 5G సపోర్ట్, స్మూత్ డిస్‌ప్లే కావాలంటే టెక్నో పాప్ 9 5G బెస్ట్. పెద్ద బ్యాటరీ లైఫ్ కావాలంటే రియల్‌మీ P4 లైట్ 4G ఎంచుకోండి. మూడు ఫోన్లూ రూ.10,000లోపు గొప్ప వాల్యూ ఇస్తున్నాయి.

Related News

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×