E-Paper
Advertisement

Aeroponic Potato: ఆహా.. అక్కడ బంగాళదుంపలను గాల్లో పండిస్తున్నారు, అదెలా సాధ్యం?

Aeroponic Potato: ఆహా.. అక్కడ బంగాళదుంపలను గాల్లో పండిస్తున్నారు, అదెలా సాధ్యం?
Advertisement

Aeroponic Potato: సాధారణంగా బంగాళాదుంపలు భూమిలోపల పండుతాయి. సంప్రదాయ పంటలకు ఆధునిక సాంకేతికతను జోడిస్తున్నారు పరిశోధకులు. ఇకపై ఆలూ గాలిలో కూడా పండుతుందని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌మాత విజయరాజే సింధియా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఏరోపోనిక్స్ టెక్నిక్ సాయంతో “గాలిలో” బంగాళాదుంపలను పెంచే పద్ధతిని విజయవంతంగా నిర్వహించారు. ఈ టెక్నిక్ తో అధిక నాణ్యత, వ్యాధులను తట్టుకునేలా బంగాళాదుంపలను ఉత్పత్తి చేయడానికి సహాపడుతుంది.

బంగాళాదుంపల వంటి ప్రధాన పంటలకు ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తే మరింత దిగుబడి పెరుగుతుంది. దేశంలో పెరుగుతున్న ఆహార భద్రతతో అవసరాలతో సంప్రదాయ వ్యవసాయానికి సాంకేతికత తోడవుతుంది. వైరస్ రహిత, అధిక నాణ్యత విత్తనాలను పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు.

గాలిలో బంగాళాదుంపలను ఎలా పెంచాలి?

Advertisement

ఏరోపోనిక్స్ పద్ధతిలో నేల లేకుండా మొక్కలను పెంచే విధానం. ఇక్కడ వేర్లు గాలిలో వేలాడదీసి, పోషకాలు అధికంగా ఉండే నీటిని చల్లుతారు. మొక్కలు పోషకాల కోసం నేలపై ఆధారపడే సాంప్రదాయ వ్యవసాయం లాగా కాకుండా, ఏరోపోనిక్ పద్ధతిలో ఖనిజాలను నేరుగా వేర్లకు అందిస్తారు. మొక్కల వేర్లకు ఆక్సిజన్‌ను గరిష్టంగా అందించడంతో నీరు, పోషకాల కచ్చితమైన మొత్తాల్లో మొక్కలకు చేరుతాయి. భూమిపై సాగుతో పోలిస్తే వేర్లు ఎక్కువ ఆక్సిజన్‌ను పొందుతాయి. దీంతో మొక్క వేగవంతమైన పెరుగుదలను, పోషకాలను గ్రహించడానికి ఉపయోగపడతాయి.

పాత విధానమే

ఈ వ్యవస్థను గ్రీన్‌హౌస్‌లు లేదా నెట్ హౌస్‌ల వంటి క్లోజ్ డ్ నిర్మాణాల లోపల పనిచేస్తుంది. ఇక్కడ ఉష్ణోగ్రత, తేమ, నీటిపారుదల సైకిల్ ను జాగ్రత్తగా నియంత్రించవచ్చు.
ఈ సాంకేతికత భవిష్యత్తుకు అనుకూలంగా ఉంటుంది. ఏరోపోనిక్స్ కొత్తదేం కాదు. 1920లలోనే శాస్త్రవేత్తలు గాలిలో మొక్కల వేర్ల అభివృద్ధిని అధ్యయనం చేశారు. “ఏరోపోనిక్స్” అనే పదం అధికారికంగా 1957లో ఉపయోగించారు. 1980 నుంచి కమర్షియల్ అయింది.

ప్రధాన తేడా ఏమిటి?

Advertisement

బంగాళాదుంపలను సాధారణంగా ఆలూ విత్తనాలు ఉపయోగించి పెంచుతారు. ఒక పంట నుంచి మరొక పంచ ఇలా వృద్ధి చెందుతాయి, అలాగే తమ వ్యాధులను సంక్రమిస్తాయి. ఏరోపోనిక్ వ్యవస్థలో శాస్త్రవేత్తలు నియంత్రణ పరిస్థితులలో “మినీట్యూబర్‌లు” లలో పెంచుతారు. వ్యాధులు లేని ఆలూ విత్తనాలను ఉత్పత్తి కోసం వాడతారు.
ఆరోగ్యకరమైన పంటలు, అధిక దిగుబడిని ఉత్పత్తి చేయడానికి ఈ విత్తనాలను పొలాలలో వాడుకోవచ్చు.

మధ్యప్రదేశ్ యూనివర్సిటీ ఏరోపోనిక్స్ యూనిట్ కొత్త పద్ధతిని కనిపెట్టడం కంటే స్థానిక బంగాళాదుంప విత్తన ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తుందని పరిశోధకులు తెలిపారు. సంప్రదాయ నర్సరీ పద్ధతులతో పోలిస్తే, ఏరోపోనిక్స్ తక్కువ నీరు, ప్రాంతాలలో ఎక్కువ ఉత్పత్తులను ఇస్తాయి.

Also Read:  మీ ఊపిరితిత్తులు సేఫేనా? గ్రేటర్ హైదరాబాద్‌ను మింగేస్తున్న సల్ఫర్ డయాక్సైడ్!

 

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×